సోలార్ కారు వచ్చేసింది! సూర్యశక్తితో 3,000 కి.మీలు తిరగొచ్చు.. రూ.4 లక్షల లోపే!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విభాగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో టాటా మోటార్స్, మహీంద్రా, ఎంజీ మోటార్ వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే తమదైన ముద్ర వేసుకున్నాయి. అయితే ఈ రంగంలో పెద్ద సంస్థలకే కాకుండా చిన్న స్టార్టప్‌లకు కూడా అవకాశాలు విస్తృతంగా కనిపిస్తున్నాయి. అలాంటి కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్న స్టార్టప్‌లలో పూణేకు చెందిన వేవ్ మొబిలిటీ (Vayve Mobility) ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ కంపెనీ తీసుకొచ్చిన వేవ్ ఈవా (Vayve Eva) ఎలక్ట్రిక్ కారు సాధారణ కార్ల కంటే భిన్నంగా, వినూత్నతకు ప్రతీకగా నిలుస్తోంది. నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని దీన్ని చాలా కాంపాక్ట్ డిజైన్‌తో రూపొందించారు. రద్దీగా ఉండే రోడ్లలో సులభంగా నడపడం, ఇరుకైన పార్కింగ్ స్థలాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిలపడం ఈ కారుతో సాధ్యమవుతుంది.

ముఖ్యంగా రోజువారీ చిన్న దూర ప్రయాణాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కారులో నిజమైన హైలైట్ పైకప్పుపై అమర్చిన సోలార్ ప్యానెల్. ఇదే ఈ వాహనాన్ని ఇతర ఎలక్ట్రిక్ కార్ల నుంచి పూర్తిగా వేరుచేస్తుంది. సూర్యకాంతిని ఉపయోగించి బ్యాటరీకి అదనపు శక్తిని అందించే ఈ సిస్టమ్, వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని కలిగిస్తుంది. ప్రత్యేకంగా భారతదేశం వంటి సూర్యరశ్మి ఎక్కువగా లభించే దేశంలో ఇది చాలా ప్రాక్టికల్ ఐడియాగా మారుతుంది.

Vayve Eva Solar Car India Price Battery Range Bookings

రోజూ కొంతమేరకు అయినా సోలార్ ద్వారా చార్జ్ కావడం వల్ల విద్యుత్‌పై ఆధారపడే స్థాయి కొంత తగ్గుతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, పైకప్పుపై సోలార్ ప్యానెల్‌తో భారత మార్కెట్లో విడుదలైన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారుగా వేవ్ ఈవా గుర్తింపు పొందింది. ఇది కేవలం ఒక కొత్త మోడల్ మాత్రమే కాదు, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల దిశ ఏవిధంగా ఉండబోతుందో సూచించే ఒక ఉదాహరణగా కూడా భావించవచ్చు.

ఇతర ఎలక్ట్రిక్ కార్ల మాదిరిగానే Vayve Evaను సాధారణ ఛార్జర్‌తో ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే దీనిని ప్రత్యేకంగా నిలబెట్టేది పైకప్పుపై అమర్చిన సోలార్ ప్యానెల్. సూర్యరశ్మిని నేరుగా శక్తిగా మార్చుకుని బ్యాటరీకి పంపే ఈ వ్యవస్థ వల్ల, కారును బయట పార్క్ చేసి ఉంచినా కొంతమేరకు అది తానే ఛార్జ్ అవుతుండటం గొప్ప ప్రయోజనం. అంచనాల ప్రకారం, ఈ సోలార్ ఎనర్జీ సహాయంతో సంవత్సరానికి సుమారు 3,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

Vayve Eva Solar Car India Price Battery Range Bookings

డిజైన్ పరంగా చిన్న ఎలక్ట్రిక్ కారు కావడంతో ఇందులో ఇద్దరు పెద్దలు, ఒక చిన్నారి కలిసి మొత్తం ముగ్గురు సౌకర్యంగా ప్రయాణించవచ్చు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, చిన్న కారు అయినప్పటికీ Vayve Eva మంచి స్పందన ఇస్తుంది. గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. నగర ప్రయాణాలకు ఇది సరిపడే స్పీడ్. కేవలం 5 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం దీని చురుకుదనాన్ని చూపిస్తుంది.

ఈ కారు మూడు వేరియంట్లలో నోవా, స్టెల్లా, వేగాలో అందుబాటులో ఉంది. ఎంట్రీ లెవల్ నోవా వేరియంట్‌లో 9 kWh బ్యాటరీ ప్యాక్ పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 125 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. మిడ్ వేరియంట్ స్టెల్లా 12.6 kWh బ్యాటరీతో వస్తుంది, దీని రేంజ్ 175 కిలోమీటర్లు. టాప్ వేరియంట్ వేగా 18 kWh బ్యాటరీతో అందుబాటులో ఉండి, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు ప్రయాణించగలదు.

Vayve Eva Solar Car India Price Battery Range Bookings

నోవా ధర రూ.3.99 లక్షలు, స్టెల్లా రూ.4.99 లక్షలు, వేగా రూ.5.99 లక్షలు (కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం). అద్భుతమైన డిమాండ్ కారణంగా ప్రస్తుతం బుకింగ్స్ తాత్కాలికంగా నిలిపివేశారు. త్వరలో మళ్లీ ప్రారంభించి, 2026 చివరినాటికి డెలివరీలు ఇవ్వాలని కంపెనీ భావిస్తోంది.

Article Published On: Tuesday, April 28, 2026, 9:04 [IST]
English summary
Vayve eva solar car india price battery range bookings delivery details
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+