భారత్ మార్కెట్లోకి కవాసకి కెయల్ఎక్స్ 110 విడుదల: ధర, మరియు ఫీచర్స్ కోసం....

By Anil

కవాసకి మోటార్స్ భారతీయ మార్కెట్లోకి తన కెయల్‌యక్స్ 110 మోడల్ బైక్‌ను విడుదల చేసింది. అందరూ దీనిని ఎంచుకోకపోవచ్చు కాని భారత దేశంలో ఎంతో మంది యువతకు రైడింగ్ అంటే ఎంతో ఇష్టం వారకి ఇది ఒక గొప్ప వరం అని దీని విడుదల సమయంలో తెలిపారు.
వీటిని కూడా చదవండి: మల్టీస్ట్రాడా 1200 బైకును విడుదల చేసిన డుకాటి:ఫీచర్స్ కోసం..

అంతేకాకుండా ఎవరైతే తమ పిల్లలకు చిన్నప్పటి నుండే రైడింగ్ నేర్పించి. వారిని పెద్దయ్యాక మోటో బైక్ రైడర్‌లుగా తీర్చిదిద్దాలనుకుంటుందో వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని నమ్మకం వ్యక్తం చేశారు.

వీటిని కూడా చదవండి: హోండా కొత్త బైక్ విడుదల: ధర ఎంతో తెలుసా?

ఈ కవాసకి కెయల్‌యక్స్ 110 బైక్ గురించి మరిన్ని విశేషాలు క్రింది కథనాలలో తెలుసుకుందాం రండి.

 ఇంజన్

ఇంజన్

కెయల్‌యక్స్ 110 బైక్‌లో 112సీసీ గల సిగింల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు. ఇది మీకు దాదాపుగా 7.24బిహెచ్‌పి పవర్ మరియు 8ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

 ట్రాన్స్‌మిషన్

ట్రాన్స్‌మిషన్

కవాసకి కెయల్‌యక్స్ 110 స్పోర్ట్స్ బైకులో 4-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ కలదు. రైడింగ్ సులభంగా ఉండేందుకు ఆటో-క్లచ్ సిస్టమ్‌తో ఈ ట్రాన్స్‌మిషన్‌ను బిల్ట్ చేశారు.

 భద్రత

భద్రత

ఇందులో గల బ్రేక్స్ ముందు వైపున ఉన్న 90ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్‌ను మరియు వెనుక వైపున 110 ఎమ్ఎమ్ మందం గల డిస్క్ బ్రేక్‌ను కల్పించారు.

 సస్పెన్షన్

సస్పెన్షన్

స్పోర్ట్స్ బైక్‌కు ఉండవలసిన మరొక లక్షణం సస్పెన్షన్. అందుకోసం దీనిలో స్టీల్ రకం బ్యాక్ బోన్‌ను ఉపయోగించారు. మరియు ముందువైపు 30ఎమ్ఎమ్ మందం గల టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ కలదు అదే విధంగా వెనుకవైపున మోనో షాక్ సస్పెన్షన్ కలదు.

 బరువు

బరువు

కవాసకి కేవలం 7 కిలో బరువును మాత్రమే మోయగలదు. అంటే ఇది యువ రైడర్స్ ఎంతో బాగా నప్పుతుంది అన్నమాట.

 కొలతలు

కొలతలు

కవాసకి కెయల్‌యక్స్ 110 మోడల్ బైక్ సీటు ఎత్తు 680ఎమ్ఎమ్ మరియు ఈ బైక్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 215 ఎమ్ఎమ్.

ఇంధన ట్యాంక్

ఇంధన ట్యాంక్

ఈ సరి కొత్త కవాసకి స్పోర్ట్స్ బైక్‌లో ఇంధన ట్యాంక్ కెపాసిటి కేవలం 3.6-లీటర్లు మాత్రమే. అంటే ఇందులో మీరి ఏ మాత్రం లాంగ్ డ్రైవ్ ప్లాన్ వేసుకోలేరు. ఒక వేళ అలాగని వెళ్లారా ప్రతిసారి ఇంధన కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది.

ధర

ధర

కవాసకి కెయల్‌యక్స్ 110 మోడల్ స్పోర్ట్స్ బైక్ ధర రూ. 2.8 లక్షలు ఎక్స్-షోరూమ్, (ముంబాయ్) గా నిర్ణయించారు.

సిబియు

సిబియు

కవాసకి ఈ కెయల్‌యక్స్ 110 బైకును భారతీయ మార్కెట్లోకి కంప్లీట్లి బిల్ట్ యూనిట్ ఆప్షన్‌తో అందివ్వనున్నారు.

మరిన్ని కొత్త టూవీలర్ల గురించి తెలుసుకోండి...

Most Read Articles

English summary
Kawasaki KLX 110 Launches In India For Rs. 2.8 Lakh
Story first published: Saturday, November 21, 2015, 18:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X