రెండు వారాలు, 6,000 ల బుకింగ్స్: మారుతి ఇగ్నిస్

మారుతి సుజుకి జనవరి 13, 2017 న విపణిలోకి తమ మొదటి క్రాసోవర్ ఇగ్నిస్‌ను విడుదల చేసింది.

By Anil

మారుతి తమ మొదటి క్రాసోవర్ ఇగ్నిస్‌కు సంభందించిన బుకింగ్స్‌ను జనవరి 1, 2017 నుండి ప్రారంభించింది. ఈ ఏడాది మొదటి విడుదలతో మారుతి జాక్ పాట్ కొట్టిందని చెప్పాలి. కేవలం రెండు వారాల్లో 6,000 యూనిట్ల ఇగ్నిస్ క్రాసోవర్ కార్లు బుక్ అయ్యాయి.

మారుతి సుజుకి ఇగ్నిస్

మారుతి ఇగ్నిస్ ను 4.59 నుండి 6.30 లక్షల శ్రేణి మధ్య ధరతో పెట్రల్ మరియు 6.39 నుండి 7.46 లక్షల శ్రేణి మధ్య ధరతో డీజల్ వేరియంట్లను విడుదల చేసింది.

మారుతి సుజుకి ఇగ్నిస్

డీజల్ ఇగ్నిస్ వాహనాలకు వెయిటింగ్ పీరియడ్ 12 వారాలు మరియు పెట్రోల్ ఇగ్నిస్ వాహనాలకు వెయిటింగ్ పీరియడ్ 8 నుండి 10 వారాల మధ్య ఉందని తెలిపింది. గరిష్టంగా బెంగళూరులో డీజల్ ఇగ్నిస్ కార్ల మీద వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉంది.

మారుతి సుజుకి ఇగ్నిస్

ఇగ్నిస్ క్రాసోవర్ మొత్తం నాలుగు ట్రిమ్ లలో లభించును. అవి సిగ్మా, డెల్టా, జెటా మరియు ఆల్పా ఉన్నాయి. ఇవి పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో లభిస్తున్నాయి.

మారుతి సుజుకి ఇగ్నిస్

సాంకేతికంగా ఇగ్నిస్ లో 83బిహెచ్‌పి పవర్ మరియు 113ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ మరియు 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల డీజల్ ఇంజన్ కలదు.

మారుతి సుజుకి ఇగ్నిస్

రెండు ఇంధన వేరియంట్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించును. ఇగ్నిస్ పెట్రోల్ వేరియంట్ 20.89 కిమీలు మరియు ఇగ్నిస్ డీజల్ వేరియంట్ 26.80 కిమీల మైలేజ్ ఇవ్వగలవు.

మారుతి సుజుకి ఇగ్నిస్

రూ. 4.59 లక్షల ప్రారంభ ధరతో విడుదలైన ఇగ్నిస్: దీని విశేషాలేంటో చూద్దాం రండి......

మారుతి సుజుకి ఇగ్నిస్

మారుతి సుజుకి తమ ఇగ్నిస్ విడుదలతో కొత్త సెగ్మెంట్‌ను ప్రారంభించింది. క్రాసోవర్ సెగ్మెంట్లోకి విడుదలైన ఇగ్నిస్ డిజైన్ మరియు ఫీచర్ల పరంగా మిగతా వాటితో పోల్చితే చాలా భిన్నంగా ఉంటుంది. మీ కోసం ఇగ్నిస్ క్రాసోవర్ ఫోటోలు.....

Most Read Articles

English summary
Maruti Suzuki Ignis Bags 6000 Bookings In Two Weeks
Story first published: Monday, January 16, 2017, 12:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X