సుజుకి స్విఫ్ట్‌ను భారీ ట్రక్కు ఢీకొన్నా ఏమీ కాలేదు
రైలులో సగం భాగం ఉండే పెద్ద ట్రక్కు మారుతి సుజుకి స్విప్ట్ కారును ప్రక్క వైపు నుండి వేగంగా ఢీకొట్టింది. అయితే ఊహించన విధంగా కారు దాదాపు సేఫ్‌గా ఉంది.
రైలులో సగం భాగం ఉంటుంది ఆ ట్రక్కు పొడవు, దాని ముందు స్విప్ట్ హ్యాచ్‌బ్యాక్ బొమ్మ కారులా ఉంటుంది. ఇంత చిన్న కారును ఆ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. కారు మొత్తం నుజ్జునుజ్జు అయిపోవాల్సింది. అయితే ఊహించిన విధంగా పాక్షికంగా డ్యామేజ్‌కు గురైంది.

ఆస్ట్రేలియాలో చోటు చేసుకున్న ఈ ప్రమాదం స్విఫ్ట్ కారు యొక్క ధృడత్వాన్ని తెలిపేలా ఉంది. భారీ పరిమాణంలో ఉన్న రోడ్ ట్రైన్ అని పిలువబడే పెద్ద ట్రక్కు వేగంతో వెళుతోంది. అయితే అదే రహదారిలో ట్రక్కు కు అడ్డంగా స్విఫ్ట్ వచ్చింది.

స్విఫ్ట్ కారును నడిపిన వ్యక్తి ఏ ఆలోచనలో ఉన్నాడో ఏమో... కారు ట్రక్కు ముందుకు వచ్చి ఆగిపోయింది. అంతే ఓ మోస్తారు వేగంతో లారీ కారును ఢీకొనడం వెనువెంటనే గాయపడిన స్విఫ్ట్ డ్రైవర్‌ను హాస్పిటల్‌కు తరలించడం జరిగిపోయాయి.

పెద్ద పరిమాణంలో అన్ని వేళలా స్పష్టంగా చూడగలిగే పసుపు రంగులో ఉన్న ట్రక్కును గమనిస్తూనే కారును ముందుకు నడపడాన్ని అక్కడే లారీ పై భాగంలో ఉన్న సీసీ కెమెరా స్పష్టంగా బంధించింది.

లారీ డ్రైవర్ మరియు ఇతరులో కారులో ఉన్న 76 ఏళ్ల వయస్సున్న మహిళా డ్రైవర్‌ను హాస్పిటల్‌ను తరలించారు. ఆ సమయంలో కారును నడిపింది ఆవిడే అని నిర్ధారణకు వచ్చారు.

కారుకు కుడివైపున లారీ బలంగా తాకడం చేత అదే భాగంలో మొత్తం స్వల్పంగా లోపలికి చొచ్చుకుపోయింది. ప్రమాదానికి గురైన మహిళ ఇప్పుడు కోలుకుంటోంది.

అందరనీ విస్మయానికి గురిచేసిన విషయం ఏమిటింటే అంతటి భారీ లారీ ఈ చిన్న కారును ఢీ కొంటే తక్కువ ప్రమాద నష్టంతో బయటపడటం. స్విఫ్ట్ ఎంత ధృడంగా ఉందో ఈ ప్రమాదం స్పష్టంగా తెబుతోంది.
లారీ కారును ఢీకొన్నపుడు రికార్డయిన వీడియో ఫుటేజ్....

అతి చిన్న కారును విడుదల చేయనున్న మారుతి సుజుకి:
మారుతి సుజుకి ఈ మధ్య కాలంలో పెద్ద మోడళ్లయిన వితారా బ్రిజా, సియాజ్ మరియు బాలెనో లతో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు చిన్న కార్ల అభివృద్ది మరియు తయారీ మీద మారుతి దృష్టిసారిస్తోంది.


Click it and Unblock the Notifications








