రోడ్డు మీద ఈ కారు వెళ్తుంటే నోరెళ్లబెట్టి చూడాల్సిందే..ఫోక్స్‌వ్యాగన్ నుంచి అదిరిపోయే కారొస్తుంది

జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) భారతీయ ఎస్యూవీ లవర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న తన ప్రీమియం 7-సీటర్ ఎస్‌యూవీ టైరోన్ ఆర్-లైన్(Tayron R-Line) ఉత్పత్తిని అధికారికంగా భారత్‌లో ప్రారంభించింది.

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్)లో ఉన్న తన ప్లాంట్‌లో ఈ కారు అసెంబ్లీ పనులు మొదలైనట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. గతంలో ఫోక్స్‌వ్యాగన్ విక్రయించిన టిగువాన్ ఆల్‌స్పేస్ ప్లేసును ఇది భర్తీ చేయనుంది. 2026 మొదటి త్రైమాసికంలో అంటే మార్చి లోపు ఈ కారు మార్కెట్లోకి రిలీజ్ కానుంది.

ఫోక్స్‌వ్యాగన్ టైరోన్ ఆర్-లైన్ అనేది కేవలం ఒక కారు మాత్రమే కాదు, అదొక పవర్ హౌస్. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 5-సీటర్ టిగువాన్ మోడల్‌కు ఇది అప్‌గ్రేడెడ్, ఎక్స్‎టెండెడ్ వెర్షన్. దీనిని ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ ప్రసిద్ధ MQB EVO ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు.

Volkswagen Tayron R-Line Launched in India Premium 7-Seater SUV with AWD 204 HP Power

ఈ కారు పొడవు, వీల్‌బేస్ టిగువాన్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా దీని వీల్‌బేస్ 2,789 మిమీగా ఉంది, అంటే టిగువాన్ కంటే 109 మిమీ అదనపు పొడవును కలిగి ఉంది. ఈ పెరిగిన పొడవు వల్లే కారు లోపల మూడో వరుస సీట్లను సౌకర్యవంతంగా ఏర్పాటు చేయడానికి వీలైంది.

ఇంజిన్ విషయానికి వస్తే.. ఫోక్స్‌వ్యాగన్ తన సిగ్నేచర్ 2.0 లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను ఇందులో అమర్చింది. ఇది గరిష్టంగా 204 హార్స్ పవర్, 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ (DSG) ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.

ఇందులో ఉన్న ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్ వల్ల కారు ఎంతటి కఠినమైన రోడ్ల మీదైనా, కొండ ప్రాంతాల్లోనైనా సునాయాసంగా దూసుకుపోతుంది. జర్మన్ టెక్నాలజీ కాబట్టి ఇంజిన్ స్మూత్‌నెస్, పికప్ విషయంలో వినియోగదారులకు రాజీ పడాల్సిన అవసరం ఉండదు.

Volkswagen Tayron R-Line Launched in India Premium 7-Seater SUV with AWD 204 HP Power

డిజైన్ పరంగా టైరోన్ ఆర్-లైన్ ఎంతో అగ్రెసివ్‌గా, స్పోర్టీగా కనిపిస్తుంది. ముందు భాగంలో వెలిగే ఫోక్స్‌వ్యాగన్ లోగో, కనెక్టెడ్ ఎల్ఈడీ లైట్ బార్స్ కారుకు ప్రీమియం లుక్‌ని ఇస్తాయి. వెనుక వైపు కూడా ఇదే తరహా ఎల్ఈడీ సెటప్ ఉంటుంది. 19-అంగుళాల భారీ అలాయ్ వీల్స్, ఆర్-లైన్ బ్యాడ్జింగ్, స్పోర్టీ బంపర్లు దీనిని ఇతర ఎస్‌యూవీల కంటే ప్రత్యేకంగా నిలబెడతాయి.

లోపలి భాగంలో 15-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, 30 రంగుల్లో మార్చుకోగలిగే యాంబియంట్ లైటింగ్ వంటి లగ్జరీ హంగులు ఉన్నాయి. భారతీయ వాతావరణానికి తగ్గట్టుగా ముందు సీట్లకు వెంటిలేషన్ సౌకర్యం కూడా కల్పించారు.

సేఫ్టీ విషయంలో ఫోక్స్‌వ్యాగన్ ఎప్పుడూ నంబర్ వన్ అని నిరూపించుకుంటుంది. టైరోన్ ఆర్-లైన్‌లో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, లెవల్-2 ADAS వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అంటే ప్రమాదాలను ముందుగానే పసిగట్టి కారును కంట్రోల్ చేయడంలో ఈ టెక్నాలజీ సాయపడుతుంది.

ఇక స్టోరేజ్ విషయానికి వస్తే, మూడో వరుస సీట్లను మడతపెడితే ఏకంగా 850 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది, ఇది లాంగ్ ట్రిప్పులకు ఎంతో అనువుగా ఉంటుంది. ఈ కారును విదేశాల నుంచి పార్టుల రూపంలో తెప్పించి (CKD - Completely Knocked Down), భారత్‌లోని ప్లాంట్‌లో అసెంబ్లీ చేస్తున్నారు. దీనివల్ల ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ఉండవచ్చు.

భారత మార్కెట్లో ఇది నేరుగా టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ గ్లాస్టర్, జీప్ మెరిడియన్, త్వరలో రాబోయే స్కోడా కోడియాక్ వంటి దిగ్గజ కార్లతో తలపడనుంది. లగ్జరీ, పవర్, 7-సీటర్ సౌకర్యం కోరుకునే రిచ్ పర్సన్లకు టైరోన్ ఆర్-లైన్ ఒక తిరుగులేని ఆప్షన్ కానుంది.

More from DriveSpark

Article Published On: Friday, January 23, 2026, 17:50 [IST]
English summary
Volkswagen tayron r line launched in india premium 7 seater suv with awd 204 hp power
Read more on: #volkswagen #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+