ఇగ్నిస్ విడుదలను టీజర్ ద్వారా ఖాయం చేసిన సుజుకి

భారత దేశపు ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ ఇగ్నిస్ క్రాసోవర్ విడుదలకు సంభందించిన టీజర్ విడుదల చేసింది.

Written By:

మారుతి సుజుకి తమ నెక్సా నెబ్‌సైట్ ద్వారా ఇగ్నిస్ ను ఇండియన్ మార్కెట్లోకి విడుదలను ఖాయం చేసింది. క్రాసోవర్ హ్యాచ్‌బ్యాక్ అయిన ఇగ్నిస్ ను మారుతి సుజుకి తమ ప్రీమియమ్ షోరూమ్ నెక్సా సరసన చేర్చింది.

ఇగ్నిస్ క్రాసోవర్‌లో 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్‌లను పరిచయ చేయనుంది. ఇవే ఇంజన్‌లను బాలెనో మరియు స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ లలో గుర్తించవచ్చు.

మారుతి సుజుకి ఈ ఇగ్నిస్ క్రాసోవర్ ను 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించబడింది. అప్పట్లోనే దానిని 2016 లోపు విడుదల చేస్తామని మారుతి తెలిపింది. అయితే ఉత్పత్తి ఆలస్యం కావడం వలన 2017 నాటికి మార్కెట్లోకి విడుదల చేయడానికి మారుతి సిద్దమవుతోంది.

మారుతి సుజుకి తమ ప్రీమియమ్ కస్టమర్ల ఉత్పత్తులను ఎంచుకునే కస్టమర్ల కోసం ప్రారంభించిన నెక్సా ప్రీమియమ్ షో రూమ్ ద్వారా మార్కెట్లోకి విడుదల చేయనుంది.

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న మహీంద్రా కెయువి100 కు గట్టి పోటీనివ్వనున్న ఇగ్నిస్ క్రాసోవర్ హ్యాచ్‌బ్యాక్ ఐదు లక్షల రుపాయల ప్రారంభ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

మారుతి సుజుకి తమ ఇగ్నిస్ క్రాసోవర్ హ్యాచ్‌బ్యాక్ విడుదలకు సంభందించిన టీజర్ వీడియోను విడుదల చేసింది. వీక్షించగలరు...

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Sunday, December 11, 2016, 20:44 [IST]
English summary
Maruti Suzuki Ignis Launch Imminent As Nexa Listing Goes Up
Please Wait while comments are loading...

Latest Photos