2017 మారుతి సుజుకి స్విప్ట్ డిజైర్‌కు రహస్య పరీక్షలు

అత్యంత రహస్యంగా మారుతి సుజుకి తమ తరువాత తరానికి చెందిన 2017 స్విఫ్ట్ డిజైర్‌ను దేశీయంగా పరీక్షించింది.

By Anil

మారుతి సుజుకి తమ తరువాత తరానికి చెందిన 2017 స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌కు దేశీయంగా అత్యంత రహస్యంగా పరీక్షలు నిర్వహిస్తోంది. రూపు రేఖలు గుర్తు పట్టడానికి ఏ మాత్రం వీలు లేకుండా నల్లటి కవర్‌తో కప్పివేశారు. ప్రోటోటైప్ మోడల్‌గా దీనిని ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లోని రహదారుల మీద పరీక్షిస్తున్నారు.

2017 మారుతి స్విప్ట్ డిజైర్ టెస్టింగ్

ఫోటోలను క్షుణ్ణంగా పరిశీలిస్తే దీని ముందు వైపున ఉన్న ఫ్రంట్ గ్రిల్ 2017 కు చెందిన స్విఫ్ట్ డిజైర్‌ను పోలి ఉంది. మారుతి దీనిని 2017 జెనీవా మోటార్ షో వేదిక మీద ప్రదర్శించనుంది.

2017 మారుతి స్విప్ట్ డిజైర్ టెస్టింగ్

ప్రస్తుతం పరీక్షలకు గురైన 2017 స్విఫ్ట్ డిజైర్ ముందు భాగంలో ఎక్కువ గాలిని గ్రహించేందుకు అతి పెద్ద ఫ్రంట్ గ్రిల్, ప్రొజెక్టర్ హెడ్‌ ల్యాంప్స్, పగటి పూట వెలిగే లైట్లు, మరియు గుండ్రటి ఆకారంలో ఉన్న ఫాగ్ లైట్లు కలవు.

2017 మారుతి స్విప్ట్ డిజైర్ టెస్టింగ్

2017 స్విఫ్ట్ డిజైర్ ఇంటీరియర్ పరంగా పెద్ద మార్పులు చోటు చేసుకోలేదు, దాదాపుగా ఇప్పుడు ఉన్న డిజైర్ తరహాలోనే ఉంది. అయితే డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ బీజి థీమ్‌లో ఇంటీరియర్ రూపుదిద్దుకోనుంది.

2017 మారుతి స్విప్ట్ డిజైర్ టెస్టింగ్

భద్రత పరంగా 2017 స్విఫ్ట్ డిజైర్‌లో డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటివి కలవు.

2017 మారుతి స్విప్ట్ డిజైర్ టెస్టింగ్

ఫీచర్ల పరంగా ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అల్లాయ్ వీల్స్, కీ లెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ అండ్ స్టాప్, తాకే తెర గల స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రివర్స్ కెమెరా, న్యావిగేషన్ మరియు స్టీరింగ్ నిర్మిత నియంత్రికలు ఇందులో ఉన్నాయి.

2017 మారుతి స్విప్ట్ డిజైర్ టెస్టింగ్

సెడాన్ మరియు హ్యాచ్‌బ్యాక్ రెండువేరియంట్లను తక్కువ బరువు ఉండే విధంగా బాలెనోని రూపొందించిన వేదిక మీద అభివృద్ది చేస్తోంది మారుతి.

2017 మారుతి స్విప్ట్ డిజైర్ టెస్టింగ్

మారుతి సుజుకి తమ 2017 స్విఫ్ట్ డిజైర్‌లో 1.2-లీటర్ సామర్థ్యం గల కె-సిరీస్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ సామర్థ్యం గల డిడిఐఎస్ డీజల్ ఇంజన్‌లను అందివ్వనుంది.

2017 మారుతి స్విప్ట్ డిజైర్ టెస్టింగ్

2017 లో విడుదల కానున్న తరువాత తరం స్విప్ట్ డిజైర్ సెడాన్ మరియు స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లలో సుజుకి వారి స్మార్ట్ హైబ్రిడ్ సాంకేతికతను పరిచయం చేసే అవకాశం ఉంది. హైబ్రిడ్ సాంకేతికత ఈ రెండింటిలో పరిచయం అయితే మార్కెట్లో సునామీ సృష్టించడం ఖాయం.

Source: CarToq

.

  • పాకిస్తాన్ కోసం ప్రత్యేకమైన ఆల్టో660: మారుతి సుజుకి
  • దీపావళికి భారీ ఆఫర్లతో ముందుకొచ్చిన హోండా టూ వీలర్స్
  • నౌకల్ని మింగుతున్న బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీలో కొత్త ట్విస్ట్

Most Read Articles

English summary
Read In Telugu: 2017 Maruti Suzuki Swift Dzire Spied Testing For The First Time
Story first published: Tuesday, October 25, 2016, 17:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X