స్మార్ట్‌ఫోన్ రేంజ్‌లో కార్ల అమ్మకాలు.. షావోమీ దెబ్బకు పెట్రోల్ కార్లు షెడ్డుకు వెళ్లాల్సిందేనా?

స్మార్ట్‌ఫోన్ల ప్రపంచంలో రారాజులా వెలుగొందుతున్న షావోమీ (Xiaomi), ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. టెస్లా, బి‌వైడి వంటి దిగ్గజ కంపెనీలకు షావోమీ సేల్స్ చూస్తుంటే వణుకు పుడుతోంది. ఒకప్పుడు కేవలం తక్కువ ధరకే మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్లను అందించి ఇండియాలో తిరుగులేని బ్రాండ్‌గా ఎదిగిన షావోమీ, ఇప్పుడు అదే ఫార్ములాను ఎలక్ట్రిక్ కార్లలోనూ అమలు చేస్తోంది.

మొన్నటి వరకు కేవలం సెల్ ఫోన్లు మాత్రమే తయారు చేసిన ఈ కంపెనీ, ఇప్పుడు టెస్లా (Tesla), బీవైడీ (BYD) వంటి దిగ్గజ కంపెనీలకే చెమటలు పట్టిస్తోంది. 2025లో షావోమీ కార్ల అమ్మకాలు చూసి ఆ కంపెనీ బాస్ లీ జున్ (Lei Jun) కూడా షాక్ అయ్యారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Xiaomi Shocks Tesla and BYD Smartphone Giant Sells 4 1 Lakh Electric Cars in 2025

షావోమీ సీఈఓ లీ జున్ ఇటీవల చైనా నుంచి లైవ్ స్ట్రీమింగ్ ద్వారా 2025 సంవత్సరపు అమ్మకాల వివరాలను వెల్లడించారు. గతేడాది షావోమీ ఏకంగా 4.10 లక్షల వాహనాలను విక్రయించి ఆటోమొబైల్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. కేవలం డిసెంబర్ నెలలోనే 50,000 కార్లను డెలివరీ చేయడం ఒక రికార్డు. ఇది వారు ముందుగా ఊహించిన దానికంటే చాలా ఎక్కువ.

నిజానికి కంపెనీ లక్ష్యం 3 లక్షలే అయినప్పటికీ, డిమాండ్ భారీగా ఉండటంతో ఉత్పత్తిని పెంచి మరీ ఈ మైలురాయిని అందుకుంది. షావోమీ ఈవీ విభాగం 2025 మూడవ త్రైమాసికంలోనే లాభాల్లోకి రావడం విశేషం.

Xiaomi Shocks Tesla and BYD Smartphone Giant Sells 4 1 Lakh Electric Cars in 2025

షావోమీ తన మొదటి కార్ SU7 (ఎలక్ట్రిక్ సెడాన్) ను 2024 మార్చిలో లాంచ్ చేసింది. అదిరిపోయే స్పోర్ట్స్ లుక్, స్మార్ట్‌ఫోన్‌తో ఈజీగా కనెక్ట్ అయ్యే సాఫ్ట్‌వేర్ దీనికి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. దీని తర్వాత YU7 (ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ),హై-పెర్ఫార్మెన్స్ మోడల్ SU7 అల్ట్రా కూడా మార్కెట్లోకి వచ్చాయి. ఈ కార్లలోని టెక్నాలజీ గురించి ఎంత చెప్పినా తక్కువే. కారు లోపలి సాఫ్ట్‌వేర్ మొత్తం షావోమీ ఫోన్లతో ఇట్టే కనెక్ట్ అయిపోతుంది. అందుకే ఇప్పటి యువత షావోమీ కార్ల కోసం క్యూ కడుతున్నారు.

ప్రస్తుతం చైనాలో మాత్రమే అమ్ముడవుతున్న ఈ కార్లు, వచ్చే ఏడాది నుంచి ప్రపంచ దేశాలకు ఎగుమతి కానున్నాయి. 2026లో షావోమీ ఏకంగా 5.50 లక్షల కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం YU9 అనే కొత్త 6-7 సీటర్ ఎస్‌యూవీని, అలాగే YU7 GT, SU7 L (లాంగ్ వీల్ బేస్) వంటి లగ్జరీ మోడళ్లను సిద్ధం చేస్తోంది.

2027 నాటికి యూరప్ మార్కెట్లోకి అడుగుపెట్టాలని షావోమీ పక్కా ప్లాన్‌తో ఉంది. స్మార్ట్ డ్రైవింగ్ అసిస్టెంట్, అడ్వాన్స్‌డ్ బ్యాటరీ టెక్నాలజీ షావోమీ కార్లను మిగతా వాటికంటే భిన్నంగా నిలబెడుతున్నాయి.

Xiaomi Shocks Tesla and BYD Smartphone Giant Sells 4 1 Lakh Electric Cars in 2025

భారతదేశంలో షావోమీ ఫోన్లకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి అదే క్రేజ్‌తో షావోమీ కార్లు ఇండియాలోకి వస్తాయా? అని అందరూ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, గ్లోబల్ ఎక్స్‌పాన్షన్‌లో భాగంగా భవిష్యత్తులో ఇండియాకు వచ్చే అవకాశం లేకపోలేదు. షావోమీ కార్లు ఇండియాలోకి వస్తే టెస్లాకు గట్టి పోటీ ఖాయం.

More from DriveSpark

Article Published On: Wednesday, January 7, 2026, 9:49 [IST]
English summary
Xiaomi shocks tesla and byd smartphone giant sells 4 1 lakh electric cars in 2025
Read more on: #china #car sales
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+