రిట్జ్‌ ప్రొడక్షన్ నిలిపేసిన మారుతి... త్వరలో దీని స్థానాన్ని భర్తీ చేయనున్న కొత్త కారు

మారుతి సుజుకి కు చెందిన రిట్జ్ గత నెల అమ్మకాలు కేవలం 5 యూనిట్లు మాత్రమే. అయితే దీని ప్రొడక్షన్‌ను పూర్తిగా నిలిపేయాలనే ఆలోచనలో మారుతి ఉంది.

By Anil

మారుతి తమ రిట్జ్ హ్యాచ్‌బ్యాక్ ప్రొడక్షన్‌కు ముగింపు పలకనుంది. ఇండియన్ మార్కెట్లోకి విడుదలైనపుడు అత్యంత ఆదరణ పొందిన ఉత్పత్తి ఇది. అయితే ఈ హ్యాచ్‌బ్యాక్‌కు అప్‌డేట్స్ చేయకపోవడం ద్వారా రానురాను అమ్మకాలు తగ్గిపోయాయి. ఈ కారణం చేత రిట్జ్ ప్రొడక్షన్ పూర్తి స్థాయిలో నిలిపివేయడానికి మారుతి సిద్దమైంది.

రిట్జ్ ఉత్పత్తిని ఆపేసిన మారుతి

గడిచిన అక్టోబర్ 2016 లో దేశవ్యాప్తంగా ఉన్న మారుతి సుజుకి డీలర్లు కేవలం 5 యూనిట్ల రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌లను మాత్రమే విక్రయించగలిగాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తిని ఆపేస్తోంది. దీని కోసం వెచ్చించే ధనం మరియు సమయాన్ని నూతన ఉత్పత్తుల విడుదల మీదకు మారుతి మళ్లిస్తోంది.

రిట్జ్ ఉత్పత్తిని ఆపేసిన మారుతి

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో క్రాసోవర్ మరియు మిని ఎస్‌యువిలకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించిన ఇగ్నిస్ మోడల్‌కు సందర్శకుల తాకిడి భారీ ఉండింది. దానిని దృష్టిలో ఉంచుకుని మిని ఎస్‌యువి వైపు మారుతి చూస్తోంది.

రిట్జ్ ఉత్పత్తిని ఆపేసిన మారుతి

ఇగ్నిస్ మిని ఎస్‌యువి పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంధన వేరియంట్లలో లభిస్తుంది. అచ్చం ఇప్పుడున్న రిట్జ్ తరహాలో.

రిట్జ్ ఉత్పత్తిని ఆపేసిన మారుతి

రిట్జ్ ధర ప్రస్తుతం 4.31 లక్షల నుండి 6.58 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ ఢి(ల్లీ)గా ఉంది. మారుతి తమ ఇగ్నిస్ మిని ఎస్‌యువిని కూడా ఇదే ధరల మధ్యన విడుదలయ్యే అవకాశం ఉంది.

రిట్జ్ ఉత్పత్తిని ఆపేసిన మారుతి

ప్రస్తుతం మారుతి సుజుకి తమ ఉత్పత్తులను నెక్సా షోరూమ్ ద్వారా అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే ఎస్-క్రాస్ మరియు బాలెనొ కార్లను నెక్సా నుండి అందిస్తోంది. వీటి సరసన ఇగ్నిస్‌ను కూడా చేర్చనుంది.

రిట్జ్ ఉత్పత్తిని ఆపేసిన మారుతి

రిట్జ్ ఉత్పత్తిని నిలిపివేసి ఇగ్నిస్ మిని ఎస్‌యువిని అందుబాటులోకి తీసుకువస్తే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మహీంద్రా కెయువి100 మరియు త్వరలో విడుదల కానున్న షెవర్లే బీట్ ఆక్టివ్ కు గట్టి పోటీనివ్వనుంది.

రిట్జ్ ఉత్పత్తిని ఆపేసిన మారుతి

  • ఆగలేకపోతున్న చైనా...!!
  • నిజమే..!! ఇప్పటికీ 75 శాతం దేశీయ డైవర్లకు జిపిఎస్ ఎలా ఉపయోగించాలో తెలియదు
  • హ్యుందాయ్ విడుదల చేయనున్న మూడు అప్‌డేటెడ్ కార్లు

Most Read Articles

English summary
Maruti Suzuki Ignis Mini-SUV To Replace Ritz Hatchback In The Indian Market
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X