ఒక్క కారులో మొత్తం కుటుంబం.. 7 సీట్ల లగ్జరీ SUVగా ఫోక్స్‌వ్యాగన్ నుంచి అదిరిపోయే కారు ఎంట్రీ
జర్మన్ వాహన తయారీ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ 2026 నూతన సంవత్సరాన్ని భారత మార్కెట్‌లో పెద్ద ఆశయాలతో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. గత కొంతకాలంగా భారతదేశంలో తన మోడల్ లైనప్‌ను పరిమితంగా ఉంచిన ఫోక్స్‌వ్యాగన్, ఇప్పుడు మళ్లీ SUV విభాగంలో బలంగా నిలబడాలనే లక్ష్యంతో ముందుకు వస్తోంది. అందులో భాగంగా తన ఫ్లాగ్‌షిప్ 7-సీట్ల SUV అయిన ఫోక్స్‌వ్యాగన్ టేరాన్ R-లైన్ ను భారత్‌కు తీసుకురానుంది. కంపెనీ తాజాగా విడుదల చేసిన అధికారిక పత్రికా ప్రకటన ప్రకారం, ఈ కొత్త టేరాన్ R-లైన్ SUV 2026 మొదటి త్రైమాసికంలో భారత మార్కెట్‌లో అమ్మకాలకు అందుబాటులోకి రానుంది. ఇది కేవలం ఒక కొత్త మోడల్ లాంచ్ మాత్రమే కాకుండా, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా వ్యూహంలో ఒక కీలక మైలురాయిగా భావించవచ్చు.
ఎందుకంటే 2021 చివర్లో టిగువాన్ ఆల్‌స్పేస్‌ను నిలిపివేసిన తర్వాత, ఫోక్స్‌వ్యాగన్ వద్ద భారత్‌లో సరైన 7-సీట్ల SUV లేదు. ఆ ఖాళీని ఇప్పుడు టేరాన్ భర్తీ చేయబోతోంది. టేరాన్ R-లైన్ డిజైన్ పరంగా పూర్తిగా ఆధునికంగా, ప్రీమియం లుక్‌తో ఆకట్టుకునేలా రూపొందించారు. R-లైన్ బ్యాడ్జ్ అంటేనే స్పోర్టీ డిజైన్ ఎలిమెంట్స్, అగ్రెసివ్ బంపర్లు, ప్రత్యేక అల్లాయ్ వీల్స్, డైనమిక్ స్టాన్స్. ఇవన్నీ టేరాన్‌ను ఆకట్టుకునేలా చేయనున్నాయి.

డిజైన్ విషయానికి వస్తే టేరాన్ R-లైన్‌ను చూసిన వెంటనే ఇది ప్రీమియం ఫ్లాగ్‌షిప్ SUV అనే భావన కలుగుతుంది. ముందు, వెనుక భాగాల్లో స్పష్టంగా కనిపించే ఫోక్స్‌వ్యాగన్ లోగోలు, ముందు నుంచి వెనుక వరకు కనెక్ట్ అయ్యే లైటింగ్ ఎలిమెంట్స్, షార్ప్ LED హెడ్‌లైట్లు, స్టైలిష్ LED టెయిల్ లైట్లు ఈ SUVకి హైటెక్ లుక్‌ను అందిస్తాయి. రోడ్డుపై కనిపించినప్పుడు టేరాన్ ప్రత్యేకంగా కనిపించేలా లైటింగ్ సిగ్నేచర్ డిజైన్ చేయబడింది.
R-లైన్ వెర్షన్ కావడంతో స్పోర్టీ బంపర్లు, అగ్రెసివ్ స్టాన్స్, డైనమిక్ డిజైన్ ఎలిమెంట్స్ ఈ SUV ప్రీమియం ఆకర్షణను మరింత పెంచుతాయి. ఇంటీరియర్‌లోకి అడుగుపెట్టగానే పూర్తిగా లగ్జరీ అనుభూతి కలుగుతుంది. డ్యాష్‌బోర్డ్ మధ్యలో ఉన్న భారీ 15-అంగుళాల ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తిగా డిజిటల్ కాక్‌పిట్ మరియు హెడ్-అప్ డిస్‌ప్లే (HUD) టేరాన్‌ను నిజమైన నెక్స్ట్-జెనరేషన్ SUVగా నిలబెడతాయి.

స్పోర్ట్స్ సీట్లు, మైక్రోఫైబర్ లెథరెట్ అప్హోల్స్టరీ, హై-క్వాలిటీ ప్రీమియం మెటీరియల్స్ క్యాబిన్ మొత్తానికి రిచ్ ఫీల్‌ను ఇస్తాయి. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఆధునిక వినియోగదారుల అవసరాలను పూర్తిగా తీర్చేలా ఉంటాయి. మెమరీ ఫంక్షన్‌తో కూడిన పవర్-అడ్జస్టబుల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మసాజింగ్ ఫంక్షన్ వంటి ఫీచర్లు దీర్ఘ ప్రయాణాల్లో కూడా అలసట లేకుండా సౌకర్యాన్ని అందిస్తాయి.
మూడు జోన్ల క్లైమేట్ కంట్రోల్ వ్యవస్థ, భారీ పనోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం హర్మాన్ ఆడియో సిస్టమ్ టేరాన్‌ను నిజంగా ఒక లగ్జరీ ఫ్యామిలీ SUVగా మార్చుతాయి. భద్రత పరంగా కూడా ఎలాంటి రాజీ లేదు. అత్యాధునిక లెవెల్-2 ADAS టెక్నాలజీతో పాటు అనేక యాక్టివ్, ప్యాసివ్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉండనున్నాయి. పనితీరు విషయానికి వస్తే, 2.0-లీటర్ TSI EVO టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో శక్తిని పొందుతుంది.

ఈ ఇంజిన్ 204 bhp పవర్‌తో పాటు 320 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. జర్మన్ బ్రాండ్‌కు పేరుగాంచిన 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, 4MOTION ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో ఈ ఇంజిన్ జతకావడం వల్ల, టేరాన్ డ్రైవింగ్ అనుభూతి కేవలం స్మూత్‌గా మాత్రమే కాకుండా ఎంతో డైనమిక్‌గా ఉండనుంది. మొత్తంగా చూస్తే, ఈ సంవత్సరం విడుదల కానున్న వోక్స్‌వ్యాగన్ మోడళ్లలో టేరాన్ R-లైన్ మొదటిది కావడం విశేషం.


Click it and Unblock the Notifications








