ఓలా ‘గెరువా’ ఎడిషన్‌తో హోలీ పండుగ చేసుకోండి.. బుకింగ్స్ మరియు డెలివరీలు

భారతదేశపు అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ దిన దిన ప్రవర్థమానం చెందుతూ ముందుకు దూసుకెళ్తోంది. అయితే ఈ రోజు కంపెనీ ఓలా S1 మరియు ఎస్1 ప్రో యొక్క 'గెరువా ఎడిషన్'ను విడుదల చేసింది. ఈ స్కూటర్ యొక్క బుకింగ్స్ మరియు డెలివరీ వంటి వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.

ఓలా ‘గెరువా’ ఎడిషన్‌తో హోలీ పండుగ చేసుకోండి

ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ ని పది కలర్ ఆప్సన్స్ లో అందింస్తోంది. అయితే కంపెనీ గతంలోనే ఈ 'గెరువా ఎడిషన్' గురించి ప్రస్తావించింది. అయితే ఇప్పుడు విడుదల చేసింది. దీనితో పాటు మరో ఐదు కొత్త కలర్ ఆప్సన్స్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. అవి మార్ష్‌మల్లో, మిలీనియల్ పింక్, ఆంత్రాసైట్ గ్రే, మిడ్‌నైట్ బ్లూ మరియు మ్యాట్ బ్లాక్ కలర్స్.

ఓలా ‘గెరువా’ ఎడిషన్‌తో హోలీ పండుగ చేసుకోండి

త్వరలో రాబోయే హోలీ పండుగను పురస్కరించుకుని కంపెనీ ఈ గెరువా ఎడిషన్ తీసుకురావడం జరిగింది. అయితే కంపెనీ కొనుగోలు విండో హోలీ రోజున ప్రారంభమవుతుంది. కావున ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారు కేవలం 2023 మార్చి 17 మరియు 18 వ తేదీల్లో మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

అయితే ఇందులో కూడా ముఖ్యంగా కొనుగోలు విండో మార్చి 17 న రిజర్వర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మరుసటి రోజు మార్చి 18 న అందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. కావున ఆ రోజు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం Ola యాప్‌లో రిజర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఈ గెరువా ఎడిషన్ 17 మరియు 18 తేదీల్లో మాత్రమే కొనుగోలు చేయాలి, ఆ తరువాత ఇది అందుబాటులో ఉండకవచ్చు.

ఓలా ‘గెరువా’ ఎడిషన్‌తో హోలీ పండుగ చేసుకోండి

గెరువా ఎడిషన్ స్కూటర్‌ను ప్రకటిస్తూ, ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా.. డెలివరీ మధ్యలో, olaelectric మార్కెటింగ్ బృందం మా హోలీ ప్లాన్‌ను గుర్తించింది! Ola యాప్ 17 న రిజర్వర్‌ల కోసం మరియు 18 న అందరికోసం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ఓలా ‘గెరువా’ ఎడిషన్‌తో హోలీ పండుగ చేసుకోండి

ఓలా ఎలక్ట్రిక్ గెరువా ఎడిషన్ బుక్ చేసుకున్న వారికి డెలివరీలను ఏప్రిల్ 2023 నుండి ప్రారంభమవుతాయి. అందులోనూ ఈ స్కూటర్లు డోర్ డెలివరీ చేయనున్నారు. ప్రస్తుతం ఈ గెరువా ఎడిషన్ మాత్రమే కాకుండా ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇతర 10 కలర్ స్కూటర్లను కూడా కొనుగోలు చేయవచ్చు.

ఓలా ‘గెరువా’ ఎడిషన్‌తో హోలీ పండుగ చేసుకోండి

ఢిల్లీలో Ola S1 మరియు S1 ప్రో యొక్క ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 99,999 మరియు రూ. 1,39,999. అయితే ఈ ధరలు FAME-2 సబ్సిడీని పొందిన తర్వాత మరియు ఢిల్లీ ప్రభుత్వ సబ్సిడీ పొందిన తరువాత Ola S1 ఆన్-రోడ్ ధర రూ. 85,099 కాగా, ఓలా ఎస్1 ప్రో ధర రూ. 1,10,149 వరకు ఉంటుంది. అయితే ఈ ధరలు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. కొనుగోలుదారులు దీనిని గమనించాలి.

ఓలా ‘గెరువా’ ఎడిషన్‌తో హోలీ పండుగ చేసుకోండి

ఓలా ఎస్1 ప్రో గెరువా ఎడిషన్ కొత్త కలర్ ఆప్సన్ మాత్రమే పొందింది. అయితే ఇందులో డిజైన్ మరియు ఫీచర్స్ అన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. అయితే రేంజ్, స్పీడ్ మరియు బ్యాటరీ వంటివి కొంత భిన్నంగా ఉండవచ్చు. Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ 128 కిమీ పరిధిని మరియు 95 km/h గరిష్ట వేగాన్ని అందిస్తుంది. మరోవైపు S1 ప్రో 170 కిమీ పరిధిని మరియు 116 కిమీ/గం గరిష్ట వేగాన్ని అందిస్తుంది.

నిజానికి ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌, ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న పెట్రోల్ స్కూటర్‌లతో పోలిస్తే దాదాపు 43% తక్కువ ధరను ఆదా చేస్తుంది. అంతే కాకుండా ఇది 36-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్‌ కలిగి ఉంటుంది కాబట్టి కొన్ని ఎక్కువ వస్తువులు లేదా రెండు ఓపెన్-ఫేస్ హెల్మెట్‌లను సులభంగా ఉంచుకోవచ్చు. అన్ని విధాలుగా ప్రస్తుతం వినియోగించడానికి చాలా అనుకూలంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

Most Read Articles

English summary
Ola gerua edition booking and delivery details
Story first published: Sunday, January 8, 2023, 14:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X