ఆరు ఎయిర్ బ్యాగ్‌లు గల అత్యంత చౌకైన కారు...

ఇండియన్ మార్కెట్లో తక్కువ ధరలో ఆరు ఎయిర్ బ్యాగులను కలిగి ఉండే కారు ఏదో తెలుసా..? దాని గురించి పూర్తి వివరాలు...

By Anil

మనందరికీ తెలిసిందే... కార్లలో భద్రతకు సంభందించిన సాధారణ ఫీచర్లను కల్పించడం తప్పనిసరి చేసే ఏ విధమైన రూల్స్ ఇండియాలో లేపు. అయితే వచ్చే అక్టోబర్ 2017 నుండి దేశీయంగా అమ్ముడయ్యే ప్రతి కారులో కూడా యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ లను తప్పనిసరి చేసింది.

తక్కువ ధరలో ఆరు ఎయిర్ బ్యాగులు గల కారు

కారు ఎంతటి ప్రమాదానికి గురైనా కూడా సురక్షితంగా ప్రాణాలతో బయటపడటానికి అనేక భద్రత ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటన్నింటిలోకెల్లా ఎయిర్ బ్యాగులు అత్యంత కీలకమైనవి. అందుకోసం ఎయిర్ బ్యాగును చాలా దేశాల్లో అందుబాటులో ఉండే కార్లలో స్టాండర్డ్ ఫీచర్‌గా తప్పనిసరి చేశాయి.

తక్కువ ధరలో ఆరు ఎయిర్ బ్యాగులు గల కారు

ఇప్పటికీ చాలా వరుకు కార్ల తయారీ సంస్థలు తమ వాహనాల్లో ఒకటి లేదా రెండు ఎయిర్ బ్యాగులతో సరిపెడుతున్నాయి. ఇక పూర్తి స్థాయిలో ఎయిర్ బ్యాగులు ఉండాలంటే ధర కాస్త ఎక్కువే చెల్లించాలి, అలాంటి వాటిని కొన్ని వేరియంట్లు పేరు చెప్పి కార్ల తయారీ సంస్థలు అమ్మకాలు సాగిస్తున్నాయి.

తక్కువ ధరలో ఆరు ఎయిర్ బ్యాగులు గల కారు

అయితే ఇండియాలో తక్కువ ధరలో ఆరు ఎయిర్ బ్యాగులు గల కారు ఒకటి తెలుసా...? అమెరికాకు చెందిన ఫోర్డ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి అందించిన ఫిగో హ్యాచ్‌బ్యాక్‌లో ఏకంగా ఆరు బ్యాగులను అందించింది. ఇప్పటి వరకు దేశీయ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో గరిష్ట ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంది ఇదే.

తక్కువ ధరలో ఆరు ఎయిర్ బ్యాగులు గల కారు

ఫోర్డ్ ఇండియా లైనప్‌లో ఉన్న ఫిగో టాప్ ఎండ్ వేరియంట్ టైటానియమ్ ప్లస్ లో ఆరు ఎయిర్ బ్యాగులు కలవు. ఇప్పటి వరకు ఆరు ఎయిర్ బ్యాగులను కలిగి ఉన్న అత్యంత చౌకైన కారు ఇదే.

తక్కువ ధరలో ఆరు ఎయిర్ బ్యాగులు గల కారు

ఫోర్డ్ ఫిగో టాప్ ఎండ్ వేరియంట్ టైటానియం ప్లస్ పెట్రోల్ ఆప్షన్ ధర రూ. 6.29 లక్షలు మరియు ఫిగో టైటానియం ప్లస్ డీజల్ వేరియంట్ ధర రూ. 7.17 లక్షలు రెండు ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

విభిన్న ఎయిర్ బ్యాగుల ఉపయోగం ఏమిటి ?

విభిన్న ఎయిర్ బ్యాగుల ఉపయోగం ఏమిటి ?

సాదారణంగా చాలా కార్లు ఫ్రంట్ ఎయిర్ బ్యాగులను మాత్రమే కలిగి ఉంటాయి. ముందు వైపున ప్రమాదం జరిగినపుడు ఈ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు ఉపయోగపడతాయి. అదే పెద్ద ప్రమాదం సంభవించినపుడు కార్లు పల్టీలు కొట్టే సందర్భంలో, ప్రక్క వైపు నుండి ఇతర వాహనాలు ఢీ కొన్న సందర్భంలో మరియు వెనుక నుండి వాహనాలు ఢీ కొన్న సందర్భంలో ముందు వైపు ఉన్న ఎయిర్ బ్యాగులు ఉన్నా ఉపయోగం ఉండదు. కాబట్టి కారుకు అన్ని వైపులా ఎయిర్ బ్యాగులు (మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు) ఉండటం వలన ఎలాంటి ప్రమాదం ఎదురైనా ప్రాణాలతో బయటపడవచ్చు.

ఆరు ఎయిర్ బ్యాగులు ఎందుకు ?

ఆరు ఎయిర్ బ్యాగులు ఎందుకు ?

ఫోర్డ్ ఫిగో టైటానియం ప్లస్ వేరియంట్లో మొత్తం ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. అందులో ముందు ప్రమాదం నుండి రక్షణ కోసం 2 ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు ఉంటాయి. మరియు ముందు వైపున ఉన్న ఇద్దరు ప్రయాణికుల కోసం 2 సైడ్ ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ప్రక్క వైపు నుండి ప్రమాదం జరిగినపుడు ఇవి రక్షణ కల్పిస్తాయి. మరియు వెనుక వైపు ప్రయాణికుల కోసం ప్రక్క వైపున డోర్ల వద్ద ఇరు వైపులా 2 ఉంటాయి. కిటికీ మొత్తాన్ని కవర్ చేసే వీటిని కర్టన్ ఎయిర్ బ్యాగులని అంటారు.

తక్కువ ధరలో ఆరు ఎయిర్ బ్యాగులు గల కారు

ఆరు ఎయిర్ బ్యాగులను కలిగి ఉన్న ఈ ఫోర్డ్ ఫిగో వేరియంట్‌ను గ్లోబల్ ఎన్‌సిఎపి చేత భద్రత పరీక్షలను నిర్వహించలేదు. వీరి ఆధ్వర్యంలో ఇది అత్యుత్తమ భద్రత రేటింగ్‌ను పొందగలరు. ప్రస్తుతం దేశీయంగా అత్యంత సురక్షితమైన కార్లలో ఫోర్డ్ ఫిగో హ్యాచ్‍బ్యాక్ ఒకటి.

మరిన్ని భద్రత ఫీచర్లు

మరిన్ని భద్రత ఫీచర్లు

ఫిగో హ్యాచ్‍‌బ్యాక్ ఆరు ఎయిర్ బ్యాగులతో పాటు

  • యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్,
  • ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్,
  • ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రాం,
  • ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్,
  • హిల్ లాంచ్ అసిస్ట్ లతో పాటు
  • అత్యంత విభిన్నమైన ఫోర్డ్ ఎమర్జెన్సీ అసిస్ట్ వంటి ఫీచర్లు కలవు.
  • తక్కువ ధరలో ఆరు ఎయిర్ బ్యాగులు గల కారు

    ఆరు ఎయిర్ బ్యాగులతో ఫిగో మాత్రమే కాదు మరిన్ని కార్లు కూడా దేశీయ విపణిలో ఉన్నాయి. అయితే వాటి ధరలు 15 లక్షల వరకు ఉన్నాయి. ఫిగో ఆస్పైర్, హ్యుందాయ్ ఎలైట్ ఐ20, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, వోక్స్‌వ్యాగన్ వెంటో, హ్యుందాయ్ వెర్నా, హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా ఎక్స్‌యూవీ500, మరియు హ్యుందాయ్ ఎలంట్రాలతో పాటు మరిన్ని మోడళ్లు ఆరు ఎయిర్ బ్యాగులతో ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

    .

    • మాల్యా పాపం పండిన రోజు
    • జయలలిత గారి ఒకప్పటి ప్రపంచం ఇదే...!!
    • .

      • డొనాల్డ్ ట్రంప్ కార్ కలెక్షన్
      • మేడిన్ ఇండియా మంత్రాన్ని జపించే మోడీగారికి విదేశీ కారెందుకు?
      • తక్కువ ధరలో ఆరు ఎయిర్ బ్యాగులు గల కారు
        • ఎయిర్ బ్యాగ్స్: ఎలా పనిచేస్తాయి, ఎన్ని రకాలు, చరిత్ర

Most Read Articles

English summary
Cheapest Car In India To Give You 6 Airbags
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X