హ్యుందాయ్ సర్వీస్‌తో నా భయంకరమైన అనుభవం - 2

ఓ రోజు మా బంధువును డ్రాప్ చేయాల్సి వచ్చి కారును బయటకు తీద్దామని ఎంతో ఉత్సాహంతో ప్రయత్నించగా, రిమోట్ లాక్ పనిచేయలేదు. రిమోట్‌లో ఏదైనా సమస్య ఉండి డోర్ ఓపెన్ కాలేదేమోనని అనుకున్నా. సరేనని నార్మల్ కీ ద్వారా డోర్ ఓపెన్ చేసి ఇంజన్ ఆన్ చేశా. సర్‌ప్రైజ్.. ఏంటంటే లైట్లు వెలగటం లేదు, ఇంజన్ ఆన్ కావటం లేదు.

వెంటనే మళ్లీ సర్వీస్ సెంటర్‌కు ఫోన్ చేశా. బ్యాటరీ డ్రై అయి ఉండొచ్చని, అందుకునే ఆన్ కావటం లేదేమోనని వారు చెప్పారు. నాకు చిర్రెత్తిపోయింది. అది శనివారం రాత్రి కావడంతో మెకానిక్‌ను తర్వాతి రోజు ఉదయం పంపిస్తామని సర్వీస్ సెంటర్ వాళ్లు చెప్పారు. ఆదివారం ఉదయం 11.00 గంటలైనా సర్వీస్ సెంటర్ వాళ్లు రాలేదు. ఫోన్లు మీద ఫోన్లు చేస్తే మధ్యాహ్నం 1.00 గంటకు మెకానిక్ వచ్చాడు.

సర్వీస్ ఇంజనీర్ మరొక బ్యాటరీతో ఇంజన్ ఆన్ చేశాడు. రియర్ బూట్‌ను క్లోజ్ చేసినప్పుడు లైట్ ఆగిపోవటం లేదు. అయితే, ఎలక్ట్రిక్ వైరింగ్ అంతా కూడా పర్‌ఫెక్ట్ గానే ఉందని అతను చెప్పాడు. ఇలాంటి సమస్యలను రోడ్ సైడ్ మెకానిక్‌లు పరిష్కరించలేరు. మళ్లీ కారును సర్వీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లమని సదరు సర్వీస్ ఇంజనీర్ సలహా ఇచ్చాడు.

అయితే, నాకు ఈసారి సర్వీస్ సెంటర్‌కు మూడ్, ఇంట్రెస్ట్ అస్సలు లేవు. సర్వీస్ సెంటర్ వాళ్లకి ఫోన్ చేసి వాళ్లనే కారును తీసుకు వెళ్లమని గట్టిగా చెప్పాను. సర్వీస్ స్టేషన్ నా కళ్ల ముందే దూదితో పెయింట్ టచప్‌లు చేశారు. ఇవన్నీ చూసిన ఇక వీళ్లతో వాదనకు దిగడం వృధా అని నిర్ణయించుకుని, నా కారును అలాగే తీసుకువెళ్లిపోయాను.

ఈ నా అనుభవం బట్టి నాకు అర్థమైంది ఏంటంటే.. కారు ఎంత మంచి మోడల్ అయినా సర్వీసింగ్ విషయంలో ఒకటి రెండు సార్లు ఆలోచించి సదరు బ్రాండ్‌ను కొనుగోలు చేయాలని తెలుసుకున్నాను.

ఇది రాజేష్ గారు మాతో పంచుకున్న అతని స్వానుభవం. మీరు మీ జీవితంలో జరిగిన ఇలాంటి చేదు, తీపి అనుభవాలను మాతో పంచుకోండి. మేము వాటిని మా తెలుగు డ్రైవ్ స్పార్క్‌లో ప్రచురిస్తాం. మీ అనుభవాలను ఏ భాషలోనై సరే (తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మళయాలం, తమిళ్) [email protected] మెయిల్ ఐడిపై మాకు మెయిల్ చేయగలరు.

రాజేష్ అనుభవాన్ని బట్టి మేము (డ్రైవ్ స్పార్క్) మా పాఠకులకు అందించే చిన్న సలహా ఏమిటంటే.. అన్ని సర్వీస్ సెంటర్లలోనూ ఇలాగే జరుగుతుందున్న గ్యారంటీ ఏమీ లేదు. కాకపోతే కారును కొనుగోలు చేసేముందు ఆ మోడల్ అందాన్ని చూసి మైమర్చిపోకుండా, దాని సర్వీసింగ్ ఎలా ఉంది, స్పేర్ పార్ట్స్ లభ్యత ఎలా ఉంది తదితర విషయాలను గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే కొనుగోలు చేయాలి.

More from DriveSpark

Article Published On: Tuesday, March 27, 2012, 11:50 [IST]
English summary
Here is an user experience with his new i10 car and Hyundai service. Rajesh has purchased i10 kappa sports model car on Feb 1st week 2012 from Hyundai dealer in Bangalore. He had a very bad experience with Hyundai service.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+