గుడ్ న్యూస్.. మరో 1,000 కంటే ఎక్కువ నగరాల్లో టెస్ట్ రైడ్ ప్రారంభం కానున్న Ola Electric

దేశీయ మార్కెట్లో ప్రముఖ స్కూటర్ తయారీదారు ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) యొక్క ఓలా ఎస్1 మరియు ఓలా ఎస్1 ప్రో స్కూటర్లు అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందింది. అయితే ప్రస్తుతం కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీలు ప్రారంభించలేదు. త్వరలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు కంపెనీ ఇది వరకే ప్రస్తావించింది. ఇప్పటికే కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ Ola S1 యొక్క టెస్ట్ రైడ్‌ను ప్రారంభించింది.

గుడ్ న్యూస్.. మరో 1,000 కంటే ఎక్కువ నగరాల్లో టెస్ట్ రైడ్ ప్రారంభం కానున్న Ola Electric

కంపెనీ యొక్క Ola S1 యొక్క టెస్ట్ రైడ్‌ తీసుకున్న చాలామంది కస్టమర్లు తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. దీనికి సంబంధించి కంపెనీ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ అయిన భవిష్ అగర్వాల్ తన సోషల్ మీడియా అకౌంట్ లోఒక వీడియోను కూడా విడుదల చేశారు. ఈ వీడియోలో, సంస్థ చాలా మంది వ్యక్తుల రైడింగ్ అనుభవాన్ని పంచుకోవడం మీరు చూడవచ్చు.

గుడ్ న్యూస్.. మరో 1,000 కంటే ఎక్కువ నగరాల్లో టెస్ట్ రైడ్ ప్రారంభం కానున్న Ola Electric

కంపెనీ విడుదల చేసిన వీడియోలో, ప్రజలు Ola S1 యొక్క టెస్ట్ రైడ్ గురించి వారి అనుభవాలను పంచుకుంటున్నారు. వారు దాని రైడ్ నాణ్యత మరియు పనితీరు చాలా బాగుందని తెలిపారు. Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక హై-పెర్ఫార్మెన్స్ స్పోర్టీ స్కూటర్ లాంటిదని ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గుడ్ న్యూస్.. మరో 1,000 కంటే ఎక్కువ నగరాల్లో టెస్ట్ రైడ్ ప్రారంభం కానున్న Ola Electric

ఈ సమాచారం భవిష్ అగర్వాల్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో అందించారు. కంపెనీ త్వరలో ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెస్ట్ రైడ్‌ను 1,000 కంటే ఎక్కువ నగరాల్లో ప్రారంభించబోతోంది. అంతే కాకూండా Ola S1 యొక్క టెస్ట్ రైడ్ 2021 డిసెంబర్ 15 నుండి 1000 కంటే ఎక్కువ నగరాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

గుడ్ న్యూస్.. మరో 1,000 కంటే ఎక్కువ నగరాల్లో టెస్ట్ రైడ్ ప్రారంభం కానున్న Ola Electric

భవిష్ అగర్వాల్ తన ట్విట్టర్ ఖాతాలో వీడియోను పంచుకుంటూ, మా Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్‌లకు వచ్చిన అద్భుతమైన స్పందనను చూసి చాలా ఆశ్చర్యంగా మరియు గర్వంగా ఉంది, మీరు వేలాది మంది దీనిని ప్రయత్నించారు మరియు ఇష్టపడుతున్నారు. టెస్ట్ రైడ్‌లను దేశంలో మరింత విస్తరిస్తున్నాము. భారతదేశం అంతటా 1000 కంటే ఎక్కువ నగరాలలో టెస్ట్ రైడ్ ప్రారంభించనున్నారు అని ఆయన తెలిపారు.

గుడ్ న్యూస్.. మరో 1,000 కంటే ఎక్కువ నగరాల్లో టెస్ట్ రైడ్ ప్రారంభం కానున్న Ola Electric

ఓలా ఎలక్ట్రిక్ 2021 ఆగష్టు 15 న ఓలా ఎస్1 మరియు ఓలా ఎస్1 ప్రో అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఇందులో, Ola S1 యొక్క ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,999 కాగా, Ola S1 ప్రో ధర రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్). Ola ఎలక్ట్రిక్ స్కూటర్ 3.9 kWh కెపాసిటీ గల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

గుడ్ న్యూస్.. మరో 1,000 కంటే ఎక్కువ నగరాల్లో టెస్ట్ రైడ్ ప్రారంభం కానున్న Ola Electric

750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌తో ఓలా స్కూటర్ బ్యాటరీని దాదాపు 6 గంటల 30 నిముషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75% వరకు ఛార్జ్ చేయబడుతుంది. ఓలా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక కొత్త మరియు ఆధునిక ఫీచర్లను పొందుపరిచింది.

గుడ్ న్యూస్.. మరో 1,000 కంటే ఎక్కువ నగరాల్లో టెస్ట్ రైడ్ ప్రారంభం కానున్న Ola Electric

Ola S1 పూర్తి ఛార్జ్‌పై 121 కిమీల రేంజ్‌ను అందిస్తుంది, అయితే హై ఎండ్ వేరియంట్ S1 ప్రో 181 కిమీల పరిధిని కలిగి ఉంది. రెండు స్కూటర్ల టాప్ స్పీడ్ గురించి మాట్లాడితే, Ola S1 గరిష్టంగా 90 కిమీ/గం కాగా, Ola S1 Pro గరిష్టం వేగం 115 కిమీ/గం.

గుడ్ న్యూస్.. మరో 1,000 కంటే ఎక్కువ నగరాల్లో టెస్ట్ రైడ్ ప్రారంభం కానున్న Ola Electric

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేర్వేరు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అవి నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ మోడ్స్. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, మంచి పనితీరుని కూడా అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 10 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

గుడ్ న్యూస్.. మరో 1,000 కంటే ఎక్కువ నగరాల్లో టెస్ట్ రైడ్ ప్రారంభం కానున్న Ola Electric

ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) నెదర్లాండ్స్ ఎంబసీ (నెదర్లాండ్స్ రాయబార కార్యాలయం) కోసం తొమ్మిది (9) కస్టమైజ్డ్ ఓలా ఎస్1 ప్రో స్కూటర్‌లను ప్రత్యేక ఆర్డర్‌పై తయారు చేస్తోంది. ఈ స్పెషల్ స్కూటర్లు నెదర్లాండ్స్ యొక్క అధికారిక రంగు అయిన కస్టమ్ ఆరెంజ్‌ కలర్ లో తయారు చేసి అందించబడతాయి. అంతే కాకుండా ఇవి నెదర్లాండ్స్ అధికారిక లోగోను కూడా కలిగి ఉంటాయి. ఇటీవల మేము ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ రైడ్ చేసాము. ఈ స్కూటర్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Ola s1 electric scooter test ride begins customer shares experience details
Story first published: Sunday, November 21, 2021, 10:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X