ట్రయంప్ బొన్‌విల్లే స్పీడ్‌మాస్టర్ బైక్ లాంచ్: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఫోటోలు

Written By:
Recommended Video - Watch Now!
UM Renegade Thor Electric Cruiser Bike India Launch Details, Price, Specifications - DriveSpark

విపణిలోకి సరికొత్త 2018 ట్రయంప్ బొన్‌‌విల్లే స్పీడ్‌మాస్టర్(Triumph Bonneville Speedmaster) బైకు విడుదలయ్యింది. సరికొత్త ట్రయంప్ బొన్‌‌విల్లే స్పీడ్‌మాస్టర్ మోటార్ సైకిల్ ధర రూ. 11.12 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

ట్రయంప్ బొన్‌‌విల్లే స్పీడ్‌మాస్టర్

విడి భాగాలను దిగుమతి చేసుకుని దేశీయంగా అసెంబుల్ చేసి అందుబాటులోకి తీసుకురావడంతో ఎక్సైజ్ డ్యూటీ 5 శాతం వరకు ఉంది. ఎక్సైజ్ డ్యూటీతో కలుపుకుని ట్రయంప్ బొన్‌‌విల్లే స్పీడ్‌మాస్టర్ ఎక్స్-షోరూమ్ ధరను ట్రయంప్ ప్రకటించింది.

ట్రయంప్ బొన్‌‌విల్లే స్పీడ్‌మాస్టర్

ట్రయంప్ బొన్‌‌విల్లే స్పీడ్‌మాస్టర్ బైకు గత ఏడాది విపణిలోకి విడుదల చేసిన బొన్‌‌విల్లే బాబర్ ఆధారంగా రూపొందించింది. ట్రయంప్ బొన్‌‌విల్లే బాబర్ మోటార్ సైకిల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.56 లక్షలుగా ఉంది.

ట్రయంప్ బొన్‌‌విల్లే స్పీడ్‌మాస్టర్

బాబర్ బైకును సిటీ అవసరాలకు అనుగుణంగా యువ కొనుగోలుదారులను టార్గెట్ చేసుకుని ప్రవేశపెట్టగా, స్పీడ్‌మాస్టర్ బైకును ట్రెడిషనల్ క్రూయిజర్ శ్రేణిలోకి కర్వీ హ్యాండిల్ బార్స్ మరియు సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్ కల్పించేందుకు ముందు వైపుకు అందించిన పుట్-పెడల్స్‌తో వచ్చింది.

ట్రయంప్ బొన్‌‌విల్లే స్పీడ్‌మాస్టర్

సాంకేతికంగా ట్రయంప్ బొన్‌విల్లే బాబర్ మరియు బొన్‌‌విల్లే స్పీడ్‌మాస్టర్ బైకులో ఒకే ఇంజన్ ఉంది. బొన్‌‌విల్లే స్పీడ్‌మాస్టర్ బైకులోని శక్తివంతమైన 1,200సీసీ కెపాసిటి గల ప్యార్లర్ ట్విన్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 6,100ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 76బిహెచ్‌పి పవర్ మరియు 4,000ఆర్‌పిఎమ్ వద్ద 106ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ట్రయంప్ బొన్‌‌విల్లే స్పీడ్‌మాస్టర్

బొన్‌‌విల్లే బాబర్‌లోని 6-స్పీడ్ గేర్‌బాక్స్, ఛాసిస్, స్వింగ్ ఆర్మ్ మరియు సస్పెన్షన్ సిస్టమ్‌ను బొన్‌‌విల్లే స్పీడ్‌మాస్టర్‌తో పంచుకుంది. స్పీడ్‌మాస్టర్‌లో బ్రేకింగ్ డ్యూటీ కోసం ముందు వైపున డబుల్-పిస్టన్ బ్రెంబో కాలిపర్స్ గల డ్యూయల్ 310ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకులు మరియు వెనుకస వైపున నిస్సిన్ కాలిపర్ గల సింగల్ 255ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ ఉంది.

ట్రయంప్ బొన్‌‌విల్లే స్పీడ్‌మాస్టర్

2018 ట్రయంప్ బొన్‌‌విల్లే స్పీడ్‌మాస్టర్‌లో ఫుల్ ఎల్ఇడి హెడ్‌ల్యాంప్స్, రైడ్-బై-వైర్ టెక్నాలజీ, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఆన్ మరియు ఆఫ్ చేసుకునే సదుపాయం గల ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఇంజన్ ఇమ్మొబిలైజర్ వంటి అతి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.

ట్రయంప్ బొన్‌‌విల్లే స్పీడ్‌మాస్టర్

ఇతర ఫీచర్లయిన, ఎల్‌సిడి మల్టీ ఇన్ఫో డిస్ల్పే గల అనలాగ్ స్పీడో మీటర్, క్రూయిజ్ కంట్రోల్, రెండు విభిన్న రైడింగ్ మోడ్స్, టార్క్ అసిస్ట్ క్లచ్ ఇంకా ఎన్నో ఉన్నాయి. స్పీడ్‍‌మాస్టర్‌లో ఇరువైపులా 16-అంగుళాల స్పోక్ వీల్స్ ఉన్నాయి. వీటిలో ఫ్రంట్ వీల్‌కు 130/90 మరియు రియర్ వీల్‌కు 150/80 కొలతల్లో ఉన్న ఏవన్ టైర్లు కలవు.

ట్రయంప్ బొన్‌‌విల్లే స్పీడ్‌మాస్టర్

సస్పెన్షన్ డ్యూటీ కోసం ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ప్రిలోడ్ అడ్జెస్టబుల్ మోనో-షాక్ అబ్జార్వర్ కలదు. 12-లీటర్ల ఇంధన ట్యాంక్ కెపాసిటి గల స్పీడ్‌మాస్టర్ లీటర్‌కు 27కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుంది.

ట్రయంప్ బొన్‌‌విల్లే స్పీడ్‌మాస్టర్

సరికొత్త ట్రయంప్ బొన్‌‌విల్లే స్పీడ్‌మాస్టర్ విపణిలో ఉన్న హ్యార్లీ-డేవిడ్సన్ స్ట్రీట్ బాబ్ మరియు ఇండియన్ స్కౌట్ సిక్ట్సి బైకులకు గట్టి పోటీనిస్తుంది. ట్రయంప్ తమ బొన్‌విల్లే స్పీడ్‌మాస్టర్‌ను 100 రకాల కస్టమైజేషన్ ఆప్షన్స్‌తో మావేరిక్ మరియు హైవే అనే రెండు ఇన్స్పిరేషన్ కిట్లను కూడా ఎంచుకోవచ్చు.

ట్రయంప్ బొన్‌‌విల్లే స్పీడ్‌మాస్టర్

ఫ్లాట్ హ్యాండిల్ బార్, లెథర్ ప్యానియర్ బ్యాగులు మరియు హైవే విండ్ స్క్రీన్ వంటి ఫీచర్ల జోడింపుతో స్పీడ్‌మాస్టర్ మూడు విభిన్న రంగుల్లో లభ్యమవుతోంది. అవి, క్రాన్‌బెర్రీ రెడ్, జెట్ బ్లాక్ మరియు ఫాంటమ్ వైట్ జోడింపుతో ఉన్న ఫ్యూజన్ బ్లాక్.

ట్రయంప్ బొన్‌‌విల్లే స్పీడ్‌మాస్టర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ట్రయంప్ బొన్‌‌విల్లే స్పీడ్‌మాస్టర్ కంపెనీ యొక్క ఎంట్రీ లెవల్ క్రూయిజర్ లైనప్‌లో స్థానం సంపాదించుకుంది. ఇదే సెగ్మెంట్లో ఉన్న పోటీని దృష్టిలో ఉంచుకుని ట్రయంప్ స్పీడ్‌మాస్టర్ ధరను అత్యంత చాకచక్యంగా నిర్ణయించింది. ధరకు తగ్గ విలువలతో ఎన్నో అద్భుతమైన ఫీచర్లతో ట్రయంప్ బొన్‌‌విల్లే స్పీడ్‌మాస్టర్‌ను తీసుకొచ్చింది.

English summary
Read In Telugu: 2018 Triumph Bonneville Speedmaster Launched At Rs 11.12 Lakh In India
Story first published: Tuesday, February 27, 2018, 17:47 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark