MG Windsor EV Full Review మంచి ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి ది బెస్ట్ ఆప్షన్‌!

భారతదేశంలో ఎంజీ మోటార్‌ ప్రయాణం హెచ్చు తగ్గుల మధ్య సాగుతోంది. ఈ సంస్థ 2017లో భారత్‌లో అడుగుపెట్టింది. దీని మాతృ సంస్థ SAIC గుజరాత్‌లోని జనరల్‌ మోటార్స్‌కి చెందిన హలోల్ ఉత్పత్తి కేంద్రాన్ని స్వాధీనం చేసుకుంది. రెండు సంవత్సరాల తరువాత ఈ సంస్థ భారత్‌లో తొలిసారిగా మొదటి కారు MG హెక్టర్ SUVని విడుదల చేసింది. వరుసగా ICE-ఆధారిత గ్లోస్టర్ ఆస్టర్ SUV, ZS EV ఎలక్ట్రిక్ SUV, కామెట్ EVలను విడుదల చేసింది. ఇప్పుడు JSW భాగస్వామ్యంతో ఎంజీ విండ్సర్ EVని (MG Windsor EV)ని విడుదల చేసింది. దీనిని కేవలం రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో తీసుకువచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా ఈ సరికొత్త క్రాస్‌ ఎవర్‌ యూనిట్‌ని మా డ్రైవ్స్‌పార్క్‌ టీమ్‌ టెస్ట్‌ డ్రైవ్‌ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి రివ్యూ మీకోసం..

డిజైన్‌: MG విండ్సర్ EVని మొదటి సారి ఎవ్వరూ చూసిన అది ఎంజీ కామెట్‌ ఈవీలో భారీ వెర్షన్‌గా భావిస్తారు. ఎందుకంటే ఇది చూడటానికి అచ్చం కామెట్‌ ఈవీ మాదిరివలె ఉంటుంది. ఈ MG విండ్సర్ దూరం నుంచి చూడటానకి MPV సిల్హౌట్‌తో ఉంటుంది. కానీ ఇంటీరియర్‌లో మాత్రం సాధారణ 5-సీటర్ కారు వలె కనిపిస్తుంది.

MG Windsor EV Driving Impressions

కామెట్ ఈవీ వలె కొత్త విండ్సర్ EV దాని ఫ్రంట్ ఎండ్‌లో లేయర్డ్ లుక్‌ను కలిగి ఉంది. దీని ముందు భాగంలో LED లైట్‌బార్, స్టైల్‌ DRLలు అదనపు ఆకర్షణగా ఉంటాయి. LED హెడ్‌లైట్‌లు బంపర్‌ కింది భాగంలో ఉంటాయి. దానిపైనే మోరిస్ గ్యారేజెస్ నేమ్‌ప్లేట్‌తో బ్లాక్ ప్లాస్టిక్ స్ట్రిప్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటాయి. MG లోగో మంచి బ్రైట్‌నెస్‌తో ఆకట్టుకుంటుంది.

ఈ కొత్త విండ్సర్ EV MPV డిజైన్‌ని పోలినట్లు ఉంటుంది కానీ దీనిలోని ఫ్రంట్‌ విండ్‌స్క్రీన్స్‌ గ్లాస్ రూఫ్‌ దగ్గరకు వచ్చే కొద్ది రెండు కలిసిపోవడం గమనించవచ్చు. దేశంలోని మాస్-మార్కెట్‌లో ఈ డిజైన్‌తో వచ్చే కారు ఇదే కావడం గమనార్హం. సైట్‌లో ఫ్లష్‌డోర్ హ్యాండిల్స్‌, EV 18-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ కలవు. సైడ్‌లో చివర వరకు క్రోమ్ స్ట్రిప్‌ ఉంటుంది. లెఫ్ట్‌ వీల్‌ఆర్చ్‌పై ఛార్జింగ్‌ పోర్ట్ కలదు.

MG Windsor EV

ఇక దీని వెనక డిజైన్‌లో రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్‌ కలదు దీని ద్వారా రేడియో కోసం యాంటెన్నా సిగ్నల్స్‌ని అందుకుంటుంది. విండ్‌స్క్రీన్ వెనుక భాగంలో క్రోమ్ స్ట్రిప్స్‌ సైడ్‌ డిజైన్‌లోని స్ట్రిప్‌కి కనెక్ట్‌ చేయబడి ఉంటుంది. దీని కింద కనెక్ట్ చేయబడిన LED టెయిల్‌లైట్స్‌ మధ్య MG బ్యాడ్జ్, Windsor EV బ్యాడ్జింగ్‌ను ఉంటుంది. అక్కడే మీకు బూట్‌ను ఓపెన్‌ చేయవచ్చు. ఇందులో 604 లీటర్ల బూట్‌ స్పేస్ కలదు.

ఇంటీరియర్‌ ఫీచర్లు: సరికొత్త విండ్సర్ EV లోపల విలాసవంతమైన మినిమలిస్ట్ క్యాబిన్‌ మీకు స్వాగతం పలుకుతుంది. క్యాబిన్‌లో కొంచెం సాఫ్ట్-టచ్ ప్లాస్టిక్‌లతో పాటు కొన్ని గోల్డ్ హైలైట్స్‌ (డ్యాష్, స్టీరింగ్ వీల్, ఎయిర్-కాన్ వెంట్స్ మరిన్ని)తో ఉంటుంది. అలాగే డ్యాష్‌బోర్డ్, భారీ ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ సెక్షన్స్‌ వుడ్‌ (Wood)తో వస్తుంది. 8.8-అంగుళాల దీర్ఘచతురస్రాకార డ్రైవర్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది పూర్తిగా డ్రైవర్‌కి సమాచారాన్ని అందిస్తుంది.

MG Windsor EV Full Review

డాష్‌బోర్డ్‌ మధ్యలో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేకి సపోర్ట్‌ చేసే క్లాస్-లీడింగ్ 15.6-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇన్ఫోటైన్‌మెంట్ సెటప్‌లో మీకు ఇష్టమైన ట్యూన్‌లను ప్లే చేయడానికి ఇన్ఫినిటీ నుంచి 9-స్పీకర్ ఆడియో సిస్టమ్ కూడా ఉంది. అంతే కాకుండా MG i-Smart సూట్ ద్వారా మీరు 80+ కనెక్ట్ చేయబడిన కార్ ఫీచర్‌లను యాక్సెస్ చేసేలా ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, కస్టమైజ్డ్‌ థీమ్‌లను కలిగి ఉంటుంది.

ఈ స్క్రీన్ Jio ద్వారా ఆధారితమైన MG యాప్ స్టోర్‌ ద్వారా గేమ్స్‌, మ్యూజిక్ స్ట్రీమింగ్, OTTలను యాక్సెస్‌ చేసుకోవచ్చు. వీటితో పాటు మల్టీ వాయిస్ అసిస్ట్‌తో (ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, మరాఠీ, తమిళం,తెలుగు) కంటెంట్‌ని యాక్సెస్ చేయడానికి మీకు అనుమతిస్తుంది. ముందు వెంటిలేటెడ్ సీట్లు, 6-వే పవర్‌ అడ్జస్ట్‌మెంట్స్‌ మంచి ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది.

MG Windsor EV Full Review

దీనిలోని వెనుక సీట్లు బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న అనుభూతిని పొందుతారు. ఈ వెనక సీట్లను గరిష్టంగా 135 డిగ్రీల వరకు బెండ్‌ చేయవచ్చు. ఇక డ్రైవర్ ఆర్మ్‌రెస్ట్ దగ్గర, డోర్ కార్డ్స్‌ల వద్ద కూడా మంచి స్టోరేజీ ఉంది. ముందు అలాగే వెనుక ఆర్మ్‌రెస్ట్‌లలో రెండు కప్‌హోల్డర్స్‌ ఉన్నాయి. ఇది లగ్జరీయస్‌ అనుభూతిని అందిస్తుంది.

MG విండ్సర్ క్యాబిన్‌లో లెథెరెట్ అప్హోల్స్టరీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, మల్టీ ఛార్జింగ్ పోర్ట్స్ (1 USB A, 2 USB C, 12V సాకెట్), LED రీడింగ్, లగేజ్ ల్యాంప్స్, వెనుక AC వెంట్స్‌, ఎయిర్ ఫిల్ట్రేషన్ సిస్టమ్,256 విభిన్న కలర్‌ ఆప్షన్స్‌తో యాంబియంట్ లైటింగ్ సెటప్ ఉంటుంది. దీని ఇంటీరియర్‌ వరల్డ్‌ క్లాస్‌ అనుభూతిని అందిస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే భూతల స్వర్గం అన్నట్లు.

MG Windsor EV

సేఫ్టీ ఫీచర్లు: సేఫ్టీ పరంగా MG విండ్సర్‌ 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ESP, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, LED కార్నరింగ్‌ ఫాగ్ లైట్స్‌, TPMS, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్స్‌ మరికొన్ని సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అయితే ఇందులో అడాస్‌ సేఫ్టీ సూట్‌ సెటప్‌ లేకపోవడం గమనార్హం.

స్పెక్స్ & డైమెన్షన్స్: ఈ MG విండ్సర్ EV 4,295mm పొడవు, 1,850mm వెడల్పు, 1,677mm పొడవు, 2,700mm పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. అలాగే 186mm గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. ఇక దీనిలోని సింగిల్‌ PMSM మోటార్‌ 134bhp, 200Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సింగిల్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా ముందు చక్రాలకు పవర్‌ని పంపిస్తుంది.

MG Windsor EV Full Review

ఇందులోని 38kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ (LFP కెమిస్ట్రీ) మోటార్‌కి శక్తిని అందిస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్‌ సింగిల్‌ ఛార్జ్‌పై 331km రేంజ్‌ని అందిస్తుంది. ఈ విండ్సర్ బ్యాటరీ ప్యాక్ 45kW ఫాస్ట్ DC ఛార్జర్‌తో వస్తుంది. దీని ద్వారా 55 నిమిషాల్లో 0-80% ఛార్జ్ చేయవచ్చు. 3.3kW, 7.4kW AC ఛార్జర్స్‌తో వరుసగా 13.8 గంటలు, 6.5 గంటలు ఛార్జింగ్‌ చేయవచ్చు.

ఈ విండ్సర్ EV బ్యాటరీ ప్యాక్ లైఫ్‌టైమ్‌ వారంటీతో అందించబడుతుంది. ఇతర EVల మాదిరిగా కాకుండా విండ్సర్ EV బ్యాటరీ యాజ్‌ ఏ సర్వీస్‌ (BaaS) కింద అందిస్తుంది. దీని ప్రకారం మీరు బ్యాటరీ ప్యాక్‌ లేకుండా కంపెనీ అందించే బ్యాటరీ సర్వీస్‌ ద్వారా కిలోమీటరుకు మీరు రూ. 3.5 అద్దె రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అందుకే MG దీనిని బ్యాటరీ ఆప్షన్‌ లేకుండా తక్కువ ధరతో అదించింది.

MG Windsor EV Full Review

డ్రైవింగ్ ఇంప్రెషన్స్‌: దీని ప్రయాణంలో MG విండ్సర్ లెథెరెట్-అప్హోల్స్టరీ డ్రెప్డ్ సీట్లు సౌకర్యవంతంగా ఉంటాయి. విండ్సర్ EVలో ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్‌ ఉన్నాయి. మీరు ఎకో నుండి స్పోర్ట్‌కి మారినప్పుడు పనితీరు స్థాయిలు (కొద్దిగా) పెరుగుతాయి. సింగిల్-మోటార్ ఫ్రంట్-వీల్-డ్రైవ్ సెటప్ సాఫ్ట్‌గా పనిచేస్తుంది. మీరు కఠినమైన రోడ్లతో పాటు సిటీలోనూ ఇబ్బంది లేకుండా డ్రైవ్ చేయవచ్చు.

అయితే మీరు ఎకో నుండి నార్మల్‌కి ఆపై స్పోర్ట్‌కి వెళ్లినప్పుడు స్టీరింగ్ కొద్దిగా బరువుగా ఉంటుంది. సిటీ డ్రైవింగ్‌లో ఎకో మోడ్‌ స్టీరింగ్‌కు సంబంధించినంతవరకు తక్కువ బరువు మంచి రెస్పాన్స్‌తో ట్రాఫిక్‌లోనూ సులభంగా ఉంటుంది. ఇక దీనిలోని సస్పెన్షన్ సెటప్ (ముందు భాగంలో మెక్‌ఫెర్సన్‌స్ట్రట్ మరియు వెనుక భాగంలో టోర్షన్ బీమ్), కారు అధిక బరువు ఉన్నప్పటికీ సౌకర్య వంతంగా ట్యూన్ చేయబడింది.

MG Windsor EV Full Review

విండ్సర్ EV నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్స్‌ని కలిగి ఉంది. ఇది తగినంత స్టాపింగ్ పవర్‌ను అందిస్తుంది. అయితే, మెరుగైన రేంజ్‌ కోసం రోలింగ్ రెసిస్టెన్స్ లెవెల్స్‌ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇందులోని చాలా సన్నగా ఉండే (215/55) స్టాక్ టైర్‌లను అప్‌గ్రేడ్ చేస్తే బ్రేకింగ్ ఇంకా మెరుగ్గా ఉంటుంది. ఓవరాల్‌గా ఇది మంచి డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది.

చివరగా: MG విండ్సర్ EV అనేది JSWతో దాని కొత్త భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్‌ మార్కెట్‌లో సంచలనాలను సృష్టించడానికి విడుదల అయ్యింది. దీనిని అందరికీ అనువుగా బెస్ట్‌ డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ని అందించే విధంగా MG విండ్సర్‌ని ఆ సంస్థ ప్రవేశపెట్టింది. మంచి రేంజ్‌, సీటింగ్ (ముఖ్యంగా వెనుక సీట్లు), సిటీ డ్రైవింగ్‌కి అనువుగా ఉంటాయి. అయితే ఇది బ్యాటరీ అద్దె ప్రతిపాదికన అందుబాటులో ఉంటుంది.

కానీ కంపెనీ అందిస్తున్న మూడు వేరియంట్లతో బ్యాటరీ ఆప్షన్‌తో రూ. 13.5 లక్షల నుంచి రూ. 15.5 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ధరలతో అందుబాటులో ఉంది. ఈ ధరల ప్రకారం విండ్సర్ EV మంచి ఎలక్ట్రిక్‌ కార్లు కొనుగోలు చేయలనుకుంటున్న వారికి ది బెస్ట్‌ ఆప్షన్‌ అవుతుంది. కావున ఈ కారుని కళ్లుమూసుకుని కొనేయొచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, September 23, 2024, 11:02 [IST]
English summary
Mg windsor ev driving impressions specs features and range details in telugu
Read more on: #mg motor #car review #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+