మారుతి లోని అన్ని మోడళ్ల మీద పెరిగిన ధరలు

Written By:

భారత దేశపు దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంచిన తమ అన్ని మోడళ్ల మీద ధరలను పెంచినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పెంపు గరిష్టంగా రూ. 8,014 ల వరకు ఉంది. నూతన ధరలు వెంటనే అమల్లోకి వచ్చినట్లు కూడా మారుతి స్పష్టం చేసింది.

మారుతి సుజుకి ఉన్నట్లుండి సడెన్‌గా తీసుకున్న ధరల పెంపు నిర్ణయం మేరకు, దేశవ్యాప్తంగా అమ్మకాల్లో ఉన్న మొత్తం 18 మారుతి సుజుకి కార్ల మీద రూ. 1,500 నుండి రూ. 8,014 ల వరకు ధరలు పెరిగాయి.

మారుతి లైనప్‌లో ఎంట్రీలెవల్ కారు ఆల్టో 800 నుండి టాప్ ఎండ్ కారు ఎస్-క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యువి వరకు ఉన్నాయి. మారుతి కార్ల ధరలు రూ. 2.45 లక్షల నుండి 12.03 లక్షలు రేంజ్ మధ్యన ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

అకస్మాత్తుగా ధరల పెంపు నిర్ణయానికి సంభందించి ప్రెస్ నోట్ ను విడుదల చేసింది, ఇందులోని వివరాల మేరకు తయారీ, రవాణా వంటి అంశాల పరంగా పెట్టుబడి పెరిగిన నేపథ్యంలో ధరల పెంపును చేపట్టినట్లు ప్రకటించింది.

డిచిన ఆరు నెలల కాలంలో మారుతి సుజుకి రెండవ సారి ధరలను పెంచింది. గత ఆగష్టులో కొన్ని ప్రత్యేక మోడళ్ల మీద మాత్రమే పెంపును చేపట్టింది. అప్పట్లో వితారా బ్రిజా మీద రూ. 20,000 లు, బాలెనో మీద రూ. 10,0000 లతో పాటు ఇతర మోడళ్ల మీద రూ. 1,500 నుండి 5,000 ల వరకు ధరలు పెరిగాయి.

మారుతి తెలిపిన కారణం ఆధారంగానే మహీంద్రా, హ్యుందాయ్ మోటార్స్, టాటా మోటార్స్ మరియు మెర్సిడెస్ బెంజ్ సంస్థలు కూడా దేశీయంగా గత నెలలో తమ ఉత్పత్తుల మీద ధరలను పెంచాయి.

మారుతి సుజుకి 2017 లో మూడవ తరానికి చెందిన స్విప్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయనుంది. ఈ ఏడాది స్విఫ్ట్ కొంటున్నట్లయితే 2017 స్విఫ్ట్ కోసం వేచి ఉండండి... ఇది ఎలా ఉంటుందో గమనించాలంటే క్రింద ఉన్న గ్యాలరీ మీద క్లిక్ చేయాల్సిందే.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Maruti Hikes Prices Of Entire Car Range With Immediate Effect
Please Wait while comments are loading...

Latest Photos