హ్యుందాయ్ సర్వీస్‌తో నా భయంకరమైన అనుభవం - 1

ఇక సదరు షోరూమ్ సర్వీస్ విషయానికి వస్తే.. నా టైమ్ బ్యాడో ఏమో తెలియదు కానీ ఒక రోజు సిగ్నల్ వద్ద ఆగి ఉన్న నా కారును వెనుకగా వచ్చిన ఓ ట్రక్ ఢీకొట్టింది. దాంతో వెనుకవైపు బంపర్, బూట్ స్పేస్ పూర్తిగా దెబ్బతిన్నది. ఆ తర్వాత నేను సర్వీస్ సెంటర్ వ్యక్తులకు ఫోన్ చేయగా, డ్యామేజ్ అయిన కారును సర్వీస్ స్టేషన్ వద్ద వదలి వెళ్లమని వారు చెప్పారు.
సర్వీస్ సెంటర్ వాళ్లు చెప్పినట్లుగానే, నేను నా ఐ10 కారును సర్వీస్ సెంటర్ వదలి పెట్టి వెళ్లాను. కేవలం 3 రోజుల్లో కారును డెలివరీ చేస్తానని సర్వీస్ మేనేజర్ హామీ ఇచ్చాడు. అయితే అది జరగలేదు. ఎన్నో సార్లు ఫోన్ చేసి, పలు దఫాలు సర్వీస్ సెంటర్‌కు వెళ్లిన పిమ్మట వారు కారు పనిని మొదలు పెట్టడం జరిగింది. మూడు రోజుల్లో డెలివరీ ఇస్తామని చెప్పిన వాళ్లు 15 రోజుల తర్వాత నా కారును డెలివరీ చేశారు. మళ్లీ షోరూమ్ కండిషన్‌లో కారు తిరిగి నా దగ్గరకు వస్తుందని నేను భావించాను.
కానీ మళ్లీ అన్నీ సమస్యలే. బ్రేక్ లైట్లు వెలగటం లేదు, కారు లోపలి వైపు నుండి వెనుక డోర్‌ను ఓపెన్ చేయటం సాధ్యం కావటం లేదు. మళ్లీ సర్వీస్ సెంటర్ వాళ్లకు ఫోన్ చేశాను. ఎలక్ట్రికల్ సమస్య వల్ల బ్రేక్ లైట్లు వెలగకుండా పోయింటుందని సర్వీస్ సెంటర్ వాళ్లు చెప్పి, కారును మరోసారి సర్వీస్ సెంటర్ వద్ద వదిలి వెళ్లమని చెప్పటం జరిగింది. ఆ తర్వాత రోజే నేను నా కారును సర్వీస్ సెంటర్ వదిలి వెళ్లాను.
ఆ రోజు సాయంత్రమే సర్వీస్ సెంటర్ ప్రతినిధులు ఫోన్ చేసి ఎలక్ట్రికల్ సమస్య పరిష్కారమైందని, మీ కారును తీసుకువెళ్లవచ్చని చెప్పారు. ఈసారైనా కారు షోరూమ్ కండిషన్‌లో ఉంటుదని నేను అనుకున్నాను. అయితే, ఈ పరిస్థితులతో విసుగెత్తిపోయిన నాకు నా కారును బయటకు తీయడం ఇష్టం లేక గ్యారేజ్‌లోనే పార్క్ చేసి ఉంచాను.


Click it and Unblock the Notifications








