మార్కెట్ నుండి ఎస్-క్రాస్ ను తొలగించిన మారుతి

మారుతి సుజుకి తమ ప్రీమియమ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎస్-క్రాస్ లోని కొన్ని వేరియంట్లను తమ లైనప్‌ నుండి తొలగించింది.

By Anil

దేశీయ ప్యాసింజర్ కార్ల దిగ్గజం మారుతి సుజుకి తమ ఎస్-క్రాస్ ఎస్‌యూవీని రెండు విభిన్నమైన ఇంజన్ వేరియంట్లలో అందిస్తోంది. అవి, డిడిఐఎస్ 320 మరియు డిడిఐఎస్ 200 -- ఇక్కడ డిడిఐఎస్320 అనగా 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ వేరియంట్ మరియు డిడిఐఎస్200 అనగా 1.3-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ వేరియంట్. అయితే వీటిలో 1.6-లీటర్ వేరియంట్‌ను మార్కెట్ నుండి తొలగించింది.

 మారుతి సుజుకి ఎస్-క్రాస్

మారుతి సుజుకి తమ ప్రీమియ్ విక్రయ కేంద్రం నెక్సా ద్వారా తమ ప్రీమియమ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎస్-క్రాస్ ను అందుబాటులో ఉంచింది. ఇది సిగ్మా అనే ఎంట్రీ, డెల్టా మరియు జెటా అనే మిడ్ అదే విధంగా ఆల్ఫా అనే టాప్ ఎండ్ వేరియంట్లో లభిస్తోంది.

 మారుతి సుజుకి ఎస్-క్రాస్

అయితే ఎస్-క్రాస్ లో టాప్ ఎండ్ వేరియంట్ మినహాయించే మిగిలిన అన్ని వేరియంట్లలో కూడా ఈ 1.6-లీటర్ ఇంజన్ ఉన్న డిడిఐఎస్ 320 శ్రేణి వాహనాలను తొలగించి, టాప్ ఎండ్ వేరియంట్ ఆల్ఫాలో మాత్రమే 12.03 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో అందుబాటులో ఉంచింది.

 మారుతి సుజుకి ఎస్-క్రాస్

ఇక ఎస్-క్రాస్ లోని 1.3-లీటర్ సామర్థ్యం ఉన్న డిడిఐఎస్ 200 వేరియంట్లు యథావిధిగా నెక్సా విక్రయ కేంద్రాలలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధరల శ్రేణి రూ. 8.78 లక్షల నుండి 10.63 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

 మారుతి సుజుకి ఎస్-క్రాస్

ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలు ఎంట్రీ లెవల్ వేరియంట్లలో ప్రవేశపెట్టడంతో కస్టమర్లు ఎంచుకోవడానికి కాస్త వెనకాడటం జరిగింది. అయితే టాప్ ఎండ్ వేరియంట్లో 1.6-లీటర్ ఇంజన్ గల ఎస్-క్రాస్ మంచి ఫలితాలనివ్వడం మరియు ఎట్రీలెవల్ వేరియంట్ లోని 1.3-లీటర్ మంచి అమ్మకాలు సాధిస్తుంటడంతో కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగానే 1.6-లీటర్ వేరియంట్‌ను ప్రారంభ వేరియంట్ నుండి తొలగించనున్నట్లు తెలిసింది.

 మారుతి సుజుకి ఎస్-క్రాస్

మారుతి తమ నెక్సా విక్రయ కేంద్రాల ద్వారా విడుదల చేసిన మొదటి ఉత్పత్తి ఎస్-క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. అయిచే ధరలు ఎక్కువగా ఉండటం చేత మారుతి ఎస్-క్రాస్ మీద ఊహించిన అమ్మకాలను సాధించలేకపోయింది.

 మారుతి సుజుకి ఎస్-క్రాస్

ఇప్పుడు ప్రతి నెలా 2000 నుండి 2,100 యూనిట్లకు దగ్గరా ఎస్-క్రాస్ విక్రయాలు నమోదవుతున్నాయి. మారుతి యుటిలిటి వాహనాల మార్కెట్లో వితారా బ్రిజా అమ్మకాలు కలిసి రావడంతో ఎస్‌యూవీ సెగ్మెంట్లో మారుతి వాటా స్వల్పమేరకు పెంచుకుంది.

 మారుతి సుజుకి ఎస్-క్రాస్

వితారా బ్రిజా విడుదల అనంతరం, ఎస్-క్రాస్ తరహాలో కాకుండా విక్రాయల్లో భారీ దూకుడు సృష్టించింది. అమ్మకాల్లో జోరు లేకపోయినప్పటికీ మారుతి బ్రాండ్ విలువను కలిగి ఉంది ఎస్-క్రాస్. మారుతి సుజుకి ఇండియా లైనప్‌లో ఒక్క మోడల్ ఒక్కో విలువను కలిగి ఉంది.

 మారుతి సుజుకి ఎస్-క్రాస్

ఎంట్రీ లెవల్ కార్ల ఉత్పత్తి పేరుగాంచిన మారుతి ఇప్పుడు యుటిలిటి వాహనాల సెగ్మెంట్లో తనదమైన ముద్ర వేసుకుంది. గత ఏప్రిల్-డిసెంబర్ 2016 కాలంలో ఎస్‌యూవీ సెగ్మెంట్లో మారుతి 120 శాతం వృద్దిని సాధించింది మరియు దేశీయ యుటిలిటి సెగ్మెంట్ మార్కెట్లో మారుతి 65 శాతం వాటాను కలిగి ఉంది.

 మారుతి సుజుకి ఎస్-క్రాస్

మారుతి సుజుకి తాజాగ నెక్సా షోరూమ్‌లో మరో మోడల్‌ను విడుదల చేసింది. ఎస్-క్రాస్ మరియు బాలెనో అనంతరం విడుదలైన ఇగ్నిస్ క్రాసోవర్ కారు ఫోటోలు గల గ్యాలరీ....

 మారుతి సుజుకి ఎస్-క్రాస్

2017 గ్రాండ్ ఐ10 ఫేస్‌లిఫ్ట్ విడుదల ధర రూ. 4.58 లక్షలు

ఇండియాలో ఉన్న టాప్ 10 లో మెయింటెనెన్స్ కార్లు

Most Read Articles

English summary
Maruti Suzuki Discontinues Sale Of Some Variants Of S-Cross — Find Out Why
Story first published: Monday, January 30, 2017, 11:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X