ఆటో ఎక్స్‌పో 2018: యుఎమ్ రెనిగేడ్ థార్ ఎలక్ట్రిక్ బైక్ విడుదల

Written By:
Recommended Video - Watch Now!
UM Renegade Commando, Classic, Renegade Sport S India First Look, Specs - DriveSpark

ఆటో ఎక్స్‌పో 2018: యుఎమ్ మోటార్ సైకిల్స్ 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో యుఎమ్ రెనిగేడ్ థార్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది. యుఎమ్ రెనిగేడ్ థార్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్ సైకిల్ ప్రారంభ ధర రూ. 4.9 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నట్లు యుఎమ్ ప్రతినిధులు వెల్లడించారు.

యుఎమ్ రెనిగేడ్ థార్ ఎలక్ట్రిక్ బైక్

రెనిగేడ్ థార్ ప్రపంచ ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్ సైకిళ్లలో మొట్టమొదటి మోడల్ యుఎమ్ రెనిగేడ్ థార్. అమెరికన్ దిగ్గజం యుఎమ్ మోటార్ సైకిల్స్ తమ ఇతర క్రూయిజర్ బైకుల తరహాలోనే రెనిగేడ్ థార్‌ను డెవలప్ చేసింది.

యుఎమ్ రెనిగేడ్ థార్ ఎలక్ట్రిక్ బైక్

సరికొత్త యుఎమ్ రెనిగేడ్ థార్ క్రూయిజర్ బైకులో 30కిలోవాట్ సామర్థ్య ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ నుండి పవర్ మరియు టార్క్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా రియర్ వీల్‌కు అందుతుంది. బెల్ట్ డ్రైవ్ ద్వారా మోటార్ ప్రొడ్యూస్ చేసే 70ఎన్ఎమ్ టార్క్ రియర్ వీల్‌ను చేరుతుంది.

యుఎమ్ రెనిగేడ్ థార్ ఎలక్ట్రిక్ బైక్

యుఎమ్ రెనిగేడ్ థార్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్ సైకిల్ సింగల్ ఛార్జింగ్‌తో 270కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇందులోని ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా 80 శాతం ఛార్జింగ్ కేవలం 40 నిమిషాల్లోనే పూర్తవుతుంది.

యుఎమ్ రెనిగేడ్ థార్ ఎలక్ట్రిక్ బైక్

యుఎమ్ రెనిగేడ్ థార్ ఎలక్ట్రిక్ బైక్ గరిష్ట వేగం గంటకు 180కిలోమీటర్లుగా ఉంది. అత్యుత్తమ పరిధి మరియు వేగంగా ఛార్జింగ్ అవుతుంది కాబట్టి యుఎమ్ రెనిగేడ్ రోజూ వారి అవసరాలకు మరియు వీకెండ్ రైడింగ్‌కు చక్కగా ఉపయోగపడుతుంది.

యుఎమ్ రెనిగేడ్ థార్ ఎలక్ట్రిక్ బైక్

యుఎమ్ రెనిగేడ్ థార్‌లో హైడ్రాలిక్ క్లచ్, కంట్రోలర్ ఆధారిత లిక్విడ్ కూల్డ్ మోటార్ ఉంది. ఇందులో ఉన్న మరో ఆసక్తికరమైన ఫీచర్, బైకును వెనక్కి నెట్టే పనిలేకుండా రివర్స్ గేర్ అందించించారు.

యుఎమ్ రెనిగేడ్ థార్ ఎలక్ట్రిక్ బైక్

మొత్తానికి, అన్ని అంశాల పరంగా యుఎమ్ రెనిగేడ్ థార్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైకు విపణిలో ఉన్న పెట్రోల్ ఇంజన్ క్రూయిజర్ మోటార్ సైకిళ్లకు గట్టి పోటీనిస్తుంది.

యుఎమ్ రెనిగేడ్ థార్ ఎలక్ట్రిక్ బైక్

డిజైన్ పరంగా, యుఎమ్ రెనిగేడ్ థార్‌లో విలక్షణమైన క్రూయిజర్ స్టైల్ డిజైన్ అంశాలు ఉన్నాయి. వెడల్పాటి హ్యాండిల్ బార్, పెద్ద పరిమాణంలో ఉన్న ట్యాంక్, తక్కువ ఎత్తులో ఉన్న సీట్ ఎత్తు, ఫ్రంట్ సెట్ ఫుట్ పెగ్స్, ట్యాంక్ మీద అందించిన డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ఇంకా బైకు మొత్తం క్రోమ్ సొబగులు ఉన్నాయి.

యుఎమ్ రెనిగేడ్ థార్ ఎలక్ట్రిక్ బైక్

యుఎమ్ రెనిగేడ్ థార్ బైకులో ముందు వైపున 280ఎమ్ఎమ్ డిస్క్ మరియు వెనుక వైపున 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను తప్పనిసరిగా అందివ్వడం జరిగింది.

యుఎమ్ రెనిగేడ్ థార్ ఎలక్ట్రిక్ బైక్

సస్పెన్షన్ కోసం ఫ్రంట్ సైడ్ 41ఎమ్ఎమ్ ట్రావెల్ ఉన్న టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి. ఇరువైపులా ఉన్న స్పోక్ స్టీల్ వీల్స్‌కు పెద్ద పరిమాణంలో పటిష్టమైన టైర్లు ఉన్నాయి.

యుఎమ్ రెనిగేడ్ థార్ ఎలక్ట్రిక్ బైక్

యుఎమ్ రెనిగేడ్ థార్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్ సైకిల్ మీద దేశవ్యాప్తంగా ఉన్న యుఎమ్ మోటార్ సైకిల్స్ షోరూమ్‍‌‌లలో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం దీనిని పూర్తి స్థాయిలో దిగుమతి చేసుకుని విక్రయించనుంది. డెలివరీలను మరికొన్ని నెలల్లో ప్రారంభించనున్నారు.

యుఎమ్ రెనిగేడ్ థార్ ఎలక్ట్రిక్ బైక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎలక్ట్రిక్ టూ-వీలర్ల సెగ్మెంట్లో యుఎమ్ రెనిగేడ్ థార్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్ సైకిల్ గేమ్-ఛేంజర్ మోడల్ అని చెప్పవచ్చు. అద్భుతమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్లు, మరియు అతి తక్కువ వ్యవధిలోనే వేగంగా ఛార్జ్ అయ్యే బ్యాటరీలు, సింగల్ ఛార్జింగ్‌తో 270కిలోమీటర్లు ప్రయాణించే కెపాసిటి వంటి ఎన్నో అంశాలు యుఎమ్ రెనిగేడ్ థార్ ఎలక్ట్రిక్ సక్సెస్‌కు కారణం కానున్నాయి.

అయితే, ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్ల కొరత విపరీతంగా ఉన్న నేపథ్యంలో యుఎమ్ రెనిగేడ్ ఎలక్ట్రిక్ థార్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి మరి.

English summary
Read In Telugu: Auto Expo 2018: UM Motorcycles Renegade Thor Electric Cruiser Launched In India At Rs 4.9 Lakh

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark