సుజుకి ఇంట్రూడర్ 150 ఎఫ్ఐ వెర్షన్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు మైలేజ్

Written By:

సుజుకి మోటార్‌సైకిల్స్ ఇండియా లిమిటెడ్ విపణిలోకి ఇంట్రూడర్ 150 ఎఫ్ఐ వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు ఇంట్రూడర్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ ఫ్యూయల్ ఇంజెక్షన్(FI) ఆప్షన్‌లో కూడా లభ్యమవుతోంది.

Recommended Video - Watch Now!
హోండా ఎక్స్-బ్లేడ్ 160సీసీ బైక్ రివీల్ | Honda X-Blade - Details & Full Specifications - DriveSpark

సుజుకి ఇంట్రూడర్ 150 ఎఫ్ఐ ప్రారంభ ధర రూ. 1.06 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. కార్బోరేటర్ ఉన్న ఇంట్రూడర్‌ ధర రూ. 99,995 ఎక్స్-షో రూమ్(ఢిల్లీ)తో పోల్చుకుంటే ఇంట్రూడర్ ఫ్యూయల్ ఇంజెక్షన్ వేరియంట్ ధర రూ. 7,000 ఎక్కువగా ఉంది.

సుజుకి ఇంట్రూడర్ 150 ఎఫ్ఐ

సుజుకి ఇంట్రూడర్ ఎఫ్ఐ వేరియంట్‌ను తొలుత ఆటో ఎక్స్ పో 2018లో ఆవిష్కరించింది. ఫ్యూయల్ ఇంజెక్షన్ వేరియంట్ ఇంట్రూడర్ బైకులో సాంకేతికంగా మరియు కాస్మొటిక్స్ పరంగా ఎలాంటి మార్పులు జరగలేదు.

సుజుకి ఇంట్రూడర్ 150 ఎఫ్ఐ

సుజుకి ఇంట్రూడర్ 150 ఎఫ్ఐ రెండు విభిన్న రంగుల్లో లభ్యమవుతోంది. అవి, మెటాలిక్ ఓర్ట్/మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నెం.2 మరియు గ్లాస్ స్పార్క్ బ్లాక్/మెటాలిక్ మ్యాట్ టైటానియం సిల్వర్.

సుజుకి ఇంట్రూడర్ 150 ఎఫ్ఐ

సుజుకి తమ ఇంట్రూడర్ 150 క్రూయిజర్ బైకును మొట్టమొదటి సారిగా నవంబరు 2017లో దేశీయ విపణిలోకి లాంచ్ చేసింది. ఇండియన్ మార్కెట్లోని ఎంట్రీ లెవల్ క్రూయిజర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో ఒక కొత్త ట్రెండ్ సృష్టించింది. విభిన్న డిజైన్ అంశాలు మరియు ఫీచర్లతో విడుదలైనప్పుడు విపణిలో తీవ్ర అలజడిని సృష్టించింది.

సుజుకి ఇంట్రూడర్ 150 ఎఫ్ఐ

ఇప్పుడు, సుజుకి ఇంట్రూడర్ 150 బైకులో సుజుకి అడ్వాన్స్‌డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ వచ్చింది. ఇది, ఇంజన్ లోపల మండటానికి కావాల్సిన ఇంధనాన్ని ఆరు సెన్సార్ల ద్వారా ఖచ్చితంగా లెక్కించి, అంతే మోతాదులో ఇంజన్‌ లోపలికి ఇంధనాన్ని పంపించడంలో సహాయపడుతుంది. సుజుకి ఇంట్రూడర్ ఎఫ్ఐ ప్రతి యాక్సిలరేషన్ పాయింట్ వద్ద ఖచ్చితమైన పవర్ అవుట్‌పుట్ ఇస్తుంది.

సుజుకి ఇంట్రూడర్ 150 ఎఫ్ఐ

సాంకేతికంగా సుజుకి ఇంట్రూడర్ 150 ఎఫ్ఐ బైకులో 154.9సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 14బిహెచ్‌పి పవర్ మరియు 14ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

సుజుకి ఇంట్రూడర్ 150 ఎఫ్ఐ

సుజుకి ఇంట్రూడర్ 150 ఎఫ్ఐ వేరియంట్లో పొజిషన్ ల్యాంప్ గల ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఇడి టెయిల్ లైట్, డ్యూయల్ పోర్ట్ ఎగ్జాస్ట్ మఫ్లర్ మరియు బకెట్-స్టైల్ సీటు వంటి ఫీచర్లు ఉన్నాయి.

సుజుకి ఇంట్రూడర్ 150 ఎఫ్ఐ

ఇంట్రూడర్ 150 ఎఫ్ఐలో సస్పెన్షన్ పరంగా ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్ కలదు. అన్ని రకాల వేగం వద్ద పటిష్టమైన బ్రేకింగ్ కోసం ఇరువైపులా డిస్క్ బ్రేకులు మరియు ఫ్రంట్ డిస్క్ వద్ద సింగల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందివ్వడం జరిగింది.

సుజుకి ఇంట్రూడర్ 150 ఎఫ్ఐ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కార్బోరేటర్ వెర్షన్‌తో పోల్చుకుంటే ఎఫ్ఐ వేరియంట్ అత్యుత్తమ పవర్ మరియు మైలేజ్‌తో పాటు యాక్సిలరేషన్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది. డిజైన్, ఇంజన్ మరియు ఫీచర్లు అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ పవర్‌లో కొద్ది వరకు వ్యత్యాసం ఉంటుంది.

సుజుకి ఇంట్రూడర్ 150 ఎఫ్ఐ

సుజుకి ఇంట్రూడర్ 150 ఎఫ్ఐ విపణిలో ఉన్న బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 180, అవెంజర్ స్ట్రీట్ 220 మరియు అవెంజర్ క్రూయిజ్ 220 వంటి బైకులకు గట్టి పోటీనిస్తుంది. కానీ, బజాజ్ అవెంజర్ సిరీస్ బైకుల్లో ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ రాలేదు.

సుజుకి ఇంట్రూడర్ 150 ఎఫ్ఐ

English summary
Read In Telugu: Suzuki Intruder 150 FI Launched In India; Priced At Rs 1.06 Lakh
Story first published: Saturday, March 17, 2018, 11:26 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark