ఎక్స్‌యూవీ500ని కొనటానికి 13 కారణాలు - పార్ట్ 2
3. తిరుగులేని పెర్ఫామెన్స్:
మహీంద్రా ఎక్స్‌యూవీ500లో అమర్చిన 2.2 లీటర్ ఎమ్‌హాక్ 140 ఇంజన్ తిరుగులేని పెర్ఫామెన్స్‌ను అందిస్తుంది. ఇది గరిష్టంగా 140 బిహెచ్‌పిల శక్తిని, 330 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్‌లో ఉపయోగించిన 5వ తరం (ఫిఫ్త్ జనరేషన్) వేరియబల్ టర్బోఛార్జర్ ద్వారా ఇది కేవలం 5.4 సెకండ్లలోనే 0-60 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది ఇంతటి అధిక పవర్‌ను కలిగి ఉన్నప్పటికీ, మైలేజ్ విషయంలో ఎలాంటి రాజీపడకుండా, ప్రతి లీటరుకు 15 కి.మీ. (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) మైలేజ్‌ను ఇస్తుంది.
4. హిల్ డిసెంట్, హిల్ హోల్డ్ కంట్రోల్:
మహీంద్రా ఎక్స్‌యూవీ500 హిల్ డిసెంట్, హిల్ హోల్డ్ కంట్రోల్ అనే ఫీచర్‌తో లభిస్తుంది. ఈ ఫీచర్ల ద్వారా కొండ ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు దిగుడు రోడ్లు (స్లోప్ రోడ్స్) వచ్చినప్పుడు హిల్ డిసెంట్ ఫీచర్ దానిని గుర్తించి, ఆటోమేటిక్‌గా ఆన్ అయి హెచ్చరికతో పాటు వాహనానికి సహకరిస్తుంది. అలాగే, హిల్ హోల్డ్ ఫీచర్ సాయంతో ఎగుడు రోడ్లపై వాహనాన్ని నిలపాల్సి వచ్చినప్పుడు, మళ్లీ అక్కడి ముందు కదలడానికి ప్రయత్నించప్పుడు వాహనం వెనక్కు రాకుండా ఉన్న చోటి నుండే ముందుకు వెళ్లటానికి సహకరిస్తుంది.
5. డ్యూయెల్ మాస్ ఫ్లైవీల్ (డిఎమ్ఎఫ్):
డిఎమ్ఎఫ్ ఇంజన్ శబ్ధాన్ని, వైబ్రేషన్‌ను, హార్ష్‌నెస్‌ను తగ్గించడంలో సహకరించి, సౌకర్యవంతమైన మరియు సున్నితమైన గేర్ షిఫ్ట్ అనుభూతిని కల్పిస్తుంది. సాధారణ ఎస్‌యూవీల్లో ఇది అంత సులువుగా సాధ్యం కాదు. అందుకే ఎక్స్‌యూవీ500 మార్కెట్లోని ఈ సెగ్మెంట్లో అత్యంత ఉత్తమమైన ఉత్పత్తిగా నిలిచింది.
6. సిక్స్-స్పీడ్ ట్రాన్సిమిషన్ (ఆరు గేర్లు):
మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీలో 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించారు. ఇది పూర్తిగా ఇండియాలో అభివృద్ధి చేయబడి, పరీక్షించబడిన మొదటి 6-స్పీడ్ ట్రాన్సిమిషన్. దీని వలన ఇంజన్ టార్క్, స్పీడ్ పెరగడటమే కాకుండా, మంచి యాక్సిలరేషన్‌ను, మైలేజ్‌ను కూడా పొందవచ్చు.
మరింత సమాచారం కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications









