మారుతి ఆల్టో 800 ని చంపేసిన రెనొ క్విడ్ ?: అసలు ఏమైంది....

By Anil

సరి కొత్త రెనొ క్విడ్ ఇండియాలో ఆకర్షణీయమైన ప్రారంభ ధర వద్ధ విడుదల చేసింది. దీని ధర ఎంతో తెలుసా కేవలం 2.56 లక్షల రుపాయలు మాత్రమే. ప్రస్తుతం ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుండి మారుతి ఆల్టో 800 తిరుగు లేని అమ్మకాలు సాగిస్తూ వచ్చింది. అయితే ఎప్పుడైతే రెనొ క్విడ్ పరిచయం జరిగిందో కేవలం అతి తక్కువ కాలంలోనే ఊహించని స్తాయికి చేరుకుంది. ఆర్డినరి కార్ల రంగంలో మారుతికి తిరుగులేని వినియోగదారులు ఉండేవారు కాని ప్రస్తుతం ఇది క్విడ్ నుండి గట్టి పోటిని ఎదర్కుంటోంది.
Also Read: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన టాప్ 10 లగ్జరీ హెలికాప్టర్లు: ఆశ్చర్యగొలిపే నిజాలు...

భారత దేశపు ఆటోమొబైల్ కార్ల మార్కెట్లో నాలుగు లక్షలలోపు గల కార్లు, మారుతి ఆల్టో, షెవర్లే స్పార్క్, టాటా నానో, హ్యూందాయ్ ఇయాన్ మరియు డాట్సన్ గొ. దేశ మార్కెట్‌లో చిన్న కార్ల సెగ్మెంట్‌లో వ్యాపార వాటా దాదాపుగా 25 శాతం ఉంది.

Also Read: మెర్సిడెస్ బెంజ్ మ్యూజియం‌లో ఉన్న టాప్-10 కార్లు: తప్పకుండా చూడవలసినవి.

ఈ మార్కెట్‌లో రెనొ తన స్థానం కోసం క్విడ్ ని ప్రవేశ పెట్టింది. క్విడ్ దాదాపుగా 98 శాతం దేశీయంగా తయారవుతోంది. దీనిని చెన్నై లో రెనొ-నిస్సాన్ అలియన్స్ ఆద్వర్యంలో తయారు చేస్తున్నారు. దీన్ని విడుదల చేసిన నాటికి పూర్తిగా స్వదేశంగా తయారిని మొదలు పెట్టారు. రెనొ కంపెని తన క్విడ్ తయారి మరియు అభివృద్ధి కోసం అతి పెద్ద మొత్తం అంటే దాదాపుగా 3000 కోట్ల రుపాయలను పెట్టుబడిగా పెట్టింది. ప్రారంభస్థాయిలో ఉత్తమమైన హ్యాచ్‌బ్యాక్ క్విడ్ అని చెప్పవచ్చు.
దీనిని ఇంత ఉత్తమ మార్గంలో నడిపిస్తున్న ముఖ్యమైన విశేషాలు ఏమిటో క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం..

డిజైన్:

డిజైన్:

రెనొ క్విడ్ ఒక విధంగా చెప్పాలంటే సిటి కారు. దీని డిజైన్ పూర్తిగా రెనొ-నిస్సాన్ యొక్క సి.ఎమ్.ఎఫ్-ఎ ఫ్లాట్‌ఫామ్ మీద ఆధారపడి తయారయినది. సి.ఎమ్.ఎఫ్ అనగా కామన్ మాడ్యూల్ ఫ్యామిలి మరియు సి.ఎమ్.ఎఫ్-ఎ ఫ్లాట్‌ఫామ్ అనగా చిన్న మరియు సరసమైన అని అర్థం. అయితే దీని డిజైన్ రెనొ డస్టర్ యొక్క ప్రేరణతో ముంబాయ్ మరియు చెన్నైకు చెందిన డిజైన్ స్టుడియో వారు యువతను దృష్టి ఉంచుకుని తయారుచేశారు.

ఈ డిజైన్‌ను భారతీయ రోడ్ల మీద పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని చక్కని డ్రైవింగ్ కోసం ఒక మంచి ఆదర్శంతో దీనిని తయారు చేశారు. అద్దంలో నుండి బయటి వైపునకు చూసినప్పుడు విశాలంగా కనపడుతుంది దీనిని వలను ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి. దీనిలో చైను లింక్ లాంటి మలుపులు సూచించే గ్రిల్, హెడ్ ల్యాంప్స్, ఇండికేటర్స్ మరియు ఇండికేటెడ్ పైకప్పు స్పాయిలర్ క్విడ్ ను ఎంతో అందంగా కనిపించేవిధంగా చేస్తుంది.

ఇంటీరియర్ :

ఇంటీరియర్ :

ఒక సారి ఆలోచించండి మనం దీని కోసం చెల్లించే ధరతో దీని ఇంటీరియర్‌లో ఏమేమి ఉంటాయో. ఇక్కడ మీరు ఊహించనదానికంటే ఎక్కువ ఫీచర్స ఇందులో ఉన్నాయి. ప్రతి రోజు మీరు కోరుకునే అన్ని ఇందులో ఉన్నాయి. నాలుగు వైపులా డ్రైవర్ సీట్‌ను సర్దుకోవచ్చు, స్మార్ట్ స్టోరేజ్ అంటే వాటర్ బాటిల్‌ని ఉంచుకోవడం, త్రీ టైడ్ గ్లూవ్ బాక్స్ మరియు మీ సెల్ ఫోన్ చార్జింగ్ కోసం పవర్ కేబుల్, మరియు దీని సీట్లుకు ఇరుపక్కల ఉబ్బెత్తుగా నిర్మించారు దీని వలన మీరు మలుపుల వద్ద ఎంతో భద్రంగా ప్రయాణించవచ్చు, లెగ్ రూమ్, బూట్ స్పేస్ అన్ని ఇందులో ఎక్కువగా ఉన్నాయి.

ఇంజిన్ :

ఇంజిన్ :

  • క్విడ్ స్టాండర్డ్ అల్యూమినియం ఇంజిన్ ను కలిగి ఉంది.
  • ఇంజిన్ కెపాసిటి 800సీసీ
  • సిలిండర్స్ 3-సిలిండర్లు కలవు
  • వాల్వ్ 12 వాల్వ్‌లు కలవు
  • గేర్ బాక్స్ :

    గేర్ బాక్స్ :

    ఇది 5- స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ను కలదు.

    క్విడ్ కోసం స్మార్ట్ కంట్రోల్ ఎఫిషియన్సి గల ఇంజిన్‌ను అభివృద్ధిపరిచారు. అయితే దీనిని భవిష్యత్తులో ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రాబోయే క్విడ్ కోసం వాడనున్నట్లు తెలిపారు.

    డ్రైవబులిటి :

    డ్రైవబులిటి :

    క్విడ్ కేవలం 699 కేజీలు మాత్రమే మోయగలదు మరియు క్విడ్ యొక్క పొడవు 3,679 ఎమ్ఎమ్, వెడల్పు 1,579 ఎమ్ ఎమ్ మరియు ఎత్తు 1,478 ఎమ్ ఎమ్ ఈ హ్యాచ్ బ్యాక్ ను కొలతల పరంగా చూస్తే ఇది పొడవైనది మరియు ఎత్తైనది.

    బరువుకు అనుగుణంగా దీనిని పవర్ ని లెక్కకట్టారు అనగా ఒక తక్కువ వేగం ఉన్నప్పుడు టన్ను బరువుకు 84 హార్స్‌పవర్ అవసరం అవుతుంది. మరియు దీని స్టీరింగ్ తిప్పడానికి

    మీకు ఎంతో సులభంగా ఉంటుంది. దీని యొక్క వీల్స్ 13-ఇంచెస్ ఉన్నాయి. మరియు పల్లెప్రాంత రహదారుల్లో అత్యధిక పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది.

    మైలేజ్ :

    మైలేజ్ :

    గేర్స్ చాలా సులభంగా మార్చవచ్చు, క్లచ్ పెడల్ చాలా స్మూత్ గా ఉంటుంది. దీని ముందు వైపున డిస్క్ మరియు వెనుక వైపున చక్రాలకు డ్రమ్ బ్రేక్ కలదు, సస్పెన్షన్ సంతృప్తకరంగానే ఉంటుంది. ఏఆర్ఏఐ సర్ట‌ిఫికేషన్ ప్రకారం దీని మైలేజి 25.17 కిలోమీటర్/లీటర్, ఇది దేశంలో అత్యధికంగా మైలేజ్ ఇచ్చే కార్ల సరసన చేరిపోయింది.

    భద్రత :

    భద్రత :

    ప్రస్తుత కాలంలో కార్లను కొనేవారు దాదాపుగా ఎక్కువ మంది భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనిలో భద్రత పరంగా ఎయిర్ బ్యాగ‌లను అమర్చారు. మరియు దీనిని ప్రపంచ మార్కెట్ అనగా బ్రెజిల్ మరియు యూరప్ వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని తయారు చేశారు కాబట్టి భద్రత కోసం పెద్ద పీట వేశారని చెప్పవచ్చు. మరియు మన దేశంలో కూడా భద్రత పరీక్షలకు ఇది సిద్ధంగా ఉంది.

    ధర మరియు మోడల్స్ :

    ధర మరియు మోడల్స్ :

    క్విడ్ యొక్క ప్రారంభ ధర రూ.2.56 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లి)

    ఇందులో నాలుగు ఇంజిన్ వేరియంట్లు కలవు అవి 1.యస్.టి.డి

    2.ఆర్.ఎక్స్.ఇ

    3.ఆర్.ఎక్స్.ఎల్

    4.ఆర్.ఎక్స్.టి

    మరియు ఇవి ఐదు విభిన్న రంగుల్లో లభిస్తున్నాయి.

    ఇందులో మంచివి :

    ఇందులో మంచివి :

    • రూమ్ ఇంటీరియర్
    • ఫ్యూయల్ ఎఫీషియంట్ ఇంజిన్
    • రిమోట్ కీ లెస్ ఎంట్రీ
    • ఎక్సలెంట్ రోడ్ ప్రెసెంట్స్
    • ఆర్.ఎక్స్.టి వేరియంట్‌లో డ్రైవర్ ఎయిర్ బ్యాగ్
    • మంచి ఇంటీరియర మరియు ఎక్స్‌టీరియర్
    • గ్రౌండ్ క్లియరెన్స్-180ఎమ్ఎమ్
    • వారంటి 2 సంవత్సరాలు లేదా 50,000 కెఎమ్
    • సులభమైన రైడ్
    • ఎక్కువ బూట్ స్పేస్
    • ఇందులో చెడ్డవి :

      ఇందులో చెడ్డవి :

      • ప్లాస్టిక్ వింగ్ మిర్రర్స్
      • అర్,పి.ఎమ్ గేజ్ లేకపోవడం
      • తక్కువ గేర్‌లో ఉన్నపుడు వైబ్రేషన్స్
      •  ఇండియాలో గల రెనాల్ట్ పరిస్తితిని క్విడ్ మార్చగలదా ?

        ఇండియాలో గల రెనాల్ట్ పరిస్తితిని క్విడ్ మార్చగలదా ?

        హ్యూందాయ్ మరియు మారుతి కి వ్యతిరేకంగా విడుదలైన రెనొ క్విడ్ ఎంతో అందంగా, సరసమైన ధరకు, కొత్తగా ఎక్కువ ఫీచర్లతో గల ఈ క్విడ్ కారు భారత దేశంలోని పరిస్తితిని మార్చగలదా, అయితే మీరు ఏ కారు తీసుకుంటున్నారు.... రెనొ క్విడ్ కదా!

        ఎక్కువ మంది చదినవిన స్టోరీలు

        ఎక్కువ మంది చదినవిన స్టోరీలు

        చరిత్రను తిరగరాసిన రెనొ క్విడ్ బుకింగ్స్

        రెనొ క్విడ్ యొక్క ప్రయోజనాలు మరియు నష్టాలు

        రెనొ క్విడ్ మరియు హ్యుందాయ్ ఇయాన్‌ల మధ్య పెరిగిన పోటి.

Most Read Articles

English summary
The all-new Renault Kwid launched in India at an introductory price of Rs. 2.56 lakh onward. Since then, the Kwid has been the big news of the auto industry. There is talk in the auto world of the Renault Kwid being sold at a loss in order to compete with Maruti Suzuki’s popular Alto. This could mean---the Kwid isn't just another ordinary car for the A-segment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X