టాటా "జికా" రివ్యూ: భారతీయ మార్కెట్లో ఇది ఒక అద్బుతం

By Anil

టాటా "జికా" కారు టాటా వారి అద్భత సృష్టికి నిదర్శనం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పోటి ప్రపంచంలో సరైన ధరకు అన్ని అనుకూలతలతో దేశీయ మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయించుకుంది. అయితే కార్ల విక్రయాలలో ఏ మాత్రం ఊపందుకోలేని టాటా మోటార్స్ మరి ఈ జికా మోడల్ ద్వారా అయినా మార్కెట్లో తనేంటో నిరూపించుకుంటుందా?
Also Read: మహీంద్రా యక్స్‌యువి5oo,హ్యుందాయ్ క్రెటా కార్ల మధ్య మొదలైన యుద్దం

టాటా మోటార్స్ మీడియా డ్రైవ్ సందర్భంగా తమ జికా మోడల్ కు టెస్ట్ డ్రైవ్‌ను నిర్వహించారు. అందులో భాగంగా మనకు తెలియని కొన్ని విషయాలను ఈ టెస్ట్ డ్రైవ్‌లో పాల్గొన్న వారు ఈ కారు గురించి కొన్ని విషయాలు వెల్లడించారు. అవేంటో క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం రండి...

డిజైన్

డిజైన్

టాటా జికా డిజైన్ పూర్తిగా కొత్తది. ఇంతకు ముందు ఏ టాటా కారులో ఇలాంటి డిజైన్ కనపడలేదు. కారును ఎంచుకునే వారి మొదటి అభిప్రాయం కారు డిజైన్. డిజైన్ ను అంశంగా ఎంచుకుని కార్లను కొనే వారు ఎక్కువగా ఉన్నారు. వారు ఖచ్చితంగా దీనిని ఎంచుకుంటారు. ఇక డిజైన్ పరంగా దీని ముందు భాగం ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. దీని హెడ్ లైట్స్‌ను కార్నర్‌లలో ఉండేవిదంగా రూపొందించారు. మొత్తానికి ఇది మంచి స్పోర్టివ్‌ లుక్‌తో ఉంది.

ఇంజన్

ఇంజన్

టాటా జికా రెండు ఇంజన్ ఆప్షన్‌లలో వచ్చింది. పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లు రెండు కూడా మూడు సిలిండర్ల‌తో కలవు. అందులో పెట్రోల్ ఇంజన్ 1199సీసీ కెపాసిటి మరియు డీజల్ ఇంజన్ 1047సీసీ కెపాసిటి కలదు.

 పవర్

పవర్

1199సీసీ గల పెట్రోల్ ఇంజన్ దాదాపుగా 84 బిహెచ్‌పి పవర్ మరియు 114 యన్‌.మ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు 1047సీసీ గల డీజల్ ఇంజన్ 69బిహెచ్‌పిపవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు వేరియంట్లలో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు.

మైలేజ్

మైలేజ్

టాటా జికా లోని పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 20 కిలోమీటర్లు మరియు డీజల్ వేరియంట్ కారు దాదాపుగా లీటర్‌కు 25 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తుంది.

అనుకూలతలు

అనుకూలతలు

ఇంతకు ముందు గల టాటా కార్లలో గల సీట్ల కున్నా ఇప్పుడు ఎంతో సౌకర్యవంతమైన సీట్లును కల్పించారు. ఇందులో మీరు గమనించినట్లయితే ప్రతి సీటుకు కూడా మూడు వైపులా ఉబ్బెత్తుగా ఉండేల విధంగా రూపొందించారు. ఇది మీకు చక్కటి సౌకర్యాన్ని కల్పిస్తుంది.

ఇతర సౌకర్యాలు

ఇతర సౌకర్యాలు

ఇందులో వాటర్ బాటిల్స్, కప్పులు, తినుబండరాలు పెట్టుకోవడానికి ప్రత్యేకమైన స్థలం కేటాయించారు. ఒక సారి ప్రక్కన గల ఫోటోను గమనించండి. అక్కడ రెండు కప్పులను ఎంత చక్కగా ఉన్నయో కదా?

మల్టీమీడియా

మల్టీమీడియా

న్యావిగేషన్ సిస్టమ్, స్మార్చ ఫోన్ ఇంటిగ్రేషన్ మరియు బ్లూటూత్ కనెక్టివిటి వంటి ఫీచర్లు ఎన్నో ఇందులో ఉన్నాయి. మరియు ఆడియో సిస్టమ్‌ కూడా ఇందులో కలదు.

 రివర్స్ పార్కింగ్

రివర్స్ పార్కింగ్

కారును పార్క్ చేయాలంటే వెనుక వైపుకు చూసుకుంటూ లేదా ఎవరైనా లెఫ్ట్, రైట్ అని అంటే పార్కింగ్ చేస్ వాళ్లం కదా. కాని ఇందులో రివర్స్ పార్కింగ్ కెమెరాలు అందించారు. దీని ద్వారా మనం డిస్ల్పేలో చూసుకుంటూ కారును పార్కింగ్ చేయవచ్చు.

 విశిష్టతలు

విశిష్టతలు

ఇందులో గల మరిన్ని విశిష్టతలు అనగా ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీ-ఫంక్షన్ డిస్ల్పే మరియు మొబైల్ ఫోన్ ఛార్జింగ్ చేయడానికి ప్రత్యేకమైన ఛార్జర్‌‌ పోర్ట్‌లను కల్పించారు.

ఎంతో సురక్షింతం

ఎంతో సురక్షింతం

టాటా వారు ఈ జికా కారు గొప్పగా చెప్పుకునే అంశం భద్రత. ఇందులో భద్రతకు చెందిన ఫీచర్లు బాగానే ఉన్నాయని చెప్పవచ్చు. టాప్-ఎండ్ వేరియంట్‌లో రెండు ఎయిర్ బ్యాగులను కల్పించారు, యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు కార్నర్ స్టెబిలిటి కంట్రోల్ వంటి భద్రత పరమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

 ధర

ధర

టాటా జికా దీనిని మార్కెడట్లోకి విడుదల చేసే సమయానికి ఇందిులో గల ప్రారంభ వేరియంట్ ధర రూ. 3.50 లక్షల నుండి మొదలు కావచ్చు మరియు టాటా జికా టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 4.0 లక్షల నుండి మొదలు కావచ్చు.

పోటి

పోటి

టాటా జికా ఫీచర్లు అన్ని చూసిన తరువాత ఇది మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మరియు ఫోర్డ్ పిగో వంటి ఉన్నతమైన మోడల్లకు గట్టిపోటినే ఇవ్వగలదు.

తీర్పు

తీర్పు

మనం వెచ్చించే ధరకు ఇది సరైన కారు అని మా నిర్ణయం. సాదారణంగా అన్ని ఫీచర్లు ఒకే కారులో పొందడం కాస్త కష్టం. అయినప్పటికి టాటా మోటార్స్ వారు దేశీయంగా రూపొందించిన ఈ కారులో అన్ని ఫీచర్లు అద్బుతంగా అందించారు. ఎందుకంటే చాలా వరకు ఇందులో గల ఫీచర్లు బాగున్నాయి. ఉత్తమ మైలేజ్, రెండు ఇంజన్ ఆప్షన్స్, ఉత్తమ ఫీచర్లు మరియు కొత్త డిజైన్ చాలా బాగుంటుంది. మా నిర్ణయం టాటా జికా కారు ఎంతో బెస్ట్...

టాటా జికా

More from DriveSpark

Article Published On: Friday, December 4, 2015, 13:06 [IST]
English summary
Tata Zica Review: What To Expect?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+