భారత్‌లో విడుదలైన Voltrix Mobility సైకిల్: ధర తక్కువ, మంచి రేంజ్ కూడా..

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లు మరియు ఎలక్ట్రిక్ బైకులకు మాత్రమే కాదు, ఎలక్ట్రిక్ సైకిల్స్ కి కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఇప్పటికే మార్కెట్లో చాలా ఎలక్ట్రిక్ సైకిల్స్ విడుదలయ్యాయి. అయితే ఇప్పుడు వోల్ట్రిక్స్ మొబిలిటీ (Voltrix Mobility) దేశీయ మార్కెట్లో ఒక కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో విడుదలైన Voltrix Mobility సైకిల్: ధర తక్కువ, మంచి రేంజ్ కూడా..

వోల్ట్రిక్స్ మొబిలిటీ (Voltrix Mobility) దేశీయ మార్కెట్లో విడుదల చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ ప్రారంభ ధర రూ. 55,999. ఈ ప్రత్యేక ధర పరిచయ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది, కావున కొనుగోలుదారులు త్వరపడాలి. ఈ కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ కొనుగోలు చేయాలనుకునే వారు కేవలం రూ. 999 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

భారత్‌లో విడుదలైన Voltrix Mobility సైకిల్: ధర తక్కువ, మంచి రేంజ్ కూడా..

కంపెనీ ఈ సైకిల్ డెలివరీలను నెల చివరి రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుత తరానికి కావలసిన దాదాపు అని ఫీచర్స్ కలిగి ఉంది. అంతే కాకూండా ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కి.మీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. కావున ఇది ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించే అవకాశం ఉంటుంది.

భారత్‌లో విడుదలైన Voltrix Mobility సైకిల్: ధర తక్కువ, మంచి రేంజ్ కూడా..

ఈ కొత్త ఎలక్ట్రిక్ సైకిల్‌లో 5 పెడల్ అసిస్ట్ లెవెల్స్ మరియు త్రాటల్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఇది లిథియం-అయాన్ బ్యాటరీతో 250-వాట్ ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతుంది. ఈ సైకిల్ గంటకు 30 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించడానికి అనుమతిస్తుంది.

భారత్‌లో విడుదలైన Voltrix Mobility సైకిల్: ధర తక్కువ, మంచి రేంజ్ కూడా..

ఈ సైకిల్ యొక్క రైడర్ వేర్వేరు వేగ పరిమితులను నియంత్రించడానికి అనుకూలంగా ఐదు వేర్వేరు పెడల్ అసిస్ట్ మోడ్‌లను పొందుతాడు. అయితే త్రాటల్ ఓన్లీ మోడ్ మరియు మాన్యువల్ పెడల్ మోడ్‌ను పొందుతుంది. అయినప్పటికీ వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

భారత్‌లో విడుదలైన Voltrix Mobility సైకిల్: ధర తక్కువ, మంచి రేంజ్ కూడా..

ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌ని EMI ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ EMI ద్వారా కొనుగోలు చేయాలనుకుంటే వోల్ట్రిక్స్ సులభమైన ఫైనాన్స్ ఎంపికలను కూడా అందిస్తుంది. కంపెనీ ఈ కొత్త ఆధునిక సైకిల్ ని పట్టణ ప్రాంతాలు మరియు ఆఫీసు-ప్రయాణాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. కావున ఇది వారికి మరింత అనుకూలంగా ఉంటుంది. కేవలం ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను మాత్రమే కాకుండా.. కంపెనీ భారతీయ రోడ్లు మరియు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దీనిని అభివృద్ధి చేసినట్లు పేర్కొంది.

భారత్‌లో విడుదలైన Voltrix Mobility సైకిల్: ధర తక్కువ, మంచి రేంజ్ కూడా..

ఈ ఎలక్ట్రిక్ సైకిల్ విడుదల సందర్భంగా వోల్ట్రిక్స్ మొబిలిటీ ప్రెసిడెంట్ 'కుమార్ లోగనాథన్' మాట్లాడుతూ.. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన వినియోగం రోజురోజుకి పెరుగుతోంది. ఈ సమయంలో ఈ కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే కాకూండా ఇ-బైక్‌ల కోసం ఎలక్ట్రానిక్ భాగాల తయారీ కేంద్రాన్ని నిర్మించాలని కూడా యోచిస్తున్నట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు.

భారత్‌లో విడుదలైన Voltrix Mobility సైకిల్: ధర తక్కువ, మంచి రేంజ్ కూడా..

భారతదేశంలో తమ ఉనికిని మరియు పరిధిని నిరంతరం అభివృద్ధి చేయడానికి కంపెనీ అహర్నిశలు శ్రమిస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ 2024 నాటికి ఆరు నగరాల్లో 150 రిటైల్ అవుట్‌లెట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా ఆయన తెలిపారు. వోల్ట్రిక్స్ కంపెనీ 2024 నాటికి 40,000 పైగా ఎలక్ట్రిక్ సైకిళ్లతో భారతీయ రోడ్లపై 4 నుంచి 5 శాతం మార్కెట్ వాటాను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందని కూడా పేర్కొన్నారు.

భారత్‌లో విడుదలైన Voltrix Mobility సైకిల్: ధర తక్కువ, మంచి రేంజ్ కూడా..

అదే సమయంలో ఈ ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్ సందర్భంగా వోల్టిక్స్ మొబిలిటీ వ్యవస్థాపకుడు & సిటిఓ 'ఆర్. శక్తివిఘ్నేశ్వర్' మాట్లాడుతూ.. ఇది కంపెనీ యొక్క మొదటి ఉత్పత్తి. అయినప్పటికీ ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ప్రత్యేకంగా కార్యాలయానికి వెళ్లేవారి కోసం రూపొందించబడింది. అంతే కాకూండా వారికోసం ప్రత్యేకమైన ఫీచర్స్ తో అభివృద్ధి చేయబడిందని కూడా తెలిపారు.

భారత్‌లో విడుదలైన Voltrix Mobility సైకిల్: ధర తక్కువ, మంచి రేంజ్ కూడా..

ఈ ఎలక్ట్రిక్ సైకిల్ రోజు వారీ ప్రయాణానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది కావున లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ వంటివి కూడా అవసరం లేదు. కావున దేశీయ మార్కెట్లో ఈ మోడల్ తప్పకుండా ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షిస్తుందని ఆయన అన్నారు.

భారత్‌లో విడుదలైన Voltrix Mobility సైకిల్: ధర తక్కువ, మంచి రేంజ్ కూడా..

రాబోయే మరో ఆరు నెలల్లో కంపెనీ మరో రెండు ఉత్పత్తులను విడుదల చేయనున్నట్లు కూడా తెలిపారు. దీన్ని బట్టి చూస్తే కంపెనీ తన ప్రత్యర్థులకు సరైన ప్రత్యర్థిగా నిలువడానికి కావలసిన ప్రయత్నాలను చేస్తోంది. అయితే ప్రస్తుతం దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ ఎలాంటి అమ్మకాలను పొందుతుంది, ఎలాటి ఆదరణ పొందుతుంది అనే విషయాలు త్వరలో తెలుస్తాయి.

Most Read Articles

English summary
Voltrix tresor electric bicycle launched price range features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X