లగ్జరీ కార్ల మార్కెట్‌లో వోల్వో సంచలనం.. ₹1.26 కోట్లతో EX90 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదల!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోల్వో (Volvo) భారత్‌లో తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'EX90'ని విడుదల చేసింది. సిక్స్-సీటర్ 'అల్ట్రా' ట్రిమ్‌లో వచ్చిన ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర ₹1.26 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో భారీ 106 kWh బ్యాటరీ ప్యాక్, 800-వోల్ట్ ఆర్కిటెక్చర్ సిస్టమ్‌ను అందించారు. సింగిల్ ఛార్జ్‌పై 625 కిలోమీటర్ల (WLTP) రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ కారు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమవ్వగా.. నవంబర్ 2026 నుంచి టెస్ట్ డ్రైవ్‌లు, జనవరి 2027 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. కాగా, ఈ ఎస్‌యూవీ కేవలం 5.5 సెకన్లలోనే 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది.

ఈ మోడల్‌ను ప్రారంభంలో కొనుగోలు చేసే వారికి కంపెనీ అదిరిపోయే ఆఫర్లు ఇస్తోంది. 11 kW హోమ్ వాల్‌బాక్స్ ఛార్జర్, మూడేళ్ల సర్వీస్ ప్యాకేజ్, మూడేళ్ల తర్వాత 65 శాతం అష్యూర్డ్ బైబ్యాక్ గ్యారెంటీని ఆఫర్ చేస్తోంది. 350 kW DC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా ఈ కారు బ్యాటరీని కేవలం 22 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతానికి ఛార్జ్ చేయవచ్చు. అంతేకాకుండా, భారతీయ ఐసీఏటీ (ICAT) నిబంధనల ప్రకారం దీని రేంజ్ ఏకంగా 725 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని కంపెనీ పేర్కొంది.

Volvo EX90 Electric SUV Launched in India: Price, Range, and Features (2026)

వోల్వో EX90 ధర, పోటీదారులు: మార్కెట్‌లో దీని స్థానం ఎంత?

₹1.26 కోట్ల ధరకు లభిస్తున్న వోల్వో EX90, తన ప్రత్యర్థులతో పోలిస్తే తక్కువ ధరలోనే లగ్జరీ ఫీచర్లను అందిస్తోంది. మార్కెట్‌లో దీని ప్రధాన పోటీదారులైన బిఎమ్‌డబ్ల్యూ iX ధర సుమారు ₹1.40 కోట్లుగా ఉండగా (రేంజ్ 575-635 కిమీ), మెర్సిడెస్-బెంచ్ EQS SUV వేరియంట్ల ధరలు ₹1.35 కోట్ల నుంచి ₹1.49 కోట్ల మధ్య ఉన్నాయి (రేంజ్ 600 కిమీ పైమాటే). ఈ లెక్కన చూస్తే, పెట్టే ధరకూ లభించే రేంజ్ విషయంలో వోల్వో EX90 చాలా బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది.

వోల్వో EX90 రేంజ్, బ్యాటరీ, ఛార్జింగ్ వివరాలు: 625 కిమీ WLTP, 800V సాంకేతికత

ఇందులో అమర్చిన ట్విన్-మోటార్ సెటప్ 456 హెచ్‌పీ పవర్, 670 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 800V ఆర్కిటెక్చర్‌పై పనిచేసే 106 kWh బ్యాటరీ ప్యాక్ ఇందులో ఉంది. 350 kW DC ఫాస్ట్ ఛార్జర్ వాడితే 10 నుంచి 80% ఛార్జింగ్‌కు 22 నిమిషాలు మాత్రమే పడుతుంది. అదే 11 kW AC వాల్‌బాక్స్ ఛార్జర్ అయితే దాదాపు 10 గంటల సమయం పడుతుంది. మన దేశంలో ప్రస్తుతం 120-180 kW ఛార్జింగ్ నెట్‌వర్క్ ఎక్కువ అందుబాటులో ఉన్నందున, సాధారణ హై-పవర్ ఛార్జర్‌లపై 35 నుంచి 45 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది.

ఆన్-రోడ్ ధర, ఇఎమ్‌ఐ: హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, ముంబై

తెలంగాణలో డిసెంబర్ 31, 2026 వరకు ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి మినహాయింపు ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవి వాహన పన్నును మినహాయించగా, ఆంధ్రప్రదేశ్ 2024-29 విధానం కింద 100 శాతం రోడ్డు పన్ను మినహాయింపు అందిస్తోంది. ఎక్స్-షోరూమ్ ధరపై 1 శాతం టీసీఎస్ (TCS), కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కలిపితే ఆన్-రోడ్ ధర నిర్ణయమవుతుంది. లగ్జరీ ఇవి ఇన్సూరెన్స్ అంచనాల ప్రకారం, ఈ కారు ఆన్-రోడ్ ధర సుమారు ₹1.32 కోట్ల వరకు ఉంటుంది.

నగరం అంచనా ఆన్-రోడ్ ధర అంచనా ఇఎమ్‌ఐ (నెలవారీ)
హైదరాబాద్ ₹1.32 కోట్లు ₹2.2 లక్షలు/నెలకు*
విశాఖపట్నం ₹1.32 కోట్లు ₹2.2 లక్షలు/నెలకు*
విజయవాడ ₹1.32 కోట్లు ₹2.2 లక్షలు/నెలకు*
ముంబై ₹1.32 కోట్లు ₹2.2 లక్షలు/నెలకు*

*ఇది 20 శాతం డౌన్ పేమెంట్, 9.5 శాతం వడ్డీ రేటుతో 60 నెలల కాలవ్యవధిని ప్రాతిపదికగా చేసుకుని లెక్కించిన అంచనా మాత్రమే. డీలర్ ఇన్సూరెన్స్, టీసీఎస్ విధానాలను బట్టి ధర మారవచ్చు. ₹10 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న వాహనాలపై 1 శాతం టీసీఎస్ వర్తిస్తుంది. ప్రభుత్వ విధానాలు రోడ్డు పన్నును మినహాయించినప్పటికీ, టీసీఎస్, ఇన్సూరెన్స్ చెల్లించాల్సిందే. బుకింగ్ చేయడానికి ముందు సరైన ఆన్-రోడ్ ధర వివరాల కోసం మీ డీలర్ లేదా ఫైనాన్షియర్లను సంప్రదించండి.

బుకింగ్ తేదీలు, ఆఫర్లు, వారంటీ వివరాలు

ప్రస్తుతం ఈ కారు బుకింగ్‌లు ప్రారంభం కాగా, నవంబర్ 2026 నుంచి టెస్ట్ డ్రైవ్‌లు, జనవరి 2027 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. తొలినాళ్లలో కొనుగోలు చేసే వారికి ఇచ్చే ఆఫర్లు ఛార్జింగ్ ఇబ్బందులను తగ్గించడమే కాకుండా, రీసేల్ విషయంలో కొనుగోలుదారులకు భరోసానిస్తాయి. కంపెనీ వాహనంపై 3 ఏళ్లు లేదా 1,00,000 కిమీ వారంటీ, అలాగే హై-వోల్టేజ్ బ్యాటరీపై 8 ఏళ్లు లేదా 1,60,000 కిమీ వారంటీని అందిస్తోంది. లగ్జరీ ఎలక్ట్రిక్ వాహన ప్రియుల నిరీక్షణకు తగ్గట్టుగా వోల్వో ఈ భరోసా ఇస్తోంది.

Article Published On: Wednesday, October 14, 2026, 17:14 [IST]
Read more on: #volvo #electric vehicles
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+