ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; ఒకటి, రెండు కాదు ఏకంగా 10 కలర్స్‌లో

ఓలా కంపెనీ ఇండియన్ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేయడానికి తగిన అన్ని సన్నాహాలను సిద్ధం చేస్తోంది. అయితే ఈ స్కూటర్ దేశీయ మార్కెట్లో విడుదలవ్వకముందే అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్ గా నిలిచింది. ఎందుకంటే బుకింగ్స్ ఓపెన్ చేసిన కేవలం 24 గంటల్లోనే ఏకంగా 1 లక్షకి పైగా బుకింగ్లను స్వీకరించి రికార్డ్ సృష్టించింది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; ఒకటి, రెండు కాదు ఏకంగా 10 కలర్స్‌లో

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ ధర కేవలం 499 రూపాయలు మాత్రమే. ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్ ని త్వరలో విడుదల చేయనుంది. ఈ కొత్త స్కూటర్ రెండు వేరియంట్లలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; ఒకటి, రెండు కాదు ఏకంగా 10 కలర్స్‌లో

కంపెనీ విడుదల చేయనున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ధరను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ స్కూటర్ ధర 1 లక్ష రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఇటీవల ఈ స్కూటర్ టెస్ట్ చేసే సమయంలో మూడు కలర్ ఆప్సన్స్ లో గుర్తించబడ్డాయి. ఇందులో పింక్ మరియు బ్లాక్ కాకుండా, బ్లూ కలర్ స్కూటర్స్ గుర్తించబడ్డాయి.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; ఒకటి, రెండు కాదు ఏకంగా 10 కలర్స్‌లో

అయితే కంపెనీ ఇప్పుడు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఒక వీడియోను విడుదల చేసింది. ఇందులో ఓలా కంపనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఏ కలర్స్ లో విడుదల చేస్తుంది అనే విషయం తెలుస్తుంది. దీని ప్రకారం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం 10 కలర్ ఆప్షన్లతో అందుబాటులో ఉండనుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; ఒకటి, రెండు కాదు ఏకంగా 10 కలర్స్‌లో

ఓలా ఎలక్ట్రిక్ తన స్కూటర్ డెలివరీ కోసం హోమ్ డెలివరీ మోడల్‌ను అమలు చేయనున్నట్లు ఇటీవల అధికారికంగా తెలిపింది. ఈ విధానం కింద కంపెనీ జీతాన ఎలక్ట్రిక్ స్కూటర్లను నేరుగా బుక్ చేసుకున్న కస్టమర్ ఇంటికే హోమ్ డెలివరీ చేస్తారు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; ఒకటి, రెండు కాదు ఏకంగా 10 కలర్స్‌లో

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క వేరియంట్‌లకు సంబంధించిన సమాచారం కూడా ఇటీవల లీక్ అయింది. కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్లకు రెండు పేర్లను ట్రేడ్ మార్క్ చేసింది, వీటిలో ఎస్ 1 మరియు ఎస్ 1 ప్రో ఉన్నాయి. ఈ రెండు వేరియంట్లలో ఓలా ఎలక్ట్రిక్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; ఒకటి, రెండు కాదు ఏకంగా 10 కలర్స్‌లో

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క పరిధి విషయానికి వస్తే, ఇది ఒక పూర్తి ఛార్జీతో దాదాపు 150 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని తెలుస్తుంది. ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 90 కిమీ వరకు ఉంటుంది. ఈ స్పెసిఫికేషన్‌తో, ఇది హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో విస్తృత శ్రేణిలో చేరనుంది. స్కూటర్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 2 గంటల నుంచి 2.5 గంటలు సమయం పడుతుది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; ఒకటి, రెండు కాదు ఏకంగా 10 కలర్స్‌లో

ఓలా ఎలక్ట్రిక్ వద్ద ఉన్న లాజిస్టిక్స్ టీమ్ స్కూటర్ బుకింగ్స్ తెలుసుకుని, దానిని కొనుగోలుదారుడి ఇంటికి చేరుస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ భారత మార్కెట్లో ఈ మోడల్‌ను స్వీకరించిన మొదటి ద్విచక్ర వాహన తయారీదారు కానుంది. ఈ మోడల్ సహాయంతో కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతదేశంలోని ఏ నగరానికైనా అందించగలదు.

Most Read Articles

English summary
Ola Electric Scooter Colours Officially Revealed. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X