అన్ని ఫీచర్లు పెట్టినా ఆ ఒక్కటి తక్కువైందా ? ఫోక్స్ వ్యాగన్ లగ్జరీ కారును ముచ్చటగా ముగ్గురే కొన్నారు

లగ్జరీ ఫీచర్లు, అద్భుతమైన స్పీడ్, టాప్ క్లాస్ సేఫ్టీ.. ఇవన్నీ ఉన్నా కూడా ఒక కారును కొనడానికి జనం ఆసక్తి చూపడం లేదంటే ఆశ్చర్యంగా ఉంది. జర్మన్ కార్ల దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) నుంచి వచ్చిన ఐకానిక్ మోడల్ గోల్ఫ్ జీటీఐ (Golf GTI) పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది. 2026 మార్చి నెలలో ఈ కారును దేశవ్యాప్తంగా కేవలం ముగ్గురు మాత్రమే కొనుగోలు చేశారు. అంతకుముందు ఫిబ్రవరిలో అయితే కేవలం ఒకే ఒక్క యూనిట్ అమ్ముడైంది. ఇంతకీ ఈ కారులో ఏముంది? ఎందుకు దీనికి డిమాండ్ తక్కువగా ఉంది? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

ఫోక్స్‌వ్యాగన్ సేల్స్ రిపోర్ట్ 2026
ఫోక్స్‌వ్యాగన్ ఇండియా 2026 మార్చి నెలకు సంబంధించిన సేల్స్ డేటాను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం కంపెనీకి గత నెలలో మంచి వృద్ధి (Growth) కనిపించింది. ఫిబ్రవరిలో 2,639 కార్లను అమ్మిన కంపెనీ, మార్చి నెలలో ఆ సంఖ్యను 3,082 యూనిట్లకు పెంచుకుంది. ఇందులో సింహభాగం వర్టీస్(Virtus) సెడాన్‌దే.

Volkswagen Golf GTI Sales Struggles Only 3 Units Sold in March 2026 Despite 5 Star Safety

వర్టీస్ కారు ఏకంగా 2,009 యూనిట్లు అమ్ముడై కంపెనీలో మోస్ట్ ఫేవరెట్ మోడల్‌గా నిలిచింది. ఆ తర్వాత టైగూన్ (Taigun) 908 యూనిట్లు, టిగువాన్ (Tiguan) 34 యూనిట్లతో తమ ఉనికిని చాటుకున్నాయి. అయితే, అందరినీ విస్మయానికి గురిచేసింది మాత్రం గోల్ఫ్ జీటీఐ అమ్మకాలు. ఫిబ్రవరిలో కేవలం ఒక కారు మాత్రమే అమ్ముడవగా, మార్చిలో ముగ్గురు కస్టమర్లు దీనిని సొంతం చేసుకున్నారు.

ఫీచర్లలో కింగ్.. అయినా ఎందుకీ పరిస్థితి?
ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ అంటే ప్రపంచవ్యాప్తంగా కార్ ప్రియులకు ఒక క్రేజ్. ఇది కేవలం ఒక కారు మాత్రమే కాదు, రోడ్డుపై రాకెట్‌లా దూసుకెళ్లే ఒక పవర్ హౌస్. ఇందులో 2.0-లీటర్ టీఎస్‌ఐ (TSI) టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది గరిష్టంగా 261 బిహెచ్‌పి పవర్, 370 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎంత వేగంగా వెళ్తుందంటే, కేవలం 5.9 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

Volkswagen Golf GTI Sales Struggles Only 3 Units Sold in March 2026 Despite 5 Star Safety

దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లుగా కంపెనీ పరిమితం చేసింది. ఇంత పవర్ ఫుల్ ఇంజిన్, 7-స్పీడ్ డీఎస్‌జీ ట్రాన్స్‌మిషన్ ఉన్నా కూడా ఇండియాలో దీనిని కొనేవారు తక్కువగా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం దీని ధర. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.53 లక్షలుగా ఉంది. ఇదే ధరలో మెర్సిడెస్ లేదా బిఎమ్‌డబ్ల్యూ వంటి బ్రాండ్ల ఎంట్రీ లెవల్ కార్లు వస్తుండటంతో కస్టమర్లు అటువైపు మొగ్గు చూపిస్తున్నారు.

ఇంటీరియర్, డిజైన్
గోల్ఫ్ జీటీఐ లోపలికి వెళ్తే ఒక లగ్జరీ ప్రపంచంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇందులో ఏకంగా 12.9-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. సంగీత ప్రియుల కోసం 7-స్పీడ్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఉన్నాయి.

Volkswagen Golf GTI Sales Struggles Only 3 Units Sold in March 2026 Despite 5 Star Safety

బయటి డిజైన్ విషయానికి వస్తే, హనీకాంబ్ ప్యాటర్న్ ఎయిర్ డ్యామ్, ఎక్స్-షేప్ ఫాగ్ లైట్స్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఈ కారుకు స్పోర్టీ లుక్ ఇస్తాయి. మూన్‌స్టోన్ గ్రే, ఓరిక్స్ వైట్, కింగ్స్ రెడ్ మెటాలిక్ మరియు గ్రెనెడిల్లా బ్లాక్ మెటాలిక్ వంటి నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో ఇది లభిస్తోంది. కేవలం ఫుల్లీ లోడెడ్ వెర్షన్‌లో మాత్రమే ఇది అందుబాటులో ఉండటం గమనార్హం.

సేఫ్టీలో తిరుగులేదు
భారతదేశంలో కార్ల కొనుగోలులో ఇప్పుడు సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ విషయంలో ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ టాప్ క్లాస్ అని చెప్పాలి. యూరో ఎన్‌క్యాప్ (Euro NCAP) క్రాష్ టెస్టుల్లో ఈ కారుకు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. అంటే ప్రాణరక్షణ విషయంలో ఇది అత్యంత సురక్షితమైన కారు. ఇంతటి భద్రత, ఆధునిక ఫీచర్లు ఉన్నప్పటికీ, కేవలం ముగ్గురు కస్టమర్లకే పరిమితం అవ్వడం ఆశ్చర్యకరం. బహుశా లగ్జరీ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఇంత భారీ ధరను వెచ్చించడానికి కస్టమర్లు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో మినీ కూపర్ ఎస్ (MINI Cooper S) వంటి కార్లు దీనికి గట్టి పోటీనిస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, April 15, 2026, 12:25 [IST]
English summary
Volkswagen golf gti sales struggles only 3 units sold in march 2026 despite 5 star safety
Read more on: #volkswagen #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+