ఎక్స్‌యూవీ500ని కొనటానికి 13 కారణాలు - పార్ట్ 3
7. ఇంటరాక్టివ్ టార్క్ మేనేజ్‌మెంట్ (ఐటిఎమ్)తో కూడిన ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడి):
మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడి) ఆప్షన్‌తో కూడా లభిస్తుంది (టాప్ ఎండ్ వేరియంట్ మాత్రమే). ఆల్-వీల్ డ్రైవ్ కలిగిన వాహనాల్లో ఇంజన్ నుంచి వచ్చే శక్తి వాహనంలో అన్ని చక్రాలకు సమానంగా పంపిణీ కాబడి, డ్రైవర్‌కు వాహనంపై మంచి కంట్రోల్‌ను ఇస్తుంది. జారుడు తలాలు, భారీ వర్షాలు, మంచు లేదా ఐస్ వంటి పరిస్థితుల్లో కూడా వాహనం కంట్రోల్‌లోనే ఉండేందుకు ఈ ఆల్-వీల్ డ్రైవ్ ఫీచర్ సహకరిస్తుంది.
ఇందులో ఉపయోగించిన నెక్స్‌ట్రాక్ టిఎమ్ అనే నెక్స్ట్ జనరేషన్, ఎలక్ట్రానిల్లీ కంట్రోల్డ్, ఆన్-డిమాండ్ ఇంటరాక్టివ్ టార్క్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అవసరమైనప్పుడు క్లచ్, ఇతర వాహన సిస్టమ్‌లను ఆటోమేటిక్‌గా నియంత్రిస్తుంది. ఇది ఇంజన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ యాంగిల్ సెన్సార్, యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి వాటిని ఆటోమేటిక్‌గా నియంత్రించి, టార్క్‌ను ముందు, వెనుక చక్రాలకు ఆటోమేటిక్‌గా పునఃపంపిణీ (రీడిస్ట్రిబ్యూట్) చేస్తుంది.
8. స్టాటిక్ బెండిగ్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్:
సాంప్రదాయ హ్యాలోజెన్ హెడ్‌ల్యాంప్స్ కన్నా ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ ఎన్నో రెట్లు మెరుగైనవి. మహీంద్రా ఎక్స్‌యూవీ500లో అమర్చిన స్టాటిక్ బెండిగ్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ రాత్రివేళల్లో స్పష్టమైన కాంతిని వెలువరిస్తాయి. అంతేకాకుండా.. ఇందులో ఉన్న 'స్టాటిక్ బెండిగ్' అనే విశిష్టమైన ఫీచర్ ద్వారా కారును టర్న్ చేసినప్పుడు, వాహనం టర్న్ అయ్యే వైపును బట్టి (కుడి లేదా ఎడమ వైపుకు) ఆటోమేటిక్‌గా కాంతి సదరు మూలలకు సైతం వెలువడుతుంది. సాధారణ హెడ్‌ల్యాంప్స్‌లో ఇది సాధ్యం కాదు.
9. మైక్రో-హైబ్రిడ్ టెక్నాలజీ:
మహీంద్రా స్కార్పియోలో ఉపయోగించిన సక్సెస్‌ఫుల్ మైక్రో-హైబ్రిడ్ టెక్నాలజీని మహీంద్రా ఎక్స్‌యూవీ500లో కూడా ఉపయోగించారు. ఈ టెక్నాలజీ ఇటు కేవలం ఇంధనం ఆదా చేయటంలో తోడ్పడటమే కాకుండా, అటు పర్యావరణాకి వాహన కాలుష్యం వలన కలిగే హానిని కూడా తగ్గిస్తుంది. ఈ టెక్నాలజీ వలన పొడవాటి ట్రాఫిక్ జామ్‌లు లేదా ఎక్కువ సేపు ఆగి ఉండే ట్రాఫిక్ సిగ్నల్స్‌లో కారు ఇంజన్‌ను స్విచ్ ఆఫ్ చేయకుండానే, వాహనాన్ని న్యూట్రల్ గేర్‌లో ఉంచిన 2.5 సెకండ్ల తర్వాత ఇంజన్ ఆటోమేటిక్‌గా స్టాండ్‌బై మోడ్‌లోకి వెళ్తుంది, తిరిగి క్లచ్‌ను నొక్కగానే ఇంజన్ ఆన్ అవుతుంది. దీని వలన ఇంధనం ఆదా అవటమే కాకుండా తక్కువ కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే విడుదలవుతుంది.
మరింత సమాచారం కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications









