గోల్డ్‌ఫింగర్‌కి 50ఏళ్లు; గోల్డ్ ప్లేటెడ్ ఆస్టన్ మార్టిన్ డిబి5

By Ravi

ఆస్టన్ మార్టిన్ అనగానే మనకు టక్కున జేమ్స్ బాండ్ 007 చిత్రం గుర్తుకువస్తుంది. జేమ్స్ బాండ్ నటించిన గోల్డ్‌‌ఫింగర్ చిత్రంలో ఉపయోగించిన క్లాసిక్ ఆస్టన్ మార్టిన్ డిబి5 కారు, ఆ చిత్రం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని దక్కించుకుంది. ఈ కారును గోల్డ్‌ఫింగర్ (1964), థండర్‌బాల్ (1965) మరియు ఇటీవలే విడుదలైన స్కైఫాల్ (2013) బాండ్ చిత్రాల్లో ఉపయోగించారు.

ఇది కూడా చదవండి : టాప్ 10 జేమ్స్ బాండ్ కార్స్

ఆస్టన్ మార్టిన్ డిబి5 కారును తొలిసారిగా 1964లో వచ్చిన గోల్డ్‌‌ఫింగర్ జేమ్స్ బాండ్ చిత్రంలో ఉపయోగించారు. ఈ చిత్రం విడుదలై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఓ గోల్డ్ ప్లేటెడ్ ఆస్టన్ మార్టిన్ డిబి5 స్కేల్ మోడల్‌ను తయారు చేశారు. చారిటీ కోసం ఇప్పుడు ఈ స్కేల్ మోడల్‌ను వేలం వేయనున్నారు. ఈ బంగారు కారుకు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

గోల్డ్ ప్లేటెడ్ ఆస్టన్ మార్టిన్ డిబి5

తర్వాతి స్లైడ్‌లలో గోల్డ్ ప్లేటెడ్ ఆస్టన్ మార్టిన్ డిబి5 కారుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోండి.

గోల్డ్ ప్లేటెడ్ ఆస్టన్ మార్టిన్ డిబి5

బాండ్ చిత్రాలను సృష్టించిన సంస్థ ఈఓన్ ప్రొడక్షన్స్, ఆస్టన్ మార్టిన్ డిబి5 గోల్డ్ ప్లేటెడ్ థర్డ్ స్కేల్ రెప్లికాను తయారు చేసింది. ఈ కారును 24 క్యారెట్ల గోల్డ్ ప్లేట్‌తో డిజైన్ చేశారు.

గోల్డ్ ప్లేటెడ్ ఆస్టన్ మార్టిన్ డిబి5

ఎన్ఎస్‌‌పిసిసి చారిటీ కోసం ప్రముఖ వేలం సంస్థ క్రిస్టీస్ ఓ ప్రత్యేక ఆన్‌లైన్ ఆక్షన్ ద్వారా ఈ గోల్డ్ ప్లేటెడ్ ఆస్టన్ మార్టిన్ డిబి5 స్కేల్ మోడల్‌ను వేలం వేయనుంది.

గోల్డ్ ప్లేటెడ్ ఆస్టన్ మార్టిన్ డిబి5

ఈ గోల్డ్ ప్లేటెడ్ ఆస్టన్ మార్టిన్ డిబి5 రెప్లికాపై లెజండ్రీ బాండ్ ప్రొడక్షన్ డిజైనర్ సర్ కెన్ ఆడమ్ సంతంకం కూడా ఉంటుంది. 1964లో వచ్చిన గోల్డ్‌‌ఫింగర్ చిత్రంలో ఏజెంట్ 007గా నటిచించిన సియాన్ కానెరీ కోసం సర్ కెన్ ఆడమ్ ఈ కారును డిజైన్ చేశారు.

గోల్డ్ ప్లేటెడ్ ఆస్టన్ మార్టిన్ డిబి5

ఇది కేవలం డిస్‌ప్లే కారు మాత్రమే కాదు, ఇది రేడియో కంట్రోల్ సాయంతో నడిపించవచ్చు కూడా. వేలంలో ఈ విశిష్టమైన గోల్డ్ ఫింగర్ మోడల్ సుమారు 66,000 డాలర్ల నుంచి లక్ష డాలర్ల వెల పలకవచ్చని అంచనా.

గోల్డ్ ప్లేటెడ్ ఆస్టన్ మార్టిన్ డిబి5

ఈ గోల్డ్ ప్లేటెడ్ ఆస్టన్ మార్టిన్ డిబి5 కోసం బిడ్డింగ్ చేయదలచిన వారు www.christies.com/goldfinger వెబ్‌సైట్ ద్వారా బిడ్డింగ్స్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 17 వరకు మాత్రమే బిడ్డింగ్ ఓపెన్ చేయబడి ఉంటాయి.

Most Read Articles

English summary
A unique Aston Martin DB5 is going under the hammer for charity later this month in an event created to celebrate the 50th anniversary of Goldfinger – the first James Bond film to feature the now iconic luxury British sports car.
Story first published: Friday, September 12, 2014, 10:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X