2015లో విడుదలైన టాప్-10 బెస్ట్ కార్లు: డ్రైవ్ స్పార్క్ ప్రత్యేక సేకరణ

By Anil

కాల గర్బంలో మరో సంవత్సరం గడిచిపోతోంది. ఈ సంవత్సరం దాదాపుగా చాలా వరకు కొత్త కార్లు భారతీయ మార్కెట్లోకి విడుదల అయ్యాయి. ఒకరకంగా చూస్తే ఈ ఏడాది ఆటోమొబైల్ ఇండస్ట్రీ వారికి బాగా కలసి వచ్చిందని చెప్పవచ్చు.

అయితే ఈ ఏడాది విడుదల అయిన కార్లలో అత్యుత్తమమైన టాప్-10 కార్లు గురించి మీరు తెలుసుకోవడానికి డ్రైవ్‌స్పార్క్ ప్రత్యేక కథనం అందిస్తోంది. మరెందుకు ఆలస్యం క్రింది గల కథనం మీద ఓ చూపు చూడండి...

10. డాట్సన్ గో ప్లస్

10. డాట్సన్ గో ప్లస్

పదవ స్థానంలో ఉంది డాట్సన్ వారి గో ప్లస్ కారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కారు, ఎందుకంటే ఇది యమ్‌యువి గా మన ముందుకు రానుంది. ఇందులో దాదాపుగా ఏడు మంది కలసి ప్రయాణించవచ్చు. ఇంది డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ కారు ఆధారంతో రూపొందించబడినది.

Also Read: ఆల్టో మీద రివేంజ్ కోసం డాట్సన్ రెడి గో..!!

09. అబర్త్ పుంటో

09. అబర్త్ పుంటో

ఫియట్ కు చెందిన అబర్త్ పుంటో కారు తొమ్మిదవ స్థానంలో ఉంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఉన్న అత్యంత శక్తివంతమైన హ్యాచ్‌బ్యాక్‌‌లలో ఇది ఒకటి. ఈ అబర్త్ పుంటో లో గల టర్భోఛార్జ‌ర్ కలిగిన అత్యంత శక్తివంతమైన ఇంజన్ దాదాపుగా 145 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Also Read: పుంటో స్పోర్టివో లిమిటెడ్ ఎడిషన్‌ విడుదల చేసిన ఫియట్‌

 08. మారుతి సుజుకి యస్-క్రాస్

08. మారుతి సుజుకి యస్-క్రాస్

మారుతి సుజుకి వారు ఈ యస్-క్రాస్ కారును కేవలం నెక్సా షోరూమ్ ద్వారా మాత్రమే దేస వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది విడుదల అయిన తరువాత మంచి ఫలితాలనే నమోదు చేసుకుంది. ఈ యస్-క్రాస్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోర్డ్ ఎకోస్పోర్ట్, రెనో డస్టర్ మరియు టెర్రానొ వంటి మోడల్లకు పోటిగా నిలిచింది. ప్రస్తుతం ఈ యస్-క్రాస్ కారు రెండు డీజల్ ఇంజన్ అప్షన్లలో లభిస్తోంది.

Also Read: మారుతి సుజుకి యస్‌-క్రాస్ ప్రీమియా ఎడిషన్ విడుదల

07. హోండా జాజ్

07. హోండా జాజ్

జపాన్ కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ అయిన హోండా వారు విడుదల చేసిన మొదటి తరం జాజ్ కారు మార్కెట్లో చెత్తగా పెర్ఫామెన్స్ చేసింది. తరువాత దీనిని మార్కెట్ నుండి తొలగించి దీని స్థానంలో సరికొత్త లుక్ ‌గల రెండవ తరం జాజ్ కారును ప్రవేశ పెట్టారు. డీజల్ మరియు పెట్రోల్ ఇంజన్ వేరియంట్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ వంటి అధ్వితీయమైన ఫీచర్ల వలన ఉన్నట్లు అత్యధిక ఆదరణ పొంది. ఇదే దీనిని ఇలా టాప్-10లో ఏవ స్థానంలో నిలిపింది.

Also Read: భారతీయ మార్కెట్లోకి హోండా జాజ్ ట్విస్ట్‌ క్రాసోవర్

06. ఫోర్డ్ ఆస్పైర్

06. ఫోర్డ్ ఆస్పైర్

ఫోర్డ్ నుండి ఒక ఆశ్చర్యకరమైన ఉత్పత్తి ఏదంటే ఆస్పైర్ అని చెప్పవచ్చు. పెట్రోల్ మరియు డీజల్ ఆప్షన్‌తో వచ్చిన ఆ ఆస్పైర్ కారు స్వఫ్ట్ డిజైర్ కారుకు ప్రత్యక్ష పోటిగా నిలిచింది. ఇందులో ఒక ప్రత్యేకమైన ఫీచర్‌గా ఆటోమేటిక్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ చెప్పవచ్చు. అయిత్ డిజైర్ మరియు ఆస్పైర్ ల మధ్య పెద్ద పోటినే నెలకొంది.

Also Read: సరికొత్త హంగులతో భారత్‌లో విడుదలైన ఫోర్డ్ ఫిగొ

05.మారుతి సుజుకి బాలెనొ

05.మారుతి సుజుకి బాలెనొ

మారుతి సుజుకి వారి పూర్వ వైభవాన్ని తిరిగి బాలెనొ కారుతో మార్కెట్లోకి తీసుకు వచ్చింది. దీనిని చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. అయితే ఈ బాలెనొ కారులో స్విఫ్ట్ ఇంజన్‌లను ఉపయోగించారు. దేశ వ్యాప్తంగా గల నెక్సా షోరూమ్‌లో అందుబాటులో ఉన్న మరొక మోడల్ బాలెనొ కారు.

Also Read: మారుతి బాలెనొ కారు వేరియంట్స్, సౌకర్యాలు మరియు ఇతర వివరాలు.

04. మహీంద్రా టియువి3OO

04. మహీంద్రా టియువి3OO

నాలుగవ స్థానంలో ఉన్న ఈ మహీంద్రా టియువి3OO కొంచెం యుద్ధ ట్యాంక్ డజైన్‌ను పోలి ఉంటుంది. మహీంద్రా వారు ఈ ఏడాదిలో విడుదల చేసిన టియువి3OO యస్‌యువి భారిగా అమ్మకాలు నమోదు చేసుకుంది. ఢిల్లీలో డీజల్ వాహనాల అమ్మకాలను రద్దు చేసిన తరువాత ఈ మహీంద్రా టియువి3OO లు అధిక సంఖ్యలో అమ్ముడుపోతున్నాయి.

Also Read: మహీంద్రా థార్ అడ్వెంచర్ ఎడిషన్

03.ఫోర్ట్ ఫిగో

03.ఫోర్ట్ ఫిగో

అంతర్జాతీయ మార్కెట్లో దీనిని పోర్డ్ కెఎ అనే నామంతో అమ్మకాలు జరుపుతోంది ఫోర్డ్ సంస్థ. మూడవ స్థానంలో ఈ ఫిగో రావడం ద్వారా టాప్-10 లిస్టులో ఫోర్డ్ వారివి రెండు కార్లు నిలిచాయి. తక్కువ ధరకు ఉత్తమమైన కారు కూడా ఇదే అందులోను మంచి శక్తివంతమైన డీజల్ ఇంజన్‌ను కలదు. ప్రస్తుతం ఇది మారుతి సుజుకి స్విప్ట్ హ్యాచ్‌బ్యాక్‌ కారుకు పోటిగా నిలిచింది. ఇప్పుడిప్పుడే వీటి అమ్మకాలు పుంజుకుంటున్నాయి.

Also Read: విజయ పథంలో దూసుకెళ్తున్న 2015 ఫోర్డ్ ఫిగొ

02. రెనో క్విడ్

02. రెనో క్విడ్

తక్కువ ధర, ఎక్కువ పీచర్లు మరియు అత్యధికంగా అమ్ముడుపోతున్న కారు అదే రెనో వారి క్విడ్. దేశీయ ఎంట్రీ లెవల్ కార్ల మార్కెట్లో పెను మార్పులు తీసుకువచ్చిన కారు క్విడ్. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి ఆల్టో, హ్యుందాయ్ ఇయాన్ వంటి కార్లకు గట్టి పోటిగా నిలిచింది

Also Read: మారుతి ఆల్టో 800 ని చంపేసిన రెనొ క్విడ్ ?: అసలు ఏమైంది....

 01. హ్యుందాయ్ క్రెటా

01. హ్యుందాయ్ క్రెటా

హ్యుందాయ్ వారు విడుదల చేసిన ఏకైక మోడల్ క్రెటా. మా లిస్ట్‌లో దీనికి మొదటి స్థానం దక్కింది. యస్‌యువి లలో రారాజు గా ఉన్న బొలెరు కారును ఈ క్రెటా అమ్మకాల పరంగా భారీ దెబ్బతీసింది. విడుదల అయిన అనతి కాలంలోనే భారీ అమ్మకాలను నమోదు చేసుకుంది. ప్రస్తుతం క్రెటా మూడు ఇంజన్‌ ఆప్షన్‌లలో లభిస్తోంది.

Also Read: హుషారెక్కించనున్న హ్యూందాయ్ క్రెటా?

2015లో విడుదలైన టాప్-10 బెస్ట్ కార్లు: డ్రైవ్ స్పార్క్ ప్రత్యేక సేకరణ
  1. భారతీయ మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ కార్లు: ఇందులో మీ కారు ఉందా?
  2. టాటా జికా వర్సెస్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10: ఇందులో ఏది ఉత్తమం?
  3. మహీంద్రా యక్స్‌యువి5oo,హ్యుందాయ్ క్రెటా కార్ల మధ్య మొదలైన యుద్దం
  4. భారతీయులు అత్యధికంగా ఇష్టపడుతున్న టాప్-10 టూవీలర్లు

More from DriveSpark

Article Published On: Thursday, December 24, 2015, 15:24 [IST]
English summary
DriveSpark Dispatch: 10 Best New Car Launches In 2015
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+