పెద్ద ఎస్‌యువిని విడుదలకు సిద్దమవుతున్న మారుతి సుజుకి

మారుతి సుజుకి తమ లైనప్‌లో ఉన్న వితారా బ్రిజా కు పై స్థానంలో మరో పెద్ద ఎస్‌యువి విడుదల చేయడానికి సిద్దమవుతోంది.

Written By:

మారుతి సుజుకి ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువి మంచి విజయాన్ని సాధించిపెట్టింది. కేవలం ఆరు నెలల కాలంలోనే 1,72,000 యూనిట్ల బుకింగ్స్ నమోదు చేసుకుంది. మరియు నెలకు సుమారుగా 10,000 లకు పైగా వితారా బ్రిజా ఎస్‌యువిలు అమ్ముడుపోతున్నాయి. అయితే దీనికి పై స్థానంలో మరో పెద్ద ఎస్‌యువిని విడుదల చేయడానికి మారుతి సిద్దమవుతోంది.

ఇండియన్ మార్కెట్లో వితారా బ్రిజా మంచి విజయాన్ని అందుకున్న తరుణంలో దీని కన్నా పెద్ద ఎస్‌యువిని విడుదల చేస్తే ఇదే తరహా ఫలితాలు సాధ్యమని మారుతి సుజుకి ఇండియా ఛైర్మెన్ ఆర్‌సి భార్గవ్ తెలిపాడు.

ప్రస్తుతం దేశీయంగా ఉన్న ప్రీమియమ్ ఎస్‌యువి సెగ్మెంట్లోకి తమ పెద్ద ఎస్‌యువి విడుదల చేస్తామని ఆయన తెలిపాడు.

ప్రస్తుతం యురోపియన్ మార్కెట్లో అమ్మకాల్లో ఉన్న 2016 సుజుకి వితారా ఎస్‌యువి దేశీయంగా పరిచయం చేసే అవకాశం ఉంది. దీనినే మారుతి తమ ఇండియా పోర్ట్‌ఫోలియోలోకి ఎంచుకోనున్నట్లు కూడా బార్గవ్ తెలిపాడు.

బార్గవ్ గారు మాట్లాడుతూ, ప్రస్తుతం ఇండియన్ ఎస్‌యువి సెగ్మెంట్లో మేము కేవలం కాంపాక్ట్‌ ఎస్‌యువిలోకి మాత్రమే అడుగుపెట్టాము. భవిష్యత్తులో కాంపాక్ట్ ఎస్‌యువి కన్నా పెద్ద వాహనాలను ప్రవేశపెడతాము. అయితే వాటి విడుదల ఎప్పుడు ఉంటుందనేది ఆయన వెల్లడించలేదు.

దేశీయంగా ప్రీమియమ్ ఎస్‌యువి రూపంలో విడుదలయ్యే అవకాశం ఉన్న ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో గల వితారా ఎస్‌యువి పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్లలో ఉంది.

సుజుకి వితారా లోని 1.6-లీటర్ సామర్థ్యం గల విటివిటి పెట్రోల్ ఇంజన్ 120బిహెచ్‌పి పవర్ మరియు వితారాలోని స్పోర్ట్స్ వేరియంట్లో గల 1.4-లీటర్ సామర్థ్యం గల టర్బో ఛార్జ్‌డ్ బూస్టర్ జెట్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 138బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

సుజుకి వితారా డీజల్ వేరియంట్లో 1.6-లీటర్ సామర్థ్యం గల డిడిఐఎస్ డీజల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 120బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

సుజుకి వితారా ఎస్‌యువి లోని అన్ని ఇంధన వేరియంట్లలో కూడా 5-స్పీడ్ మరియు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు ఆప్షనల్‌గా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానంతో వచ్చే అవకాశం ఉంది.

సుజుకి వితారా ఎస్‌యువిలో ఆల్‌గ్రిప్ ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్, రాడార్ బ్రేక్ సపోర్ట్, క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్ లతో పాటు ఏడు అంగుళాల పరిమాణం గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, టైర్ ప్రెసర్ మానిటరింగ్ సిస్టమ్, ఎల్‌ఇడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కలవు.

భద్రత పరంగా ఈ సుజుకి వితారా ఎస్‌యువిలో ఏడు ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్లతో పాటు 5-స్టార్ల ఏఎన్‌సిఎపి భద్రత రేటింగ్ కూడా పొందింది.

మారుతి ఇండియన్ మార్కెట్లోకి ఈ సుజుకి వితారా ఎస్‌యువిని విడుదల చేస్తే దీనిని రూ. 10 నుండి 15 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ ధరతో విడుదల చేసే అవకాశం ఉంది.

సుజుకి వితారా ఎస్‌యువి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా ఎక్స్‌యువీ500 మరియు రెనో డస్టర్ వంటి ఎస్‌యువిలకు గట్టి పోటీగా నిలవనుంది.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Maruti Suzuki Considering To Launch Bigger SUV — To Be Slotted Above Vitara
Please Wait while comments are loading...

Latest Photos