ఆరు రోజుల పాటు, 2,000 కిమీల మేర సాగే మారుతి డెసర్ట్ స్టార్మ్ ర్యాలీ ప్రారంభం

Written By:

మారుతి సుజుకి 15 వ ఎడిషన్ డెసర్ట్ స్మార్ట్ ర్యాలీని ఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించింది. ఈ లేటెస్ట్ ఎడిషన్ ర్యాలీ జనవరి 29, 2017 - ఫిబ్రవరి 4, 2017 మధ్యన ఢిల్లీలో ప్రారంభమై రాజస్థాన్ లోని జోధ్‌పూర్‌లో ముగియనుంది. అడ్వెంచర్ ప్రియుల కోసం మారుతి డెసర్ట్ స్మార్ట్ ర్యాలీ గురించి పూర్తి అప్‌డేట్స్ అందివ్వనున్న డ్రైవ్‌స్పార్క్ తెలుగు...

15 వ ఎడిషన్ డెసర్ట్ స్టార్మ్ ర్యాలీ ఆరు రోజుల పాటు కొనసాగనుంది. ఈ ర్యాలీలో పాల్గొనే వారు మొత్తం ఆరు రోజుల్లో 2,000 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.

ఇందులో పొల్గొనే ఔత్సాహికులకు ఛాలెంజింగ్‌తో కూడుకున్న భూబాగాలైన హనుమాన్ ఘర్, బికనీర్ మరియు జైసల్మీర్ మీదుగా జోధ్ పూర్ చేరుకునేందుకు ప్రయాణ మార్గసూచికలతో కూడిన రాజస్థాన్ చిత్రపటాలను అందివ్వనున్నారు.

ఫిబ్రవరి నాలుగవ తేదీన ఈ ర్యాలీలో విజేతలను ప్రకటించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గెలుపొందిన వారికి నగదు బహుకరణ వంటివి కూడా ఉన్నట్లు మారుతి ప్రకటించింది.

మారుతి సుజుకి 15 వ ఎడిషన్ 2017 డెసర్ట్ స్టార్మ్ ర్యాలీని నాలుగు కెటగిరీలుగా విభిజించి నిర్వహిస్తున్నారు. అవి, ఎక్ట్స్రీమ్ (Xtreme), ఎండ్యూర్(NDure), ఎక్స్‌ప్లోర్ (Xplore) మరియు మోటో(Moto). డకార్ ర్యాలీలో పాల్గొన్న సిఎస్ సంతోష్ మోటో బృందంలో ఉన్నారు.

ఈ ర్యాలీలో పది మంది మహిళా రైడర్లు కూడా ఉన్నారు, అందులో బని యాదవ్ మరియు సరా కశ్యప్. వీరు గతంలో మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ ఎడిషన్లయిన దక్షిణ్ డేర్ మరియు రైడ్ ది హిమాలయా అనే అడ్వెంచర్ రైడింగ్‌లలో పాల్గొన్నారు.

మిని డకార్ ర్యాలీగా చెప్పుకునే, మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2017 లోని మొదటి స్టేజ్ 207 కిలోమీటర్లుగా ఉంది. మొదటి స్టేజ్‌లో అత్యంత దూరం గల అడ్వెంచర్ రైడ్ కూడా ఇదే కావడం గమనార్హం. స్టేజ్ వన్ ర్యాలీ ప్రారంభమయ్యే ఒక రోజు ముందుగానే ర్యాలీలో పాల్గొనే వారు తమ వాహనాలకు పూర్తిగా పరీక్షించుకుని ర్యాలీకి సిద్దమవ్వాల్సి ఉంటుంది.

మారుతి సుజుకి మార్కెటింగ్ మరియు సేల్స్ ఎక్జ్సిక్యూటివ్ డైరెక్టర్ మాట్లాడుతూ, మారుతి ఈ డెసర్ట్ స్టార్మ్ ర్యాలీని 2003 లో ప్రారంభించిందని మరియు భారత దేశం యొక్క పశ్చిమ రీజియన్‌లో ఆఫ్ రోడింగ్ ర్యాలీలో అనేక విజయాలను సాధించిందని తెలిపాడు.

కల్సి గారు మాట్లాడుతూ, ప్రతి ఏడాది కూడా మారుతి నిర్వహించే ర్యాలీలో పాల్గొనే ఔత్సాహికుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోందిని మరియు ర్యాలీ కోసం పోటీదార్లకు అత్యుత్తమ శిక్షణ మరియు ఉత్తమ పనితీరు కనబరిచే వాహనాలను కూడా అందిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. తద్వారా సురక్షితమైన మోటాస్పోర్ట్స్ నిర్వహణలో మారుతి విజయం సాధించిందని తెలిపాడు.

గత 15 ఏళ్ల నుండి మారుతి సుజుకి సురక్షితమైన మోటార్‌స్పోర్ట్స్ నిర్వహిస్తోంది. పాపులర్ స్పోర్ట్స్ కోసం ఈ క్యాలెండర్ ఇయర్‌లో కొన్ని డేట్లను ఇప్పటే ఖరారు చేసకుంది.

మారుతి సుజుకి 2017 డెసర్ట్ స్టార్మ్ ర్యాలీలో లుబ్రికేషన్ పార్ట్‌నర్‌గా ఎక్జాన్ మొబైల్ లుబ్రికేంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను చేర్చుకుంది. వరుసగా నాలుగో ఏడాది మారుతి సుజుకి తన భాగస్వామిగా ExxonMobil Lubricants Pvt Ltd సంస్థను చేర్చుకోవడం విశేషం. డెసర్ట్ స్మార్ట్ 2017 ర్యాలీ గురించి మరితం సమాచారం కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Maruti Suzuki Desert Storm 15th Edition: Rally To Commence From Delhi
Please Wait while comments are loading...

Latest Photos