రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌ కొత్త కలర్స్ అదుర్స్ గురూ.. ఓ లుక్కేసుకోండి

భారతీయ మార్కెట్లో 'రాయల్ ఎన్‌ఫీల్డ్' (Royal Enfield) బైకులకున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఎందుకంటే దేశీయ మార్కెట్లో ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతూ.. ఇప్పుడు హిమాలయన్‌ ను మరో మూడు కొత్త కలర్స్ లో తీసుకువచ్చింది.

కంపెనీ సమాచారం ప్రకారం, 'రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌' (Royal Enfield Himalayan) ఇప్పుడు గ్లేసియర్ బ్లూ, డూన్ బ్రౌన్ మరియు స్లీట్ బ్లాక్ అనే మూడు కొత్త కలర్స్ లో అందుబాటులో ఉంది. సాధారణంగానే ఎక్కువ డిమాండ్ తో ముందుకు సాగుతున్న ఈ బైక్ ఇప్పుడు మరిన్ని కలర్స్ లో అందుబాటులో రావడం వల్ల మరిన్ని ఎక్కువ అమ్మకాలు పొందే అవకాశం ఉందని భావిస్తున్నాము.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌ కొత్త కలర్స్

ఈ కలర్స్ వెనుక ఉన్న సారాంశం విషయానికి వస్తే, గ్లేసియర్ బ్లూ కలర్ హిమాలయాల్లోని అతిశీతలమైన హిమానీనదాల నుండి ప్రేరణ పొందింది, అయితే డూన్ బ్రౌన్ లడఖ్‌లోని నుబ్రా వ్యాలీలోని దిబ్బల రంగును పోలి ఉంటుంది. కంపెనీ అందించే ఈ మూడు కలర్ ఆప్సన్స్ ఇప్పటికే అందుబాటులో ఉన్న పైన్ గ్రీన్, గ్రానైట్ బ్లాక్ మరియు గ్రావెల్ గ్రే కలర్స్ తో పాటు అందుబాటులో ఉంటాయి.

ఇక ధరల విషయానికి వస్తే, కలర్ ఆప్సన్ ని బట్టి ధరలు కూడా మారుతాయి. కావున డూన్ బ్రౌన్ కలర్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ధర రూ. 2.22 లక్షలు, గ్లేసియర్ బ్లూ మరియు స్లీట్ బ్లాక్ యొక్క ధరలు రూ. 2.23 లక్షల వరకు ఉంటాయి. ఈ కొత్త కలర్స్ అందుబాటులోకి రావడం వల్ల గ్రావెల్ గ్రే, రాకర్ రెడ్ మరియు లేక్ బ్లూ కలర్స్ నిలిపివేయబడ్డాయి.

కొత్త కలర్ ఆప్సన్స్ మాత్రమే కాకుండా సైడ్ ప్యానెల్‌లపై కొత్త డీబోస్డ్ లోగో మరియు ప్రామాణికంగా USB ఛార్జింగ్ పోర్ట్ వంటి అప్‌డేట్‌లను కూడా ఇందులో పొందవచ్చు. అయితే మిగిలిన డిజైన్ మరియు ఫీచర్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. మొత్తం మీద ఇది మునుపటి మోడల్ మాదిరిగానే మంచి రైడింగ్ అనుభోతిని తప్పకుండా అందిస్తుంది, కాకపోతే ఇప్పుడు రైడర్ కొత్త కలర్ బైక్ రైడ్ చేయవచ్చు.

ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 411 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 24 బిహెచ్‌పి పవర్ మరియు 32 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. కావున అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ఇంజిన్ లో ఎటువంటి మార్పులు జరగలేదు. కావున ఈ బైక్ రైడర్స్ అదే రైడింగ్ అనుభవించవచ్చు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌ కొత్త కలర్స్

ఈ మోటారుసైకిల్ యొక్క ముందు భాగంలో అదే 41 మిమీ టెలిస్కోపిక్ సస్పెన్షన్ సెటప్ మరియు వెనుక భాగంలో మోనోషాక్ ఉంటాయి. అదే సమయంలో ఈ బైక్ ముందు భాగంలో 21 ఇంచెస్ వీల్ మరియు వెనుకవైపు 17 ఇంచెస్ వీల్ ఉన్నాయి. వీటితో పాటు ముందు భాగంలో 90/90 టైర్స్ మరియు వెనుక వైపు 120/90 టైర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో కూడా ఎటువంటి మార్పులు జరగలేదు.

చివరగా కొత్త 2021 హిమాలయన్ బైక్ యొక్క బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 300 మిమీ డిస్క్ మరియు వెనుక వైపు 240 మిమీ డిస్క్ కలిగి ఉంటుంది. దీనికి డ్యూయల్ ఛానల్ ఎబిఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. మొత్తం మీద కంపెనీ తీసుకువచ్చిన ఈ మూడు కొత్త కలర్స్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి, కావున మునుపటికంటే ఎక్కువ అమ్మకాలను పొందే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Royal enfield himalayan launched in new colours details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X