రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌ను నిలిపివేయనున్న మారుతి సుజుకి
ప్రస్తుతం రిపోర్ట్‌లు ఇస్తున్న సమాచారం నిజమైతే మారుతి సుజుకి లైనప్‌లో ఉన్న రిట్జ్ హ్యాచ్‌బ్యాక్ లైనప్ నుండి తప్పుకోనుంది. అయితే ఆక్టోబర్ 1, 2016 నుండి మారుతి తమ రిట్జ్ హ్యాచ్‌బ్యాక్ ఉత్పత్తిని నిలిపివేసిట్లు కూడా తెలసింది. అయితే మారుతి తమ ఇగ్నిస్ మీద ఎక్కువ శ్రద్ద చూపడంతో రిట్జ్ మార్కెట్ నుండి దూరం కానుంది అనే కథనం కూడా ప్రచారంలో ఉంది.

మారుతి సుజుకి 2009 లో మొదటి సారిగా రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌ను మార్కెట్లోకి పరిచయం చేసింది. అయితే అందుబాటులోకి వచ్చినప్పటి నుండి మధ్య స్థాయి అమ్మకాలను మాత్రమే సాధించింది.

మారుతి ఆశించని అమ్మకాలను రిట్జ్ సాధించకపోవడంతో 2012 లో ఫేస్‌లిఫ్ట్ రూపంలో కూడా దీనిని పరిచయం చేసింది. అయినప్పటికీ ఈ స్మాల్ హ్యాచ్‌హబ్యాక్ కనీసం ఫలితాలకు దూరం అయిపోయింది.

అయితే తాజా సంఘటనలను పరిశీలిస్తే రిట్జ్ ను మార్కెట్ నుండి తొలగించి దీని స్థానంలో ఇగ్నిస్ కాంపాక్ట్ క్రాసోవర్‌ను అందించనుంది అని తెలిసింది.

ప్రస్తుతం డీలర్ల వద్ద కొన్ని ఉత్పత్తులు స్టాక్ రూపంలో ఉన్నాయి మరియు నిర్మాణ దశలో కొన్ని యూనిట్లు ప్లాంటులో ఉన్నాయి. వీటి మొత్తం స్టాకు పూర్తి చేయనుంది మారుతి సుజుకి.

ప్రస్తుతం మారుతి రిట్జ్ ఉత్పత్తిని నిలిపివేసినప్పటికీ స్టాక్ ఉన్నంత వరకు అమ్మకాల్లో ఉంటుంది.

మారుతి సుజుకి ఈ రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌ను వ్యాగన్ఆర్‌కు ఎగువన మరియు స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌కు దిగువన దీనిని విడుదల చేసింది.

డిజైన్ పరంగా రిట్జ్ పెద్దగా ఆకర్షణీయంగా ఉండదు. అయితే డ్రైవర్‌కు సులభమైన డ్రైవింగ్ అనుభూతిని కలిగిస్తుంది. మరియు కొత్త డ్రైవింగ్ నేర్చుకుని కారును కొనుగోలు చేసే వారు ఎక్కువగా దీనిని ఎంచుకుంటున్నారు.

మారుతి సుజుకి రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌లో పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లను అందించింది.

రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌లోని 1.2-లీటర్ నాలుగు లీటర్ల పెట్రోల్ ఇంజన్ సుమారుగా 86బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఇక ఇందులోని 1.3-లీటర్ డిడిఐఎస్ డీజల్ ఇంజన్ సుమారుగా 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

మారుతి సుజుకి రిట్జ్ లోని పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్‌లకు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేసింది.

- మాల్యా పాపాలకు పరిహారం ...!!
- భారత్‌కు పొంచి ఉన్న ముప్పు....!!
- టార్క్ ఎలక్ట్రిక్ బైక్ మ్యాజిక్: విడుదలైన 24 గంటల్లో 1000కి పైగా బుకింగ్స్


Click it and Unblock the Notifications








