నెలకు రూ.35,000 జీతంతో డ్రైవర్ జాబ్.. 10,000 ఎలక్ట్రిక్ కార్లతో ట్యాక్సీ మార్కెట్లోకి విన్‌ఫాస్ట్ ఎంట్రీ

దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకే కాకుండా ట్రావెల్ రంగం (క్యాబ్ సర్వీసెస్) పై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్ వంటి మెట్రో నగరాల్లో కాలుష్యాన్ని అదుపు చేసేందుకు, ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలు ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కార్లను తమ క్యాబ్ నెట్‌వర్క్‌లో చేర్చుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు.

కేవలం ఎలక్ట్రిక్ కార్లను (EVs) మాత్రమే ప్రోత్సహిస్తున్నాయి. ఈ ట్రెండ్‌ను ముందే పసిగట్టిన వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం విన్‌ఫాస్ట్ (VinFast).. భారతదేశంలో ఈవీ కార్లను అమ్మడమే కాకుండా, ఇప్పుడు సరికొత్త టాక్సీ బిజినెస్‌లోకి భారీ ఎత్తున ఎంట్రీ ఇచ్చింది. తన భాగస్వామ్య సంస్థ గ్రీన్ ఎస్ఎమ్(Green SM)తో కలిసి ఉత్తర భారతదేశంలో ఏకంగా 10,000 ఎలక్ట్రిక్ టాక్సీలను రోడ్లపైకి తీసుకువచ్చింది. ఈ మెగా ప్రాజెక్ట్ కోసం కంపెనీ ప్రస్తుతం పెద్ద ఎత్తున డ్రైవర్ల నియామకం చేపట్టింది.

vinfast green sm electric taxi service launch in india driver jobs salary details telugu

భారతీయ డ్రైవర్లకు ఉపాధి కల్పించేలా విన్‌ఫాస్ట్ సంస్థ భారీ శాలరీ ప్యాకేజీని ప్రకటించింది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఆన్‌లైన్ వీడియో ప్రకారం.. గ్రే కలర్‌లో ఉన్న వందలాది విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ ఎలక్ట్రిక్ ఎంపీవీ (MPV) కార్లు కమర్షియల్ ఎల్లో అండ్ బ్లాక్ నంబర్ ప్లేట్లతో రిజిస్టర్ అయి సిద్ధంగా ఉన్నాయి.

ఈ టాక్సీలను నడపడానికి గ్రీన్ ఎస్ఎమ్ కంపెనీ డ్రైవర్లను రిక్రూట్ చేసుకుంటోంది. ఎంపికైన డ్రైవర్లకు ప్రతి నెలా రూ.35,000 నుంచి రూ.40,000 వరకు స్థిరమైన జీతం ఇవ్వనున్నట్లు ఆ వీడియో ద్వారా వెల్లడైంది. సొంతంగా కారు కొనుక్కోలేని డ్రైవర్లకు ఈ కంపెనీలో చేరడం ఒక మంచి సువర్ణావకాశంగా మారనుంది.

vinfast green sm electric taxi service launch in india driver jobs salary details telugu

గ్రీన్ ఎస్ఎమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Green SM India) పేరుతో ఈ విదేశీ కంపెనీ భారతీయ మార్కెట్లో కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ సంస్థ యొక్క ప్రధాన రిజిస్టర్డ్ ఆఫీస్ హర్యానాలోని గురుగ్రామ్ (Gurugram) లో ఉంది. దాదాపు రూ.254 కోట్ల భారీ అథరైజ్డ్ క్యాపిటల్ (పెట్టుబడి)తో ఈ బిజినెస్‌ను ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారు.

ప్రారంభంలో 10,000 కార్లతో ఈవీ టాక్సీ సేవలను ప్రారంభించినప్పటికీ.. భవిష్యత్తులో ఈ సంఖ్యను ఏకంగా 1,00,000 (లక్ష) యూనిట్లకు పెంచాలని కంపెనీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా కేవలం కార్లే కాకుండా ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను కూడా టాక్సీ సేవల్లోకి తీసుకురానున్నారు. విన్‌ఫాస్ట్ కంపెనీ నుంచి ఈ కార్లను గ్రీన్ ఎస్ఎమ్ లీజుకు తీసుకుని నడుపుతున్నట్లు ఆటోమొబైల్ వర్గాలు చెబుతున్నాయి.

vinfast green sm electric taxi service launch in india driver jobs salary details telugu

విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
టాక్సీ అవసరాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ (VinFast Limo Green) ఎలక్ట్రిక్ ఎంపీవీ కారు.. చూడటానికి ఇటీవల లాంచ్ అయిన ప్రీమియం VF MPV 7 మోడల్ లాగే ఉంటుంది. అయితే సాధారణ కస్టమర్ల కోసం కాకుండా కమర్షియల్ ఫ్లీట్ ఆపరేటర్ల కోసం ఇందులో కొన్ని మార్పులు చేశారు.

ఇంటీరియర్ లగ్జరీ: సాధారణ మోడల్‌లో డ్యూయల్ టోన్ క్యాబిన్ ఉంటే.. ఈ లిమో గ్రీన్ టాక్సీ మోడల్‌లో పూర్తిగా బ్లాక్ కలర్ క్యాబిన్‌ను ఫ్యాబ్రిక్ అప్‌హోల్‌స్టరీతో ఇచ్చారు. దీనివల్ల కారును క్లీన్ చేయడం, మెయింటెనెన్స్ చేయడం చాలా సులభం అవుతుంది.

స్మార్ట్ స్క్రీన్: బడ్జెట్‌ను తగ్గించడానికి దీనికి స్టీల్ వీల్స్ (వీల్ కవర్లతో) ఇచ్చినప్పటికీ.. డాష్‌బోర్డ్‌పై 10.1-ఇంచుల ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అలాగే ఉంచారు.
కనెక్టివిటీ: ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 4-స్పీకర్ల సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ప్రయాణికులకు మంచి వినోదాన్ని అందిస్తాయి.

టాక్సీ బిజినెస్‌లో మైలేజ్ (రేంజ్) అనేది చాలా కీలకం. విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ ఎలక్ట్రిక్ కారులో పవర్‌ఫుల్ 60.13 kWh బ్యాటరీ ప్యాక్ ను అమర్చారు. ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 517 కిలోమీటర్ల (ARAI సర్టిఫైడ్) రేంజ్ ను ఇస్తుంది. అంటే సిటీ పరిధిలో రోజంతా ఛార్జింగ్ టెన్షన్ లేకుండా ఈ కారును నడుపుకోవచ్చు.

దీని ఫ్రంట్ వీల్ డ్రైవ్ మోటార్ 201 bhp పవర్‌ను, 280 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ టాక్సీ గరిష్టంగా గంటకు 140 కిమీ వేగంతో దూసుకెళ్లగలదు. ఈ మోడల్‌తో పాటు కంపెనీకి చెందిన పాపులర్ VF5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను కూడా గ్రీన్ ఎస్ఎమ్ కస్టమర్ల సేవల కోసం రోడ్లపైకి తీసుకువస్తోంది.

Article Published On: Wednesday, May 20, 2026, 12:15 [IST]
English summary
Vinfast green sm electric taxi service launch in india driver jobs salary details telugu
Read more on: #electric car #taxi #ola cab
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+