దేశీయ మార్కెట్లో విడుదలైన Hero మౌంటెడ్ సైకిల్స్.. ధర కూడా తక్కువే

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లు మరియు ఎలక్ట్రిక్ బైకులకు మాత్రమే కాదు, ఎలక్ట్రిక్ సైకిల్స్ కి కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఇప్పటికే మార్కెట్లో చాలా ఎలక్ట్రిక్ సైకిల్స్ విడుదలయ్యాయి.

ఇప్పుడు భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హీరో సైకిల్స్ (Hero Cycles) దేశీయ విఫణిలోకి రెండు కొత్త ఎలక్ట్రిక్ సైకిల్స్ విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో విడుదలైన Hero మౌంటెడ్ సైకిల్స్.. ధర కూడా తక్కువే

హీరో సైకిల్స్ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన రెండు స్కూటర్లలో ఒకటి ఎఫ్2ఐ (F2i) కాగా మరొకటి ఎఫ్3ఐ (F3i). ఈ రెండు ఎలక్ట్రిక్ సైకిల్స్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ సైకిల్స్ పర్వత బైకులుగా మరియు సాహసయాత్రలు చేసే వారికి చాలా అనుకూలంగా ఉంటాయి.

దేశీయ మార్కెట్లో విడుదలైన Hero మౌంటెడ్ సైకిల్స్.. ధర కూడా తక్కువే

దేశీయ మార్కెట్లో హీరో ఎఫ్2ఐ ధర రూ. 39,999 కాగా, హీరో ఎఫ్3ఐ ధర రూ. 40,999 గా ఉంటుంది. పట్టణ ట్రాక్‌లతో పాటు ఆఫ్-రోడ్ ట్రాక్‌లపై సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని అందించడానికి అనుకూలంగా ఈ బైక్‌లు రూపొందించబడ్డాయి. కావున వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

దేశీయ మార్కెట్లో విడుదలైన Hero మౌంటెడ్ సైకిల్స్.. ధర కూడా తక్కువే

సాధారణ సైకిల్స్ తో పోలిస్తే, సాహసయాత్రలు చూసే యువతకు ఈ ఎలక్ట్రిక్ సైకిల్స్ చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ సైకిల్స్ బ్లూటూత్ మరియు స్మార్ట్‌ఫోన్ యాప్ కనెక్టివిటీ వంటి ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా రైడర్ యొక్క రైడింగ్ వంటి వాటిని ట్రాక్ చేయడానికి అనుకూలంగా ఉంటాయి.

దేశీయ మార్కెట్లో విడుదలైన Hero మౌంటెడ్ సైకిల్స్.. ధర కూడా తక్కువే

హీరో ఎలక్ట్రిక్ యొక్క Hero F2i మరియు Hero F3i రెండు సైకిల్స్ కూడా మంచి పరిధిని అందిస్తాయి. ఇవి ఒక్క ఫుల్ ఛార్జింగ్‌పై 35 కి.మీల వరకు ప్రయాణిస్తాయి. ఈ బైక్‌లు 7 స్పీడ్ గేర్లు, 100 మిమీ సస్పెన్షన్, 27.5 ఇంచెస్ మరియు 29 ఇంచెస్ డబుల్ అల్లాయ్ రిమ్స్ మరియు డ్యూయల్ డిస్క్ బ్రేక్‌ వంటి వాటిని పొందుతాయి.

దేశీయ మార్కెట్లో విడుదలైన Hero మౌంటెడ్ సైకిల్స్.. ధర కూడా తక్కువే

హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఈ రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రారంభించిన సందర్భంగా, కంపెనీ CEO ఆదిత్య ముంజాల్ మాట్లాడుతూ.. MTB విభాగంలో భారతదేశం యొక్క మొదటి కనెక్టెడ్ ఈ-సైకిల్‌లు హీరో F2i మరియు F3i మరియు హీరో లెక్ట్రోలో మేము కొత్త ఆవిష్కరణకు నాయకత్వం వహించాలని ఎదురుచూస్తున్నాము. రానున్న కాలంలో తప్పకుండా ఈ విభాగంలో ఆధిపత్యం వహిస్తాము, అన్నారు.

దేశీయ మార్కెట్లో విడుదలైన Hero మౌంటెడ్ సైకిల్స్.. ధర కూడా తక్కువే

Hero F2i మరియు Hero F3i యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, ఈ రెండు ఎలక్ట్రిక్ సైకిల్స్ లో అధిక సామర్థ్యం గల 6.4Ah IP67 రేటెడ్ వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ బ్యాటరీలు అందుబాటులో ఉంటాయి. ఇవి 250W BLDC మోటార్ యొక్క అధిక టార్క్ ఫిగర్‌ను అందిస్తాయి. అంతే కాకుండా ఈ ఎలక్ట్రిక్ సైకిల్స్ లో నాలుగు మోడ్‌ల ఆపరేషన్‌ను ఎంచుకునే ఎంపికను కూడా అందుబాటులో ఉంటుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన Hero మౌంటెడ్ సైకిల్స్.. ధర కూడా తక్కువే

ఇవన్నీ కూడా 35 కిమీల పెడెలెక్ రేంజ్‌తో 27 కిమీల త్రాటల్ పరిధిని అందించడంలో సహాయపడుతుంది. అదేసమయంలో క్రూయిజ్ కంట్రోల్‌ను అందించడంలో కూడా సహాయపడుతుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ సైకిల్స్ మాన్యువల్ మోడ్ కూడా పొందుతాయి. ఈ మాన్యువల్ మోడ్ ఎక్కువ పరిధిని అందిస్తుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన Hero మౌంటెడ్ సైకిల్స్.. ధర కూడా తక్కువే

ఈ కొత్త ఎలక్ట్రిక్ సైకిల్‌పై అమర్చిన స్మార్ట్ ఎల్ఈడీ డిస్‌ప్లేను ఉపయోగించి ఈ మోడ్‌లను ఒక మోడ్ నుండి మరొక మోడ్‌కి మార్చవచ్చు. కొత్త Hero F2i మరియు F3i ఎలక్ట్రిక్ సైకిల్‌లు MTB, హీరో లెక్ట్రో యొక్క 600 కంటే ఎక్కువ డీలర్‌ల నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉంటాయి. కావున వీటిని సులభంగా కొనుగోలు చేయవచ్చు.

దేశీయ మార్కెట్లో విడుదలైన Hero మౌంటెడ్ సైకిల్స్.. ధర కూడా తక్కువే

హీరో ఎలక్ట్రిక్ కేవలం డీలర్‌ నెట్‌వర్క్‌ ను మాత్రమే కాకుండా ప్రత్యేక ఎక్స్పీరియన్స్ సెంటర్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇవి చెన్నై మరియు కోల్‌కతాలోని జోన్‌లతో పాటు దాని ఇ-కామర్స్ భాగస్వాముల యొక్క ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. మొత్తానికి ఈ ఆధునిక కాలంలో కూడా సైకిల్స్ వినియోగం ఎక్కువగా ఉన్న కారణంగా కంపెనీ పెద్ద మొత్తంలో సైకిల్స్ విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్నాయి. రానున్న కాలంలో సైకిల్స్ వినియోగం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Hero f2i and f3i electric cycles launched in india range specification details
Story first published: Tuesday, December 28, 2021, 11:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X