చిన్న కార్ల మీద డబ్బు వృథా చేయకండి... ఒకేసారి 8-9 మందికి సరిపోయే MPVలకు ఫేస్‌లిఫ్ట్‌లు వస్తున్నాయి!
భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో గత కొన్నేళ్లుగా గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు SUVలకే ఎక్కువ ప్రాధాన్యం ఉండగా, ఇప్పుడు అదే వేగంతో MPVల మార్కెట్ కూడా విస్తరిస్తోంది. పెద్ద కుటుంబాలు, ఎక్కువ ప్రయాణాలు, అలాగే కంఫర్ట్‌కు ప్రాధాన్యం పెరగడం ఈ మూడు కారణాలు కలిసివచ్చి MPVలపై డిమాండ్‌ను గణనీయంగా పెంచుతున్నాయి. మూడు వరుసల సీటింగ్, పెద్ద బూట్ స్పేస్, కుటుంబంతో కలిసి లాంగ్ ట్రిప్స్‌కు అనుకూలంగా ఉండటం వల్ల ఇవి చాలా మందికి ఫస్ట్ ఛాయిస్‌గా మారుతున్నాయి. ఈ ట్రెండ్‌ను గమనించిన కార్ల తయారీ సంస్థలు కూడా తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. SUVలతో పాటు, MPV సెగ్మెంట్‌లో కూడా కొత్త మోడళ్లను తీసుకురావడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో మార్కెట్లోకి విడుదల కాబోతున్న కొన్నిఎంపీవీల గురించి చూద్దాం.
టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్: భారత మార్కెట్లో MPV సెగ్మెంట్‌కు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన మోడళ్లలో ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ ముందువరుసలో ఉంటుంది. 2022లో విడుదలైన ఇది, ఫ్యామిలీ కార్‌గా మాత్రమే కాకుండా ప్రీమియం అనుభవాన్ని అందించే MPVగా నిలుస్తుంది. ఇప్పుడు అదే మోడల్‌న ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌పై పని చేస్తున్నట్లు సమాచారం. అంచనాల ప్రకారం, ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్‌ను 2026 చివరి నాటికి భారత మార్కెట్లో విడుదల చేయచ్చు.

మారుతి సుజుకి YMC : భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న సమయంలో, మారుతి సుజుకి తన EV ప్లాన్‌లను వేగవంతం చేస్తోంది. గత ఫిబ్రవరిలో తన మొదటి ఎలక్ట్రిక్ కారు అయిన Maruti Suzuki e Vitaraను పరిచయం చేసిన కంపెనీ, ఇప్పుడు మరొక కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. ఈసారి, కేవలం SUV కాకుండా MPV సెగ్మెంట్‌లోకి అడుగుపెడుతూ రెండవ ఎలక్ట్రిక్ మోడల్‌ను తీసుకురావాలని యోచిస్తోంది.
ప్రస్తుతం "YMC" అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి జరుగుతున్న ఈ మోడల్‌ను 2026 సెప్టెంబర్-అక్టోబర్ మధ్యలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే, ఫ్యామిలీ కార్ సెగ్మెంట్‌లో కూడా ఎలక్ట్రిక్ ఆప్షన్ ఇవ్వాలని మారుతి స్పష్టంగా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పాలి. ఈ కొత్త ఎలక్ట్రిక్ MPVను కూడా అదే Heartect-e ప్లాట్‌ఫామ్‌పై నిర్మిస్తున్నారని సమాచారం. ఈ కారు తక్కువ బరువు, మెరుగైన ఎఫిషియెన్సీ, అలాగే మంచి రేంజ్‌ను అందించే అవకాశాలు ఉన్నాయి.

మారుతి సుజుకి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ అండ్ టయోటా రూమియన్ ఫేస్‌లిఫ్ట్ : భారత మార్కెట్లో ఫ్యామిలీ కార్ల సెగ్మెంట్‌లో ఎప్పటికప్పుడు ముందంజలో ఉండే మోడళ్లలో మారుతి సుజుకి ఎర్టీగా ఒకటి. ఇదే ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించిన టయోటా రూమియన్ కూడా మార్కెట్లో మంచి ఆదరణను పొందుతోంది. ఇప్పుడు ఈ రెండు మోడళ్లకు మరింత ఆకర్షణను తీసుకురావడానికి, ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్‌ను అందించడానికి కంపెనీలు సిద్ధమవుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం, ఈ ఏడాదిలోనే ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని మారుతి సుజుకి యోచిస్తోంది. సాధారణంగా సుజుకి మోడల్‌లో మార్పులు వచ్చిన తర్వాత, అదే మార్పులను టయోటా బ్రాండ్ మోడల్‌లో కూడా అమలు చేస్తుంది. అందుకే ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ విడుదలైన కొద్ది నెలల్లోనే రూమియన్ ఫేస్‌లిఫ్ట్ కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు మోడళ్లు Suzuki, Toyota భాగస్వామ్యంతో రూపొందించబడుతున్నాయన్న విషయం తెలిసిందే.

కియా కార్నివాల్ హైబ్రిడ్ : లగ్జరీ MPV సెగ్మెంట్‌లో Kia Carnival ఒకటి. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు Kia కొత్త అప్‌డేట్‌పై పని చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, కియా కార్నివాల్‌కు త్వరలో స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్‌ను జోడించే అవకాశం ఉంది. ప్రస్తుతం విదేశీ మార్కెట్లలో ఈ MPV 1.6-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్‌తో అందుబాటులో ఉండటం గమనార్హం. అదే సెటప్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications