రెండు కొత్త ఫీచర్లు మరియు రంగుల్లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, 500 బైకులు

Written By:

రాయల్ ఎన్ఫీల్డ్ తమ కస్టమర్లకు మరో గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. క్లాసిక్ 350 మరియు 500 శ్రేణి మోటార్ సైకిళ్లను సరికొత్త వేరియంట్లలో విడుదల చేయడానికి రాయల్ ఎన్ఫీల్డ్ సిద్దమైంది. ఇందులో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గన్ గ్రే కలర్ మరియు క్లాసిక్ 500 స్టెల్త్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో రానుంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
కొత్త వేరియంట్లలో క్లాసిక్ 350

రహస్యంగా లీక్ అయిన సమచారం ప్రకారం, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ మోటార్ సైకిళ్లను సరికొత్త కలర్ ఆప్షన్‌లతో పాటు రెండు కొత్త ఫీచర్లను అప్‌డేట్ చేయనున్నట్లు తెలిసింది. క్లాసిక్ 350 మరియు క్లాసిక్ 500 బైకుల్లో థండర్‌బర్డ్ నుండి సేకరించిన స్వింగ్ ఆర్మ్ అందిస్తోంది.

Recommended Video
Yamaha Launches Dark Night Variants | In Telugu - DriveSpark తెలుగు
కొత్త వేరియంట్లలో క్లాసిక్ 350

థండర్‌బర్డ్ బైకులో ఉన్నటువంటి స్వింగ్ఆర్మ్, క్లాసిక్ బైకుల్లో అందివ్వడంతో రియర్ వీల్స్‌కు కూడా డిస్క్ బ్రేకులను అందివ్వడం జరిగింది. ఎంతో కాలంగా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ మోటార్ సైకిళ్లలో రియర్ డిస్క్ బ్రేక్ మిస్ అవుతూనే ఉంది.

కొత్త వేరియంట్లలో క్లాసిక్ 350

క్లాసిక్ 350 మరియు క్లాసిక్ 500 లలో నూతన స్వింగ్ ఆర్మ్ మరియు రియర్ డిస్క్ బ్రేక్ అందివ్వడం ద్వారా అత్యుత్తమ స్టెబిలిటి మరియు హ్యాండ్లింగ్ సాధ్యంకానుంది. ఇందులో ఏబిఎస్ అందివ్వడానికి వీలయ్యే విధంగా స్వింగ్ ఆర్మ్‌ను డిజైన్ చేసింది.

కొత్త వేరియంట్లలో క్లాసిక్ 350

2018 నుండి ఏబిఎస్ ఫీచర్‌ను బైకుల్లో తప్పనిసరి చేసింది కాబట్టి, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఏబిఎస్ ఫీచర్ ఫిట్ చేయడానికి వీలుగా ఉండేందుకు ఫ్యూచర్ డిజైన్‌ను రాయల్ ఎన్ఫీల్డ్ ఇందులో అవలంభించింది.

కొత్త వేరియంట్లలో క్లాసిక్ 350

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సేఫ్టీలో కీలకమైన డిస్క్ బ్రేకులు మరియు ఏబిఎస్ ఫీచర్లను అందివ్వడంలో రాయల్ ఎన్ఫీల్డ్ చాలా కాలం నుండి నెమ్మదిగా ఉండేది. అయితే, తాజాగా థండర్‌బర్డ్ నుండి సేకరించిన స్వింగ్ ఆర్మ్‌ను క్లాసిక్ 350 మరియు 500 మోడళ్లలో అందివ్వడంతో డిస్క్ బ్రేక్ కూడా జోడించింది. అతి త్వరలో ఏబిఎస్ ఫీచర్‌ను అందివ్వనుంది.

English summary
Read In Telugu: Royal Enfield Classic 350 & 500 To Receive New Colours & Two New Important Features
Story first published: Tuesday, September 5, 2017, 11:40 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark