సరికొత్త సుజుకి వ్యాగన్ ఆర్ స్టింగ్‌రే - ఇండియా విడుదల కోసమా...?

సుజుకి తమ వ్యాగన్ ఆర్ స్టింగ్‌రే ని సరికొత్త డిజైన్‌ భాషలో ఇంటర్నెట్‌కు పరిచయం చేసింది. క్యాడిల్లాక్ ఎస్‌యువి తరహాలో ఉన్న ఈ సరికొత్త స్టింగ్‌రే తెగ చక్కర్లుకొడుతోంది.

By Anil

సుజుకి నెక్ట్స్ జనరేషన్ వ్యాగన్ ఆర్ కు చెందిన హ్యాచ్‌బ్యాక్ ఫోటోలను జపనీస్ మార్కెట్లోకి లీకయ్యాయి. ఇది చూడటానికి క్యాడిల్లాక్ ఎస్‌యువి రూపంలో ఉంది. ఇండియన్ మార్కెట్లోకి పరిచమయ్యే ఆస్కారం ఉన్న ఇందులోని కొన్ని అంశాలు ఇది దేశీయ విడుదలకు నోచుకోనుందని చెప్పకనే చెబుతున్నాయి.

వ్యాగన్ ఆర్ స్టింగ్‌రే

ఎంత నూతనత్వాన్ని సంతరించుకున్నప్పటికీ అదే టాల్ బాయ్ బాడీ డిజైన్‌ను మాత్రం విడువలేకపోతోంది. అయితే చాలా వరకు అడ్వాన్స్‌ డిజైన్ లక్షణాలతో ముందు వైపు అగ్రెసివ్‌గా, కండలు తిరిగిన శరీర భాగాలతో విభిన్న డిజైన్ లక్షణాలతో పరిచయమయ్యింది.

వ్యాగన్ ఆర్ స్టింగ్‌రే

నూతన వ్యాగన్ ఆర్ (మొదటి చిత్రం ప్రకారం)ముందు వైపు నిలువుటాకారంలో ఉన్న హెడ్ లైట్లతో పెద్దగా చతురస్రాకారంలో ఉన్న ఫ్రంట్ గ్రిల్‌తో, దానికి మధ్యలో రెండు క్రోమ్ పట్టీలతో, వాటి మధ్యలో సుజుకి లోగో తో అత్యంత ఆకర్షణీయంగా ఉంది.

వ్యాగన్ ఆర్ స్టింగ్‌రే

పెద్దగా ఉన్న పెద్ద గ్రిల్‌కు ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ బంపర్ యొక్క పరిమాణాన్ని చాలా వరకు తగ్గించి చిన్న సైజులో ఉన్న ఎయిర్ డ్యామ్ డిజైన్‌కు కారణమయ్యింది.

వ్యాగన్ ఆర్ స్టింగ్‌రే

ప్రక్క వైపున మరింత ఆకర్షణీయమైన డిజైన్‌కు గురయ్యింది. తక్కువ ఎత్తున్న విండో అద్దాలు, బాడీ మెటల్ క్లాడింగ్ మరియు బాడీ అంచు నుండి చాలా ఎత్తులో విండో అద్దాల అమరిక, ప్రక్క వైపు డిజైన్‌ను బలపరిచే వీల్ ఆర్చెస్ మరింత బాగున్నాయి.

వ్యాగన్ ఆర్ స్టింగ్‌రే

సుజుకి ప్యాసింజర్ కార్ల సంస్థకు జపాన్ మార్కెట్లో అత్యంత ముఖ్యమైన ఉత్పత్తి. కాబట్టి మునుపటి నుండి కొనసాగుతూ వచ్చిన అదే 658సీసీ సామర్థ్యం గల మూడు సిలిండర్ల ఇంజన్‌ను ఈ సరికొత్త వ్యాగన్ ఆర్ స్టింగ్‌రే లో కొనసాగించే అవకాశం ఉంది.

వ్యాగన్ ఆర్ స్టింగ్‌రే

సుజుకి ప్యాసింజర్ కార్ల సంస్థకు జపాన్ మార్కెట్లో అత్యంత ముఖ్యమైన ఉత్పత్తి. కాబట్టి మునుపటి నుండి కొనసాగుతూ వచ్చిన అదే 658సీసీ సామర్థ్యం గల మూడు సిలిండర్ల ఇంజన్‌ను ఈ సరికొత్త వ్యాగన్ ఆర్ స్టింగ్‌రే లో కొనసాగించే అవకాశం ఉంది.

వ్యాగన్ ఆర్ స్టింగ్‌రే

సరికొత్త వ్యాగన్ ఆర్ స్టింగ్‌రే ఇండియన్ మార్కెట్లోకి 2018 నాటికి పరిచయం అయ్యే అవకాశం ఉంది. వ్యాగన్ ఆర్ చివరి సారిగా 2013 లో మార్పులు చేర్పులకు గురయ్యింది.

వ్యాగన్ ఆర్ స్టింగ్‌రే

  • సుజుకి: హెచ్.డి.ఎఫ్.సి మరియు పేటిఎమ్ అకౌంట్లు ఉన్నాయా...?
  • 2017 మారుతి స్విఫ్ట్ స్పోర్ట్ కు సగర్వ స్వాగతం

Most Read Articles

English summary
New Suzuki Wagon R StingRay Leaked - India Bound?
Story first published: Friday, November 25, 2016, 17:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X