సియాజ్ సెడాన్ లో ఆర్ఎస్ వేరియంట్‌ను తొలగించిన మారుతి

మారుతి సుజుకి తమ బెస్ట్ సెల్లింగ్ సెడాన్ సియాజ్ లోని టాప్ ఎండ్ వేరియంట్ ఆర్ఎస్ ను తమ లైనప్ నుండి తొలగించింది.

By Anil

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మారుతి సుజుకి తమ బెస్ట్ సెల్లింగ్ సెడాన్ సియాజ్ లోని టాప్ ఎండ్ వేరియంట్ ఆర్ఎస్ వేరియంట్ ను లైనప్‌ నుండి తొలగించినట్లు సమాచారం. సియాజ్ శ్రేణిలోని ఆర్ఎస్ మోడల్ మిగతా వాటితో పోల్చుకుంటే ఇంటీరియర్ మరియు క్ట్సీరియర్ పరంగా స్పోర్టివ్ రూపాన్ని కలిగి ఉంది.

మారుతి సుజుకి సియాజ్ ఆర్ఎస్ సెడాన్

మారుతి సుజుకి తమ వెబ్‌సైట్లో సియాజ్ వేరియంట్ల ధరలను సవరించింది. ఈ జాబితాలో సియాజ్ టాప్ ఎండ్ వేరియంట్ లేకపోవడం గుర్తించడం జరిగింది. మరియు మారుతి తమ బ్రౌచర్లో కూడా సియాజ్ ఆర్ఎస్ ను తొలగిచింది. దీని ద్వారా సియాజ్ ఆర్ఎస్ ను పూర్తి తొలగించినట్లు స్పష్టమవుతోంది.

మారుతి సుజుకి సియాజ్ ఆర్ఎస్ సెడాన్

మారుతి సుజుకి ఈ సియాజ్ ఆర్ఎస్ వెర్షన్ ను 2015 లో మార్కెట్లోకి విడుదల చేసింది. సాధారణ సియాజ్ తో పోల్చుకుంటే ఇది స్పోర్టివ్ శైలిలో ఉంటుంది. ఇందులో ముందు మరియు వెనుక వైపున రీ డిజైన్ చేయబడిన బంపర్లు అదే విధంగా కండలు తిరిగిన ఎక్ట్సీరియర్ డీకాల్స్ ఉన్నాయి.

మారుతి సుజుకి సియాజ్ ఆర్ఎస్ సెడాన్

సియాజ్ ఆర్ఎస్ వేరియంట్లో డిక్కీ మీద స్పాయిలర్, ఫ్రంట్ అండర్ స్పాయిలర్, సైడ్ అండర్ స్పాయిలర్ మరియు రియర్ బాడీ అండర్ స్పాయిలర్లను అందించింది. అల్లాయ్ వీల్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మరియు అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ మీద టర్న్ ఇండికేటర్స్ కలవు.

మారుతి సుజుకి సియాజ్ ఆర్ఎస్ సెడాన్

సియాజ్ ఆర్ఎస్ సెడాన్ లో సాంకేతికంగా 1.4-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 91బిహెచ్‌పి పవర్ మరియు 130ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

మారుతి సుజుకి సియాజ్ ఆర్ఎస్ సెడాన్

సియాజ్ ఆర్ఎస్ లోని మరో ఇంజన్ ఆప్షన్ 1.3-లీటర్ సామర్థ్యం గల మిల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ పరిజ్ఞాన అనుసంధానం ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ డీజల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 88.5బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

మారుతి సుజుకి సియాజ్ ఆర్ఎస్ సెడాన్

ట్రాన్స్‌మిషన్ పరంగా పెట్రోల్ మరియు డీజల్-హైబ్రిడ్ పరిజ్ఞానం ఉన్న రెండు వేరియంట్లలో కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

మారుతి సుజుకి సియాజ్ ఆర్ఎస్ సెడాన్

మారుతి సుజుకి సియాజ్ సెడాన్ లోని ఆర్ఎస్ వెర్షన్ యొక్క పెట్రోల్ వేరియంట్ ధర రూ. 9.20 లక్షలు మరియు డీజల్ వేరియంట్ ధర రూ. 10.28 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

మారుతి సుజుకి సియాజ్ ఆర్ఎస్ సెడాన్

మారుతి సుజుకి సియాజ్ సెడాన్ మొత్తం ఏడు విభిన్న రంగుల్లో లభించును. అవి,

పర్ల్ స్నో వైట్,

పర్ల్ మెటాలిక్ డిగ్నిటి బ్రౌన్,

పర్ల్ సాంగ్రియా రెడ్,

పర్ల్ మిడ్ నైట్ బ్లాక్,

మెటాలిక్ సిల్కీ సిల్వర్,

మెటాలిక్ గ్లిస్టెనింగ్ గ్రే మరియు

మెటాలిక్ క్లియర్ బీజి.

Most Read Articles

English summary
Maruti Suzuki Discontinues Ciaz RS In India
Story first published: Saturday, February 11, 2017, 16:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X