డిసెంబర్ 2016 కు గాను మారుతి ప్రత్యేక ఆఫర్లు మరియు తగ్గింపు

Written By:

మారుతి సుజుకి గత రెండు నెలల కాలంలో వరుసగా ఆఫర్లు ప్రకటించడం ఇది రెండవసారి. నోట్ల రద్దు కారణంగా ఒక సారి, ఇప్పుడు 2016 డిసెంబర్ అదేనండి సంవత్సరాంతపు ఆఫర్లంటూ తమ ఉత్పత్తులపై డిస్కౌంట్లు మరియు క్యాష్ బ్యాక్‌ ఆఫర్లను ప్రకటించింది. ఇండియన్ మార్కెట్లో ఉన్న ప్రతి కార్ల తయారీ సంస్థ కూడా తమ ఉత్పత్తులపై సంవత్సరాంతపు ఆఫర్లను ప్రకటించింది. మిగతా వాటిలాగే మారుతి సుజుకి తమ లైనప్‌లో ఉన్న ఎంచుకోదగ్గ ఉత్పత్తులపై ఆఫర్లు ప్రకటించింది.

మారుతి సుజుకి సంవత్సరాంతపు ఆఫర్లుగా ప్రత్యేకంగా ఐదు ఉత్పత్తుల మీద గరిష్టంగా రూ. 75,000 ల వరకు లాభాలను ప్రకటించింది. అయితే అన్ని మోడళ్లలోని డీజల్ వేరియంట్ల మీద మాత్రమే ఈ ఆఫర్లు ఉన్నట్లు మారుతి స్పష్టం చేసింది.

మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివి లోని డీజల్ వేరియంట్ కొనుగోలు మీద ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ రూ. 15,000 ల వరకు ప్రకటించింది. మారుతి ఎర్టిగా డీజల్ ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ. 9,21,268 లు ఆన్ రోడ్ హైదరాబాద్‌గా ఉంది.

మారుతి లోని కాంపాక్ట్ సెడాన్ స్విఫ్ట్ డిజైర్ మీద 10,000 రుపాయల వరకు డిస్కౌంట్ మరియు ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ రూ. 15,000 లుగా ఉన్నాయి. స్విఫ్ట్ డిజైర్ డీజల్ ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ. 7,65,696 లు ఆన్ రోడ్ హైదరాబాద్‍‌గా ఉంది.

మారుతి సుజుకి లోని బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ (డీజల్ వేరియంట్) మీద రూ. 35,000 ల వరకు ఎక్స్‌‌చ్చేంజ్ బోనస్ అందిస్తోంది. స్విఫ్ట్ డీజల్ ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ. 7,11,991 లు ఆన్ రోడ్ హైదరాబాద్‌గా ఉంది.

మారుతి తమ చిన్న మరియు శక్తివంతమైన హ్యాచ్‌బ్యాక్ రిట్జ్ మీద ఆఫర్లను భారీగా కుమ్మరించింది. ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్‌గా రూ. 25,000 లు మరియు క్యాష్ బ్యాక్ రూ. 35,000 లు వరకు లాభాలున్నాయి. రిట్జ్ డీజల్ ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ. 6,56,423 లు ఆన్ రోడ్ హైదరాబాద్‌గా ఉంది.

మారుతి సుజుకి తమ ప్రీమియమ్ సెడాన్ సియాజ్ లోని డీజల్ వేరియంట్లను ఎంచుకునే వారికి క్యాష్ బ్యాక్ రూపంలో రూ. 20,000లు మరియు ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ రూపంలో రూ. 40,000 లు వరకు ఆఫర్లు ప్రకటించింది. సియాజ్ డీజల్ సెడాన్ ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ. 9,95,663 లు ఆన్ రోడ్ హైదరాబాద్‌గా ఉంది.

మారుతి లైనప్‌లో ఉన్న సెలెరియో డీజల్ వేరియంట్ మీద భారీ ఆఫర్లున్నాయి. సెలెరియోని ఎంచుకునే వారికి ఇదే సరైన సమయం. సెలెరియో డీజల్ వేరియంట్ మీద క్యాష్ డిస్కౌంట్ రూ. 30,000 లు, ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ రూ. 25,000 లు మరియు అదనపు డిస్కౌంట్ రూ. 20,000 లు వరకు తగ్గింపు కలదు.

సెలెరియో డీజల్ వేరియంట్ మీద మొత్తం రూ. 75,000 రుపాయల వరకు లాభాలున్నాయి. సెలెరియో డీజల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 5,70,737 లు ఆన్ రోడ్ హైదరాబాద్‌గా ఉంది.

 

English summary
Maruti Suzuki Announces Offers & Benefits For December 2016
Please Wait while comments are loading...

Latest Photos