పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ధరలు, కొత్త ధరల జాబితా

భారతదేశపు ప్రీమియం టూవీలర్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్, తమ క్లాసిక్ 350 మోటార్‌‌సైకిల్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మోడల్ లైనప్‌లోని అన్ని వేరియంట్ల ధరలను కంపెనీ సవరించింది. వేరియంట్‌ను బట్టి దీని ధరలు రూ.4,500 నుండి రూ.10,000 వరకూ పెరిగాయి.

పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ధరలు, కొత్త ధరల జాబితా

క్లాసిక్ 350 కోసం ఇది వరకూ రూ.1,61,688 గా ఉన్న ప్రారంభ ధర ఇప్పుడు రూ.1,67,235 పెరిగింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిస్ 350లో ధరల పెరుగుదల మినహా, ఈ బైక్‌లో కంపెనీ ఎలాంటి ఇతర మార్పులు చేర్పులు చేయలేదు.

పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ధరలు, కొత్త ధరల జాబితా

తాజా నివేదికల ప్రకారం, క్లాసిక్ 350 బ్లాక్ ధర ఇప్పుడు రూ.1,75,405కి చేరింది, ఇదివరకు దీని ధర రూ.1,69,617గా ఉండేది. ఇందులో గన్ గ్రే స్పోక్ వీల్స్ ఉన్న బైక్ ధరను రూ.1,71,453 నుండి రూ.1,77,294 లకు పెంచారు.

పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ధరలు, కొత్త ధరల జాబితా

అదే సమయంలో, క్లాసిక్ 350 యొక్క సిగ్నల్ ఎయిర్బోర్న్ బ్లూ వేరియంట్ ధరను రూ.1,83,164 నుండి రూ.1,85,902 లకి పెంచారు. ఇందులో గన్ గ్రే అల్లాయ్ వీల్ మోడల్ ఇప్పుడు ధర రూ.1,79,809 నుండి రూ.1.

పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ధరలు, కొత్త ధరల జాబితా

అలాగే, క్లాసిక్ ఆరెంజ్ అంబర్ మరియు మెటాలిక్ సిల్వర్ కలర్ ఆప్షన్లతో కూడిన వేరియంట్ల ధరలు రూ.1,79,809 నుండి రూ.1,89,360కి పెరిగాయి. ఇకపోతే, స్టీల్త్ బ్లాక్ మరియు క్రోమ్ బ్లాక్ వేరియంట్ల ధరలు రూ.1,86,319 నుండి రూ.1,92,608 లకు పెరిగాయి. (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్).

పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ధరలు, కొత్త ధరల జాబితా

ఇదిలా ఉంటే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ క్లాసిక్ 350 మోటార్‌సైకిల్‌లో ఓ కొత్త అప్‌గ్రేడెడ్ 2021 మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా, ఇందుకు సంబంధించిన ఓ స్పై వీడియో కూడా ఆన్‌లైన్‌లో లీకైంది. ఈ వీడియోలో కొత్త 2021 మోడల్ క్లాసిక్ 350 మోటార్‌సైకిల్ రియర్ డిజైన్ వివరాలు వెల్లడయ్యాయి.

పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ధరలు, కొత్త ధరల జాబితా

కొత్త 2021 ఇయర్ మోడల్‌లో వెనుక వైపు సరికొత్త ఎల్ఈడి టెయిల్ లైట్ సెటప్‌ను అమర్చినట్లు తెలుస్తోంది. ఇందులోని టెయిల్ ల్యాంప్స్ క్లియర్ లేదా ఆరెంజ్ కలర్ క్లస్టర్లతో కనిపిస్తాయి. అంతేకాకుండా, ఈ కొత్త మోడల్ క్లాసిక్ 350 బైక్‌లోని సీట్లను కూడా ఇప్పుడు మరింత కుషన్‌తో సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే, ఇందులోని గ్రాబ్ హ్యాండిల్ కూడా పెద్దదిగా ఉన్నట్లు అనిపిస్తుంది.

పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ధరలు, కొత్త ధరల జాబితా

ఈ మోటారుసైకిల్‌లో చేయబోయే ఇతర మేజర్ అప్‌గ్రేడ్స్‌లో భాగంగా, ఇందులో బ్రాండ్ యొక్క లేటెస్ట్ ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్‌ను కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇందుకోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ క్లాసిక్ 350 మోడల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అప్‌డేటెడ్ చేయనుంది.

పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ధరలు, కొత్త ధరల జాబితా

రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ సిగ్నేచర్ ట్రిప్పర్ నావిగేషన్ ఫీచర్‌ను తొలిసారిగా మీటియోర్ 350 మోడల్‌లో పరిచయం చేసింది. క్రమంగా ఈ ఫీచర్‌ను ఇప్పుడు తమ ప్రోడక్ట్ లైనప్‌లోని అన్ని వేరియంట్లకు అందించేలా కంపెనీ చర్యలు తీసుకుంటోంది. తాజాగా వస్తున్న 2021 హిమాలయన్‌లో కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ధరలు, కొత్త ధరల జాబితా

ఇంజన్ పరంగా ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది. కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో కూడా ఇదివరకటి 349 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌నే ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 20.2 బిహెచ్‌పి పవర్‌ను మరియు 27 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది ఫైవ్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

Most Read Articles

English summary
Royal Enfield Hikes Classic 350 Prices; New Price List. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X