2017 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ అసలు రూపం ఇదే...!!

మారుతి సుజుకి తమ 2017 స్విఫ్ట్ డిజైర్ ను గత కొంత కాలం నుండి రహస్యంగా భారతీయ రోడ్ల మీద పరీక్షిస్తోంది. ఈ సరికొత్త కాంపాక్ట్ సెడాన్‌కు చెందిన నూతన ఫోటోలు ఇంటర్నెట్లో ల్యాండ్ అయ్యి చక్కర్లు కొడుతున్నాయి.

By Anil

మారుతి సుజుకి 2017 నాటికి దేశీయ విపణిలోకి తమ కొత్త తరం స్విఫ్ట్ డిజైర్‌ను విడుదల చేయడానికి సిద్దమవుతోంది. తమ స్విఫ్ట్ స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్ కన్నా ముందుగా ఈ డిజైర్‌ విడుదలకు ప్రాధాన్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి సంభందించిన నూతన ఫోటోలు ఇంటర్నెట్లో సునామీని సృష్టిస్తున్నాయి. అందులో కొన్ని చిత్రాలు మరియు ఇతర వివరాలు....

2017 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

ప్రస్తుతం మీడియా వెబ్‌సైట్లో ల్యాండ్ అయిన 2017 స్విప్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ యొక్క చిత్రాలు మార్కెట్ వర్గాల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

2017 మారుతి స్విఫ్ట్ డిజైర్ బాడీ మరియు ఫ్రంట్ డిజైన్ పూర్తిగా స్పోర్ట్స్ శైలిలో ఉంది.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

చాలా వరకు ఎక్ట్సీరియర్ ఫోటోలు విడుదలయ్యాయి. అయితే ఇంటీరియర్‌కు సంభందించిన వివరాలు ఇప్పటికీ గోప్యంగానే ఉన్నాయి. దీనిని స్విఫ్ట్ స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్ ఆధారంతో అభివృద్ది చేస్తుండటం వలన అదే శైలిలో దీని ఇంటీరియర్ ఉండనుంది

2017 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

చాలా వరకు కార్లలో కామన్‌గా కనిపిస్తున్న ఫీచర్లలో డ్యూయల్ ఎయిర్ బ్యాగు, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, అల్లాయ్ వీల్స్, కీ లెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ అండ్ స్టాప్ మరియు ఆటోమేటిక్ ఎయిర్ కంట్రోల్ వంటివి ఉండే అవకాశం ఉంది.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

అధునాతన హంగులతో భారీ అంచనాలతో అభివృద్ది జరుగుతున్న 2017 స్విఫ్ట్ డిజైర్‌లో తాకే తెర గల స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, న్యావిగేషన్, రివర్స్ కెమెరా మరియు స్టీరింగ్ ఆధారిత ముఖ్య నియంత్రికలు ఇందులో రానున్నాయి.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

మారుతి సుజుకి తమ బాలెనోని తక్కువ బరువుతో నిర్మించేందుకు ప్రత్యేక తయారీ వేదికను వినియోగించింది. ఇప్పుడు అదే వేదిక ఆధారంగా ఈ స్విఫ్ట్ డిజైర్‌ను అభివృద్ది చేస్తోంది మారుతి. మునుపటి డిజైర్‍‌తో పోల్చుకుంటే 80 కిలోల వరకు తక్కువ బరువుతో వచ్చే అవకాశం ఉంది.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

సరికొత్త డిజైర్ 1.2-లీటర్ సామర్థ్యం గల కె-సిరీస్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ సామర్థ్యం ఉన్న ఫియట్ మల్టీ జెట్ టర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌తో వచ్చే అవకాశం ఉంది.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

లైట్ వెయిట్ ఫ్లాట్ ఫామ్ మీద దీనిని అభివృద్ది చేయడం వలన మైలేజ్‌ మెరుగ్గా ఉండటం మరియు కారు యొక్క వేగం అధికంగా ఉంటుంది.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

పెట్రోల్ వాహనాలతో పోల్చుకుంటే డీజల్ వాహనాలు ఉత్తమ మైలేజ్ ఇవ్వగలవు. కాబట్టి మారుతి తమ అప్ కమింగ్ 2017 డీజల్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌లో స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ ఫ్రమ్ సుజుకి అనే హైబ్రిడ్ సాంకేతికతను ప్రవేశపెట్టనుంది. తద్వారా మైలేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

ప్రస్తుతం ఉన్న పరిణామాల దృష్ట్యా మారుతి ఈ సరికొత్త 2017 స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌ను వచ్చే ఏడాది పండుగ సీజన్‌కు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నిస్తోంది.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ డిజైర్ ప్రొడక్షన్‌కు సంభందించిన కార్యకలాపాలను వచ్చే ఏడాది మొదటి త్రైమాసకంలో గుజరాత్ ప్లాంటులో ప్రారంభించనుంది.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

  • విడుదలకు సిద్దమైన మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్
  • మారుతి బాలెనొ ఆర్ఎస్ గురించి ముఖ్యమైన విషయాలు
  • పాక్ అంతం తద్యం అంటున్న ఇండియా-రష్యా భారీ ఒప్పందం

Most Read Articles

English summary
This Is How The 2017 Maruti Suzuki Swift Dzire Will Look Like
Story first published: Thursday, November 3, 2016, 15:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X