ముంబై పోలీసుల కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ పెట్రోల్ బైక్స్

By Ravi

ముంబై పోలీసులు చాలా లక్కీ. త్వరలోనే వీళ్లు హైటెక్ పెట్రోలింగ్ మోటార్‌సైకిళ్లను ఉపయోగించనున్నారు. బహుశా దేశంలో ఈ తరహా అధునాత మోటార్‌సైకిళ్లను ఉపయోగించే మొదటి లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ముంబై పోలీసులే కావచ్చేమో. ఇప్పటికే విదేశాల్లో ఈ తరహా అధునాత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మోటార్‌సైకిళ్లను అక్కడి పోలీసులు ఉపయోగిస్తుండటాన్ని మనం చూసే ఉంటాం.

ముంబై‌కు చెందిన రోడ్ రేజ్ కస్టమ్ బిల్డ్స్ వ్యవస్థాపకుడు గాబ్రియేల్ జుజార్ట్ ఈ హైటెక్ మోటార్‌సైకిళ్లను తయారు చేశాడు. అమెరికాలో ఎఫ్‌బిఐ వాళ్లు ఉపయోగించే బైక్‌ల నుంచి స్ఫూర్తి పొంది ఈ హైటెడ్ పెట్రోలింగ్ మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు. మన దేశంలో లభిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 క్లాసిక్ మోటార్‌సైకిల్‌ను ఆధారంగా చేసుకొని గాబ్రియేల్ ఈ బైక్‌కు రూపకల్పన చేశాడు.

Royal Enfield Patrol Bikes For Mumbai Cops

గాబ్రియేల్ కస్టమైజ్ చేసిన ఈ పెట్రోలింగ్ బైక్‌కు ముందు వైపు, వెనుక వైపు అన్ని వాతావరణాల్లో పనిచేసే కెమెరాలు, జిపిఎస్, అన్ని వాతావరణాల్లో పనిచేసే ల్యాప్‌టాప్, జరిమానాను జనరేట్ చేసేందుకు ప్రింటర్, ఎమర్జెన్సీ ఇన్వెస్టిగేషన్ కోసం ఉపయోగించే బేసిక్ ఫోరెన్సిక్ టూల్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్, స్పేర్ బ్యాటరీలను భద్రపరుచుకునేందుకు స్టోరేజ్ స్థలం, ఇతర రక్షక కవచాలు మొదలైనవి పరికరాలను అమర్చారు.

అంతేకాకుండా, విఐపిలు ప్రయాణిస్తుప్పుడు ట్రాఫిక్‌ను అలెర్ట్ చేయటం కోసం ఈ బైక్‌కు ఎమర్జెన్సీ లైట్లను కూడా అమర్చారు. గాబ్రియేల్ జుజార్టే వచ్చే ఆగస్టులో ఈ బైక్ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించనున్నాడు. ఆ తర్వాత దీనిని ట్రైల్ కోసం ముంబై పోలీసులకు ఇవ్వనున్నాడు. ఈ ట్రైల్ సక్సెస్ అయినట్లతే, త్వరలోనే ముంబై పోలీసులు కూడా అమెరికన్ కాప్స్ మాదిరిగా ఈ మోడ్రన్ పెట్రోలింగ్ మోటార్‌సైకిళ్లపై పోష్‌గా కనిపిస్తారన్నమాట..!

Most Read Articles

English summary
Mumbai Police could soon become the country's first law enforcement agency to ride high-tech patrolling motorcycles, with features that are found commonly in patrol bikes of other countries. Gabriel Zuzarte, founder of Mumbai based Road Rage Custom Builds, is the man behind the high tech police bike. Zuzarte, inspired by patrol bikes used by FBI in the US, came up with his concept based on the Royal Enfield Bullet 350 Classic.
Story first published: Thursday, May 16, 2013, 13:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X