లగ్జరీకి కేరాఫ్ అడ్రస్ ఈ కారు..ఏడు సీట్లు..అదిరిపోయే రేట్లు..ఫోక్స్‎వ్యాగన్ దెబ్బకు ఫార్చ్యూనర్‎ మైండ్ బ్లాక్

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్యూవీల హవా కొనసాగుతోంది.ప్రస్తుతం కొత్త కారు కొనే వాళ్ల ఫస్ట్ ఛాయిస్ ఎస్యూవీనే. ముఖ్యంగా సెవెన్ సీటర్ లగ్జరీ ఎస్యూవీ విభాగంలో ఇప్పటి వరకూ టయోటా ఫార్చ్యూనర్ తిరుగులేని కింగ్ లా వెలుగొందుతుంది. అయితే ఇప్పుడు ఈ సామ్రాజ్యానికి సవాల్ విసిరేందుకు జర్మన్ దిగ్గజం ఫోక్స్ వ్యాగన్(Volkswagen) తన అస్త్రాన్ని రెడీ చేసింది. సరికొత్త టైరాన్ ఆర్ లైన్ (Tayron R-Line) ఎస్‌యూవీని ఇండియాలో లాంచ్ చేసేందుకు ముహూర్తం పెట్టేసింది. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభం కావడంతో కార్ లవర్లలో ఉత్సాహం నెలకొంది.

జర్మన్ వాహన దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ తన ప్రతిష్టాత్మక 7-సీటర్ ఎస్‌యూవీ టైరాన్ R-లైన్ కోసం అధికారికంగా బుకింగ్స్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఫోక్స్‌వ్యాగన్ డీలర్‌షిప్‌లలో లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా రూ.51,000 టోకెన్ అమౌంట్ చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు.

Volkswagen Tayron R Line Bookings Open in India 7 Seater SUV to Rival Toyota Fortuner

ఈ కారును భారత్‌లోనే అసెంబుల్ చేయనుండటం విశేషం. దీనివల్ల ధర కూడా పోటీగా ఉండే అవకాశం ఉంది. మార్కెట్ అంచనాల ప్రకారం దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.45 లక్షల వద్ద ప్రారంభం కావచ్చు. ఈ ధరలో లభించే ప్రీమియం ఫీచర్లు టయొటా ఫార్చ్యూనర్, స్కోడా కొడియాక్, ఎంజీ గ్లోస్టర్, జీప్ మెరిడియన్ వంటి వాహనాలకు గట్టి పోటీని ఇస్తాయని భావిస్తున్నారు.

ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ R-లైన్ కేవలం లుక్స్‌లో మాత్రమే కాదు, పెర్ఫార్మెన్స్‌లో కూడా రాజీ పడలేదు. ఇందులో 2.0 లీటర్ TSI EA888 evo4 పెట్రోల్ ఇంజిన్ను అమర్చారు. ఇది గరిష్టంగా 204 bhp పవర్‌ను మరియు 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్ఫుల్ ఇంజిన్‌కు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, ఫోక్స్‌వ్యాగన్ సిగ్నేచర్ 4MOTION ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను జతచేశారు.

Volkswagen Tayron R Line Bookings Open in India 7 Seater SUV to Rival Toyota Fortuner

ఈ ఎస్‌యూవీ కేవలం 7.3 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 224 కిలోమీటర్లుగా నిర్ణయించారు. టైరాన్ R-లైన్ చూడగానే ఆకట్టుకునేలా ఏడు రకాల ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. డాల్ఫిన్ గ్రే మెటాలిక్, ఒరిక్స్ వైట్ మదర్-ఆఫ్-పర్ల్ ఎఫెక్ట్, నైట్‌షేడ్ బ్లూ మెటాలిక్ వంటి రంగులు దీనికి మరింత రాజసాన్ని ఇస్తాయి.

ఈ సెగ్మెంట్లోనే మొదటిసారిగా HD మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్ కలిగిన IQ లైట్లను ఇందులో అమర్చారు. బంపర్లు, ఫ్రంట్ డోర్లపై స్పోర్టీ R-లైన్ డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. 19 ఇంచ్ కవెంట్రీ అల్లాయ్ వీల్స్, ఇల్యూమినేటెడ్ ఫ్రంట్, రియర్ ఫోక్స్‌వ్యాగన్ లోగోలు ఈ కారును రాత్రిపూట మరింత అందంగా మార్చేస్తాయి. ఈ కారు పొడవు 4,792 మిమీ, వెడల్పు 1,866 మిమీ, వీల్‌బేస్ 2,789 మిమీగా ఉంది, అంటే లోపల స్థలం చాలా ఎక్కువగా ఉంటుంది.

Volkswagen Tayron R Line Bookings Open in India 7 Seater SUV to Rival Toyota Fortuner

లోపలికి అడుగు పెడితే మీరు ఒక లగ్జరీ ప్రపంచంలోకి వెళ్లినట్లు అనిపిస్తుంది. ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్, పనోరమిక్ సన్‌రూఫ్, 15 ఇంచ్ భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణలు. డ్రైవర్ కోసం 10.25 ఇంచ్ డిజిటల్ కాక్‌పిట్, ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్-అప్ డిస్‌ప్లే ఉన్నాయి.

ముందు సీట్లు 12-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఆప్షన్‌తో వస్తాయి, వీటికి మెమరీ, వెంటిలేషన్, మసాజ్, లంబార్ సపోర్ట్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మీ మూడ్‌ని బట్టి మార్చుకోవడానికి 30 రకాల కలర్ ఆప్షన్లతో యాంబియంట్ లైటింగ్ సిస్టమ్‌ను ఇందులో ఇచ్చారు.

ఫోక్స్‌వ్యాగన్ కార్లు సేఫ్టీకి పెట్టింది పేరు. టైరాన్ R-లైన్ కూడా దానికి మినహాయింపు కాదు. ఇందులో ప్రయాణీకుల రక్షణ కోసం ఏకంగా 9 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ అసెంట్, డిసెంట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మరీ ముఖ్యంగా, ఇందులో లెవల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) కలదు, దీని ద్వారా 14 రకాల సేఫ్టీ ఫీచర్లు డ్రైవర్‌కు సహాయపడతాయి. ప్రమాదాలను ముందుగానే గుర్తించి కారును నియంత్రించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

ఇప్పటివరకూ ఫార్చ్యూనర్ కొనాలని ఉన్నవారు ఇతర ఆప్షన్లు లేక అదే కొనేవారు. కానీ ఇప్పుడు ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ రూపంలో ఒక బలమైన ప్రత్యర్థి మార్కెట్లోకి వస్తోంది. జర్మన్ టెక్నాలజీ, అదిరిపోయే ఫీచర్లు, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో వస్తున్న ఈ కారు ఖచ్చితంగా టయొటాకు కష్టాలు తెచ్చిపెట్టేలా ఉంది. మార్చి 2026 నాటికి ఈ కారు డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. లగ్జరీ, సేఫ్టీ, సెవెన్ సీటర్ సౌకర్యం కోరుకునే వారికి టైరాన్ ఒక వరం లాంటిదని చెప్పవచ్చు.

More from DriveSpark

Article Published On: Friday, February 6, 2026, 11:57 [IST]
English summary
Volkswagen tayron r line bookings open in india 7 seater suv to rival toyota fortuner
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+