Just In
- 11 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 13 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 14 hrs ago
పూర్తి చార్జ్పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 14 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350ఎక్స్ విడుదల: ధర, ఫీచర్ల..
రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడు అవుతున్న బైకుల్లో ఎక్కువగా 350 సిరీస్ బైకులే ఉన్నాయి. క్లాసిక్ 350, బుల్లెట్ 350 మరియు బుల్లెట్ ఈఎస్ వంటి మోడళ్లకు మంచి డిమాండ్ ఉంది మరియు గరిష్ట విక్రయాలు చేపడుతున్న మోడళ్లు కూడా ఇవే. ఈ 350 సిరీస్ లోనే రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బులెట్లను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. మరి ఇందులో ఉన్న కొత్త ఫీచర్లను, అప్డేట్ వివరాలను తెలుసుకొందాం రండి..

రాయల్ ఎన్ఫీల్డ్ భారత మార్కెట్లో 2019 బుల్లెట్ 350ఎక్స్ ను లాంచ్ చేసింది. కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350ఎక్స్ రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది, వాటిలో 350ఎక్స్ స్టాండర్డ్ మరియు 350ఎక్స్ ఈఎస్ వేరియంట్లు ఉన్నాయి.

వినోద్ కె దాసరి(సిఈఓ, రాయల్ ఎన్ఫీల్డ్) మాట్లాడుతూ " ఎంతో కాలం నుండి వేచి చూస్తున్న వినియోగదారులకు బహుమతిగా దీనిని విడుదల చేసాము, దేశీయంగా మా బ్రాండ్ ను విస్తరించడానికి మేము నిరంతర కృషి చేస్తున్నాం.

అలాగే చిన్న పట్టణాలు మరియు నగరాలలో గణనీయమైన డిమాండ్ ను మేము కళ్లారా చూశాం, ఇది ఒక మంచి అభివృద్ధి అని చెప్పవచ్చు. ఈ మోటార్ సైకిల్ సెగ్మెంట్ కు త్వరలోనే భారీ మార్కెట్ ఏర్పడబోతోంది."

"ఈ పట్టణాల్లో మోటార్ సైకిలింగ్ ప్రియులకు, ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు. మన గమ్యాలను గణనీయంగా విస్తరించే ఉదేశముతో, పట్టణాలు మరియు నగరాల్లోకి ఒక దృఢమైన నెట్ వర్క్ ని రూపొందించడానికి, 250 కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ స్టోర్ల యొక్క విడుదలను ప్రకటించడం మాకు సంతోషంగా ఉంది.

ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి మరింత పెంచేందుకు మేం కచ్చితమైన ప్రణాళికలు రచిస్తున్నాం," అని అన్నారు. కొత్త బుల్లెట్ 350ఎక్స్ మరియు 350ఎక్స్ ఈఎస్ ఎక్కువగా స్టాండర్డ్ మోడల్ పై కేవలం కాస్మోటిక్ అప్డేట్ లతో వస్తుంది.

దీనిలో, కొత్త వైబ్రెంట్ పెయింట్ స్కీంలు, ట్యాంక్ మీద కొత్తగా డిజైన్ చేయబడ్డ ' రాయల్ ఎన్ఫీల్డ్ ' లోగో మరియు అన్ని క్రోమ్ లను బ్లాక్డ్-అవుట్ ఫిట్ మెంట్ లతో రీప్లేస్ చేయడం జరిగింది.
Most Read: రాయలసీమలో తయారైన తొలికారును ప్రారంభించిన కియా మోటార్స్

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350ఎక్స్ మూడు కొత్త రంగులతో అందించబడుతుంది, వాటిలో బుల్లెట్ సిల్వర్, సప్పీహైర్ బ్లూ మరియు ఒనెక్స్ బ్లాక్ లు ఉన్నాయి. అదే విధంగా బుల్లెట్ 350ఎక్స్ ఈఎస్ ను కూడా మూడు కొత్త రంగులతో అందిస్తున్నారు.
Most Read: హీరో స్ల్పెండర్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బైక్ ఇలానే ఉంటుంది

ఇందులో రీగల్ రెడ్, రాయల్ బ్లూ మరియు జెట్ బ్లాక్ ఉన్నాయి. పైన పేర్కొన్న కాస్మోటిక్ అప్డేట్లు కాకుండా, మరే ఇతర మార్పులు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350లో చేయలేదు.
Most Read: జీఎస్టీ ఎఫెక్ట్.. ఒకినవ ఎలక్ట్రిక్ స్కూటర్ లపై ధరల తగ్గింపు

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350ఎక్స్ మరియు 350ఎక్స్ ఈఎస్ రెండూ కూడా అదే 246 సిసి సింగిల్-సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కొనసాగిస్తుంది. ఇది 19బిహెచ్పి మరియు 28 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది, దీనికి ఐదు స్పీడ్ గేర్ బాక్స్ ను జత చేసారు.

స్టాండర్డ్ వేరియంట్ రూ.1.12 లక్షల ధర ఉండగా, 350ఎక్స్ ఈఎస్ రూ.1.21 లక్షల ధర ను కలిగి ఉంది. రెండు ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) గా ఉన్నాయి. ఇంజిన్ ఇంకా బిఎస్-6 ప్రామాణికంతో, రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పటికీ ఈ కొత్త ఉద్గారాల అప్డేట్ల పై పనిచేస్తుందని చెప్పారు.

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350ఎక్స్ మరియు 350ఎక్స్ ఈఎస్ ఇప్పుడు చెన్నై ఆధారిత బైక్ తయారీదారు యొక్క ఉత్పత్తి క్రమంలోనే అత్యంత సరసమైన మోడలుగా ఉన్నాయి. అమ్మకాల పరంగా ఆటో పరిశ్రమ నష్టాలలో ఉందన్న విషయం తెలిసిందే, అయితే రాయల్ ఎన్ఫీల్డ్ త్వరలో తిరిగి తన పూర్వ వైభవాన్నీ చేరుకోవడానికి ఈ కొత్త ఉత్పత్తులు సహాయపడుతుందనే ఆశతో ఉన్నారు.