కొత్త కారు కొంటున్నారా ? అయితే మీ కారులో ఈ 5 సేఫ్టీ ఫీచర్లు తప్పనిసరి!

Written By:

కార్ల తయారు చేసే కంపెనీలు ఇప్పుడు సేఫ్టీ ఫీచర్లను ఎరగా వేసి కస్టమర్లకు గాలం వేస్తున్నారు. అయితే మనం చెల్లించే ధరకు, ఎంచుకునే వేరియంట్లలో అన్ని సేఫ్టీ ఫీచర్లు ఉండవు. అయితే మనం ఎంచుకునే కార్లలో అన్ని ఫీచర్లు లేకపోయినా, అతి ముఖ్యమైన ఈ ఐదు ఫీచర్లు ప్రతి కారులో ఉండాల్సిందే. లేకపోతే అలాంటి కార్లను ఎంచుకోకండి.

కార్లలో ఉండాల్సిన అతి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు

ప్రతి ప్రయాణంలో సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవడంలో భద్రత ఫీచర్లు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి మీరు ఎంచుకునే కారులో తప్పకుండా ఉండాల్సిన ఐదు ఫీచర్లు గురించి, వాటి అవసరం మరియు ఆ ఫీచర్లు లభించే కార్ల గురించి పూర్తి వివరాలు నేటి కథనంలో...

కార్లలో ఉండాల్సిన అతి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు

ఐఎస్ఒ ఫిక్స్ - ISOFIX:

సాధారణంగా అన్ని కార్లలోని సీట్లు పెద్దలకు ప్రాధాన్యతనిస్తూ రూపొందించబడ్డాయి. అయితే ఇవే సీట్లలో పిల్లలను కూర్చోబెట్టడం ఏ మాత్రం సురక్షితం కాదు. ఈ సమస్యకు పరిష్కారమే ఐఎస్ఒఫిక్స్. సీట్ల మీద చిన్న పిల్లలను కూర్చోబెట్టడానికి వారికి సెట్ అయ్యే సీట్లను ఐఎస్ఓ మౌంట్ ద్వారా ఫిక్స్ చేస్తారు.

కార్లలో ఉండాల్సిన అతి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు

ప్రమాదం జరిగినపుడు ఐఎఎస్ఒఫిక్స్ గల సీట్లు పిల్లలు ఉండటం మరియు ఆ సీట్లకు సీట్ బెల్ట్ ఉండటంతో సురక్షితంగా ఉంటారు. పిల్లలు లేకపోయినా, పిల్లలు కనాలని ప్లాన్ చేసుకునే వారు, ఈ ఫీచరున్న కారును ఎంచుకోవడం బెటర్.

కార్లలో ఉండాల్సిన అతి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు

ఇండియన్ మార్కెట్లోని ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్లు అయిన మహీంద్రా కెయువి100 మరియు మారుతి సుజుకి ఇగ్నిస్ కార్లలో ఐఎస్ఒఫిక్స్ ఫీచర్ కలదు.

కార్లలో ఉండాల్సిన అతి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు

బ్రేక్ అసిస్ట్:

బ్రేక్ అసిస్ట్ ఫీచర్ గురించి అవగాహన చాలా మందికి ఉండకపోవచ్చు. అయినప్పటికీ బ్రేక్ అసిస్ట్ ఫీచర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. నిత్య ప్రమాదాలు జరిగే ఇండియన్ రోడ్ల మీద బ్రేక్ అసిస్ట్ అవసరం ఎంతో ఉంది.

కార్లలో ఉండాల్సిన అతి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు

బ్రేక్ అసిస్ట్ గురించి వివరంగా: ప్రమాదం జరగడానికి ముందు కొన్ని క్షణాల్లో బ్రేకులను గట్టిగా వేస్తారు. షడన్ బ్రేక్స్ అని కూడా చెప్పవచ్చు. అంటే ఎదైనా అవరోధాన్ని ఢీకొట్టడాన్ని నివారించడానికి, ఢీకొనేలోపే వాహనాన్ని ఆపాలనే ప్రయత్నంతో బ్రేకులు గట్టిగా ప్రెస్ చేస్తారు.

కార్లలో ఉండాల్సిన అతి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు

అయితే ఆ సందర్భంలో వెహికల్ వేగాన్ని పూర్తిగా తగ్గించి, ఆపడానికి కావాల్సిన బ్రేక్ పవర్ బ్రేకులను పూర్తిగా ప్రెస్ చేసినప్పటికీ లభించదు. ఇలాంటి సమయంలో బ్రేకులను పూర్తిగా(చివరి వరకు) ప్రెస్ చేస్తే, అధిక మొత్తంలో బ్రేకింగ్ పవర్‌తో వాహనాన్ని ఆపాలని బ్రేక్ అసిస్ట్ గుర్తించి తక్కువ దూరంలోనే వెహికల్‌ను ఆపేస్తుంది.

కార్లలో ఉండాల్సిన అతి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు

మరి మన రోడ్ల మీద తిరిగే కార్లలో బ్రేక్ అసిస్ట్ ఫీచర్ అవసరం ఖచ్చితంగా ఉందని నమ్ముతారు కదా...? విపణిలో నిస్సాన్ మైక్రా మరియు మారుతి స్విఫ్ట్ వంటి కార్లలో బ్రేక్ అసిస్ట్ ఫీచర్ కలదు.

కార్లలో ఉండాల్సిన అతి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు

సీట్ బెల్ట్ ప్రి టెన్షనర్ మరియు లోడ్ లిమిటర్:

కార్లు ప్రమాదానికి గురైనపుడు మన ప్రాణాలను రక్షించడంలో సీల్ట్ బెల్ట్ పాత్ర కూడా ఎంతో కీలకమైనదని మనందరికీ తెలిసిందే. ప్రమాదం జరిగిన ఒకే వెహికల్‌లో సీట్ బెల్ట్ ధరించని వారు మరణించిడం మరియు సీట్ బెల్ట్ ధరించిన వారు ప్రాణాలతో బయటపడిన సంఘటనలను ఎన్నో చూశాం. కాబట్టి ప్రతి కారులో కూడా సీట్ బెల్ట్‌తో పాటు ప్రిటెన్షనర్ మరియు లోడ్ లిమిటర్ అనే ఫీచర్లు ఉండటం తప్పనిసరి.

కార్లలో ఉండాల్సిన అతి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు

సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్: కారు భారీ ప్రమాదానికి గురైనపుడు క్యాబిన్‌లో అటు ఇటు కదలకుండా మనల్ని సీటుకు మాత్రమే అతుక్కుని ఉండేలా సీట్ బెల్ట్ పనిచేస్తుంది. అయితే హార్డ్ బ్రేకింగ్ మరియు షడన్ యాక్సిడెంట్ జరిగినపుడు శరీరం చాలా వేగంతో ముందుకు గుద్దుకోవడం జరుగుతుంది. ఈ సమయంలో ప్రమాద తీవ్రత మన దరికి చేరకుండా, మనల్ని నిటారు ఉంచేలా చేస్తుంది సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్ ఫీచర్.

కార్లలో ఉండాల్సిన అతి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు

సీట్ బెల్ట్ లోడ్ లిమిటెడ్: ప్రమాదం జరిగిన కొద్దిక్షణాలకే వెహికల్ స్లో అయ్యి, వేగంగా ఆగిపోతుంది. ఈ సమయంలో ప్రి-టెన్షనర్ పనిచేయడంతో సీట్ బెల్ట్ ఒత్తిడి శరీరం మీద అధికంగా ఉంటుంది. తద్వారా శరీరానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా, సీట్‌ బెల్ట్‌ను లోడ్‌కు అనుగుణంగా కొద్దిగా వదులు చేస్తుంది. ఇలాంటి ఫీచర్ దాదాపు అన్ని కార్లలో ఉంది. ఉదా, హోండా బ్రియో, మారుతి సుజుకి స్విఫ్ట్, టాటా టియాగో.

కార్లలో ఉండాల్సిన అతి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు

ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (EBD & ABS):

ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఫీచర్ కారులోని అన్ని చక్రాలకు చేరే సమానమైన బ్రేకింగ్ పవర్‌ను, అవసరాన్ని బట్టి ఏ చక్రానికి ఎంత బ్రేకింగ్ ఫోర్స్ వెళ్లాలి అనే విషయాన్ని నిర్ణయించి, దానికి అనుగుణంగా బ్రేక్ ఫోర్స్‌ను డిస్ట్రిబ్యూట్ సరఫరా చేస్తుంది. కారులో ఉన్న ప్రయాణికుల బరువు ఆధారంగా వెయిట్ ట్రాన్స్‌ఫర్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఫీచర్ తప్పనిసరిగా ఉంటుంది.

కార్లలో ఉండాల్సిన అతి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు

EBD ఉండటంతో ఒక్కో చక్రానికి ఒకవిధమైన బ్రేకింగ్ పవర్ సరఫరా అవుతుంటుంది. అయితే అధిక వేగం వద్ద ఎక్కువ బ్రేకింగ్ పవర్ అందితే ఆ వీల్ లాక్ అయిపోతుంది. తద్వారా టైర్లు స్కిడ్ లేగా జారడం జరుగుతుంది. ఇలా వీల్ స్కిడ్‌ను అరికట్టడానికి యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఎంతో అవసరం. ఇప్పట్లో దాదాపు అన్ని కార్లలో ఈ ఫీచర్లు ఉన్నాయి. ఉదా, టియాగో, స్విఫ్ట్, బాలెనో, బ్రియో, ఇగ్నిస్, ఫోర్డ్ ఫిగో ఇంకా ఎన్నో..

కార్లలో ఉండాల్సిన అతి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు

ఎయిర్ బ్యాగులు:

టూ వీలర్ల మీద వెళుతున్నపుడు హెల్మెట్ ఎంత అవసరమో, కారులో ఎయిర్ బ్యాగ్ కూడా అంతే అవసరం. ప్రమాదం జరిగినపుడు ప్రమాద తీవ్రత తలను తాకకుండా గాలితో నింపబడిన బెలూన్ తరహా బ్యాగ్ రక్షిస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే సెన్సార్ల ద్వారా ఎయిర్ బ్యాగులు విచ్చుకుంటాయి.

కార్లలో ఉండాల్సిన అతి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు

చాలా వరకు కార్ల తయారీ సంస్థలు స్టాండర్డ్‌గా డ్యూయల్ ఫ్రంట్(డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్) ఎయిర్ బ్యాగులను మాత్రమే అందిస్తాయి. అయితే కొన్ని కంపెనీలు ఆరు ఎయిర్ బ్యాగులను అందిస్తాయి. మనం చెల్లించే ధరను మరియు ఎంచుకునే మోడల్‌ను బట్టి ఎయిర్ బ్యాగుల సంఖ్య ఎక్కువ లేదా తక్కువ ఉంటుంది.

కార్లలో ఉండాల్సిన అతి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు

కొన్ని కార్లలో అయితే ప్రమాదం జరిగినపుడు విచ్చుకుని మన మొహాన్ని రక్షించిన తరువాత డియాక్టివేట్ అయిపోయి, యథావిధిగా వాటిస్థానంలోకి వెళ్లిపోతాయి. ప్రమాదానంతరం రిపేరీ ఖర్చును తగ్గించడానికి ఇదొక మార్గం. రెనో క్విడ్, మారుతి ఇగ్నిస్, మారుతి వ్యాగన్ ఆర్, ఆల్టో, టాటా టియాగో వంటి ఎంట్రీ లెవల్ కార్లలో ఎయిర్ బ్యాగులు ఉన్నాయి.

కార్లలో ఉండాల్సిన అతి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు
English summary
Read In Telugu: Necessary Security Features In A New Car
Story first published: Monday, July 17, 2017, 15:22 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark