మారుతి సుజుకి ఇగ్నిస్ ఆటోమేటిక్ వేరియంట్ గురించి సవివరంగా

మారుతి సుజుకి ఇగ్నిస్ వేరియంట్‌‌ను పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో విడుదల చేస్తోంది. అయితే ఇగ్నిస్‌లోని టాప్ ఎండ్ వేరియంట్ ఆల్ఫాలో మాత్రమం ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందివ్వడం లేదు.

By Anil

ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లోని డీజల్ కార్లలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అందిస్తున్న ఏకైక సంస్థ మారుతి సుజుకి, తమ అప్ కమింగ్ ఇగ్నిస్ కారులోని పెట్రోల్‌తో పాటు డీజల్ వేరియంట్లో కూడా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందిస్తోంది. గతంలో కూడా మారుతినే మొదటి సారిగా పెట్రోల్ వేరియంట్ లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పరిచయం చేసింది. ఇప్పుడు ఇగ్నిస్ ద్వారా డీజల్ వేరియంట్లో మారుతినే మొదటి సారిగా ఈ ఆప్షన్ పరిచయం చేస్తోంది.

మారుతి సుజుకి ఇగ్నిస్ ఆటోమేటిక్ వేరియంట్

మారుతి సుజుకి తమ డీజల్ ఇగ్నిస్ లోని మధ్య వేరియంట్లయిన డెల్టా మరియు జెటా లలో మాత్రమే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పరిచయం చేస్తోంది. అయితే ఇందులోని టాప్ ఎండ్ వేరియంట్ అయిన ఆల్ఫాలో అందివ్వడం లేదు.

గేర్ బాక్స్ మరియు వేరియంట్లు

గేర్ బాక్స్ మరియు వేరియంట్లు

ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ను మారుతి ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ (AGS) అని సంభోదిస్తుంది. ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ డీజల్ ఏఎమ్‌టి మరియు సెలెరియో ఏఎమ్‌టి మోడళ్లలో అందించింది. ఈ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ను మ్యాగ్నెట్టి మారెల్లీ నుండి సేకరిస్తోంది.

మారుతి సుజుకి ఇగ్నిస్ ఆటోమేటిక్ వేరియంట్

ఆటో గేర్ షిప్ట్ అదే మనం షార్ట్ కట్‌లో పిలిచే ఏఎమ్‌టి గేర్‌బాక్స్ ఉండటం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటంటే... తక్కువ ధరతో ఎక్కువ మైలేజ్ పొందడం. అందుకే కాబోలు మారుతి తమ డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌లో ఏఎమ్‌టి గేర్‌బాక్స్ అందించింది.

మారుతి సుజుకి ఇగ్నిస్ ఆటోమేటిక్ వేరియంట్

మారుతి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందివాలనుకున్న రెండు వేరియంట్లు డెల్టా మరియు జెటా లలో జెటా టాప్ ఎండ్ మోడల్. ఈ రెండింటికి పై స్థానంలో ఆల్ఫా మోడల్ ఉంది. అయితే ఇందులో ఏఎమ్‌టి రావడం లేదు.

మారుతి సుజుకి ఇగ్నిస్ ఆటోమేటిక్ వేరియంట్

ఇగ్నిస్ ఆటోమేటిక్ డెల్టా మరియు జెటా వేరియంట్లలోని ఫీచర్లు

  • ఫ్రంట్ గ్రిల్ మీద క్రోమ్ ఉపకరణాలు,
  • గ్రోమ్ పట్టీలతో ఉన్న పాగ్ లైట్లు,
  • అల్లాయ్ వీల్స్,
  • బాడీ అంచులకు చివర్లో ధృడమైన ప్లాస్టిక్ క్లాడింగ్ కలదు.
  • మారుతి సుజుకి ఇగ్నిస్ ఆటోమేటిక్ వేరియంట్

    మారుతి సుజుకి ఇగ్నిస్ ఆటోమేటిక్ డెల్టా వేరియంట్లో అల్లాయ్ వీల్స్ స్థానంలో వీల్ కవర్స్, బాడీ కలర్‌లో ఉన్న డోర్ హ్యాండిల్స్, అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్,ఓఆర్‌విఎమ్స్ మీద టర్న్ సిగ్నల్స్, మరియు బ్లాక్ రంగులో ఉన్న డోర్ వ్యానల్స్ కలవు.

    మారుతి సుజుకి ఇగ్నిస్ ఆటోమేటిక్ వేరియంట్

    ఇగ్నిస్ ఆటోమేటిక్ డెల్టా మరియు జెటా వేరియంట్లలోని ఇంటీరియర్ లో చాలా వరకు ఫీచర్లున్నాయి,

    • డ్యూయల్ టోన్ డ్యాష్ బోర్డ్
    • హెడ్ ల్యాంప్ లెవ్లర్
    • డ్రైవర్ మరియు డ్రైవర్ సైడ్ ప్యాసింజర్ కు సన్ విసర్
    • కో డ్రైవర్ వ్యానిటి మిర్రర్
    • టాకో మీటర్
    • ఎసి వెంట్‌ల మీద క్రోమ్ సొబగులున్నాయి.
    • మారుతి సుజుకి ఇగ్నిస్ ఆటోమేటిక్ వేరియంట్

      ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా జెట్ మరియు డెల్టా వేరియంట్లలో దాదాపుగా ఒకే విధమైన ఫీచర్లున్నాయి, అయితే డెల్టా వేరియంట్లో నాలుగు స్పీకర్లు మరియు రెండు ట్వీటర్లు లేవు.

      జెటాలోని ఫీచర్లు

      • సిడి మరియు ఎఫ్ఎమ్ గల ఆడియో
      • బ్లూటూత్ మరియు యుఎస్‌బి కనెక్టివిటి
      • నాలుగు స్పీకర్లు మరియు రెండు ట్వీటర్లు
      • స్టీరింగ్ మీద నిర్మించిన ఆడియో కంట్రోల్స్
      • రిమోట్ కంట్రోల్ ఆడియో
      • మారుతి సుజుకి ఇగ్నిస్ ఆటోమేటిక్ వేరియంట్

        సౌకర్యం మరియు సౌలభ్యపరమైన ఫీచర్లకు ఇగ్నిస్ లో మారుతి పెద్ద పీట వేసింది. ఈ అంశం పరంగా డెల్టా మరియు జెటా లలో దాదాపు సమానమైన ఫీచర్లున్నాయి. అయితే డెల్టా ఇగ్నిస్‌లో పుష్ స్టార్ట్ బటన్ మరియు ఎలక్ట్రానిక్ ఫోల్డింగ్ ఓఆర్‌విఎమ్స్ లేవు. ఈ రెండింటిని మినహాయిస్తే జెటాలోని అన్ని ఫీచర్లు డెల్టా ఉన్నాయి.

        మారుతి సుజుకి ఇగ్నిస్ ఆటోమేటిక్ వేరియంట్

        • పుష్ బటన్ స్టార్ట్
        • రిమోట్ కీలెస్ ఎంట్రీ
        • ఏసి మరియు హీటర్
        • ఎలక్ట్రానిక్ పోల్డింగ్ మరియు అడ్జెస్టబుల్ ఓఆర్‌విఎమ్స్
        • పగలు మరియు రాత్రి వేళ గమనించే ఇన్నర్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్
        • వెనుక సీటు కోసం అడ్జెస్టబుల్ హెడ్ రీస్ట్రెయిన్స్
        • మారుతి సుజుకి ఇగ్నిస్ ఆటోమేటిక్ వేరియంట్

          • వెనుక సీటును 60:40 నిష్పత్తిలో మలుపుకునే సౌకర్యం
          • 12 వోల్డ్ సాకెట్
          • టిల్ట్ స్టీరింగ్
          • ఫ్రంట్ మరియు రియర్ పవర్ విండోలు
          • లగేజ్ ల్యాంప్
          • పార్సిల్ ట్రే
          • మరియు డెడ్ పెడల్ వంటి అనేక అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
          • భద్రత ఫీచర్లు

            భద్రత ఫీచర్లు

            మారుతి సుజుకి పెట్రోల్ మరియు డీజల్ ఇంధన వేరియంట్లతో పాటు అన్ని వేరియంట్లలో కూడా భద్రత కోసం స్టాండర్డ్‌గా ఫీచర్లను అందించింది. అందులో, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్, ఫోర్స్ లిమిటర్లు గల సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్లు, పెడస్ట్రైన్ భద్రతో పాటు ముందు మరియు ప్రక్కవైపున యాక్సిడెంట్ భారి నుండి పెద్ద ప్రమాధానికి గురికాకుండా ధృడమైన శరీరంతో నిర్మించారు.

            మారుతి సుజుకి ఇగ్నిస్ ఆటోమేటిక్ వేరియంట్

            గతంలో మారుతి సుజుకి తమ ఇగ్నిస్‌కు ఎలాంటి భద్రత ఫీచర్లు లేకుండా ఎన్‌సిఎపి వారిచే క్రాష్ పరీక్షలు నిర్వహించింది. అప్పట్లోనే ఐదుకు గాను మూడు స్టార్ల రేటింగ్ పొందింది. అయితే ఇప్పుడు పూర్తి స్థాయి భద్రత ఫీచర్లతో నిండి ఉంది. కాబట్టి ఐదు కు ఐదు స్టార్ల భద్రత రేటింగ్ పొందం ఖాయం.

            మారుతి సుజుకి ఇగ్నిస్ ఆటోమేటిక్ వేరియంట్

            ఇగ్నిస్ లోని డెల్టా మరియు జెటా వేరియంట్లలో రియర్ పార్కింగ్ కెమెరా రాలేదు, అయితే జెటా ఆటోమేటిక్ వేరియంట్లో రియర్ పార్కింగ్ సెన్సార్లతో పాటు, రియర్ ఢీఫాగర్ మరియు వైపర్ కలదు. వీటిని మినహాయిస్తే ఇగ్నిస్ లోని టాప్ ఎండ్ వేరియంట్ ఆల్ఫా లోని ఫీచర్లను దాదాపుగా కలిగి ఉంది ఈ జెటా వేరియంట్.

            ఇగ్నిస్ జెటా ఆటోమేటిక్ వేరియంట్ లోని మరిన్ని భద్రత ఫీచర్లు

            ఇగ్నిస్ జెటా ఆటోమేటిక్ వేరియంట్ లోని మరిన్ని భద్రత ఫీచర్లు

            • సెక్యురిటీ అలారమ్ సిస్టమ్
            • రియర్ పార్కింగ్ సెన్సార్లు
            • రియర్ డీఫాగర్ మరియు వైపర్
            • వెనుక డోర్ల మీద చైల్డ్ లాక్
            • హై మౌంటెడ్ ఎల్ఇడి స్టాప్ లైట్
            • స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్
            • ఇగ్నిస్ జెటా ఆటోమేటిక్ వేరియంట్ లోని మరిన్ని భద్రత ఫీచర్లు

              ఇగ్నిస్ జెటా ఆటోమేటిక్ వేరియంట్ లోని మరిన్ని భద్రత ఫీచర్లు

              • ఫ్రంట్ వైపర్ మరియు వాషర్
              • డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్
              • ఇమ్మొబిలైజర్
              • ఓవర్ టేకింగ్ టర్న్ ఇండికేటర్
              • హెడ్ ల్యాంప్ ఆన్ ఇండికేటర్
              • రీ లెఫ్ట్ ఇండికేటర్
              • మైలేజ్

                మైలేజ్

                మారుతి సుజుకి ఇగ్నిస్ ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 20.89 కిలోమీటర్లు మరియు ఇగ్నిస్ ఆటోమేటిక్ డీజల్ వేరియంట్ 26.80 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. పోటీదారులను ఎదుర్కోవడానికి మారుతి వద్ద ఉన్న బలమైన ఆయుధం మైలేజ్.

                ఇంజన్ వివరాలు

                ఇంజన్ వివరాలు

                మారుతి సుజుకి ఇగ్నిస్‌లోని మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ రెండు ట్రాన్స్‌మిషన్ వేరియంట్లు కూడా అవే ఇంజన్‌లను కలిగి ఉన్నాయి. అందులోని ఇగ్నిస్ ఆటోమేటిక్ వేరియంట్ 81.80బిహెచ్‌‌పి పవర్ మరియు 113ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ వివిటి పెట్రోల్ ఇంజన్ మరియు 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.3-లీటర్ సామర్థ్యమున్న డిడిఐఎస్ డీజల్ ఇంజన్ కలదు.

                పరిశీలన:

                పరిశీలన:

                మారుతి పరిచయం చేస్తున్న ఆటోమేటిక్ డెల్టా మరియు జెటా ఇగ్నిస్ వేరియంట్లలో ఎల్ఇజి ప్రొజెక్టర్ లైట్లు, పగటి పూట వెలిగే లైట్లు, రియర్ పార్కింగ్ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, తాకే తెర ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు డ్రైవర్ సీటు ఎత్తును అడ్జెస్ట్ చేసుకునే వంటి ఫీచర్లు ఇందులో రాలేదు.

                మారుతి సుజుకి ఇగ్నిస్ ఆటోమేటిక్ వేరియంట్

                జనవరి 13, 2017 న మారుతి తమ ఇగ్నిస్‌ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. అంత వరకు చూస్తూ ఉండండి తెలుగు డ్రైవ్‌స్పార్క్....

                .

                మారుతి సుజుకి స్విఫ్ట్ కొనాలనుకుంటున్నారా...? అయితే కొద్ది రోజులు వేచి ఉండండి. త్వరలో 2017 స్విప్ట్ మార్కెట్లోకి విడుదల కానుంది. నూతన డిజైన్ శైలిలో విడుదల కానున్న స్విఫ్ట్ ఎలా ఉందో ఇక్కడ ఉన్న ఫోటోల మీద క్లిక్ చేయండి....

Most Read Articles

English summary
Maruti Suzuki Ignis AMT — Explained In Detail
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X