ఎక్స్‌యూవీ500ని కొనటానికి 13 కారణాలు - పార్ట్ 4
10. బ్లూ సెన్స్ టెక్నాలజీతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్:
మహీంద్రా ఎక్స్‌యూవీ500లో ఆరు అంగుళాల ఎల్‌సిడి టచ్‌స్క్రీన్‌తో కూడిన పూర్తి ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ ఉంది. సంగీతం (మ్యూజిక్), వాతావరణం (టెంపరేచర్), నావిగేషన్ (జిపిఎస్) వంటి వాటిని నియంత్రించడానికి ఇది ఉపకరిస్తుంది.
జిపిఎస్ నావిగేషన్ సిస్టమ్ - దీని ద్వారా దాదాపు 1,200 నగరాల్లో 1.5 మిలియన్ కి.మీ. మేర రోడ్డును మూల మూలతో సహా చూసేందుకు వీలవుతుంది. ఇది ఎనిమిది ప్రాంతీయ భాషలకు తక్కువ కాకుండా వాయిస్ గైడెన్స్‌ను అందిస్తుంది. ఇది కేవలం మార్గం చూపిందుకు మాత్రమే కాకుండా రెస్టారెంట్లు, ఏటిఎమ్‌లు, ఫ్యూయెల్ స్టేషన్లు, సినిమా థియేటర్లు వంటి వాటికి సంబంధించి 50 లక్షల టచ్ పాయింట్ల సమాచారాన్ని కూడా డ్రైవర్‌కు అందిస్తుంది.
డ్రైవర్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్ - కారుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ డ్రైవర్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్‌లో నిక్షిప్తం చేశారు. ప్రస్తుతం ట్యాంక్‌లో ఉన్న ఇంధనంతో ఎన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు, ప్రతి టైరులో ఉన్న గాలి పీడనం (ఎయిర్ ప్రెజర్) మరియు దాని ఉష్ణోగ్రత (టెంపరేచర్) మొదలైన వాటికి సంబంధించిన సమాచారాన్ని ఇది తెలియజేస్తుంది. అంతేకాకుండా.. మీ కోసం క్యాబిన్‌లోని ఉష్ణోగ్రతలను సైతం ఇది కంట్రోల్ చేస్తుంది.
రివర్స్ పార్క్ అసిస్ట్ సిస్టమ్ - ఇందులో రివర్స్ పార్క్ అసిస్ట్ సిస్టమ్ ద్వారా మరొకరి సాయం లేకుండానే మీరు వాహనాన్ని వెనక్కు తిప్పడాని (రివర్స్ చేయటానికి) తోడ్పడుతుంది. వెనుక వైపు బంపర్‌కు అమర్చబడి ఉండే సెన్సార్ల ద్వారా, మీ వాహనానికి వెనుక ఉండే వాహనం లేదా వస్తువుకు మీరు ఎంత దూరంలో ఉన్నారనే విషయాన్ని ఎల్‌సిడిపై చూడవచ్చు.
వాయిస్ కమాండ్స్, క్రూయిజ్, ఆడియో కంట్రోల్స్ - మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్టీరింగ్ వీల్‌పై ఉండే వాయిస్ కమాండ్స్, క్రూయిజ్, అడియో కంట్రోల్స్ ఫీచర్లు మీకు సౌకర్యాన్ని, సురక్షితను కల్పిస్తాయి. స్టీరింగ్‌పై నుంచి మీ చేతులు తీయాల్సిన అవసరం లేకుండానే, వాయిస్ కమాండ్ల ద్వారా ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కంట్రోల్ చేయవచ్చు.
క్రూయిజ్ కంట్రోల్ - హైవేలపై లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లేటప్పుడు క్రూయిజ్ కంట్రోల్ మీ జర్నీని మరింత సౌకర్యవంతం చేస్తుంది. వకారును ఒక నిర్ధిష్టమైన వేగానికి తీసుకువెళ్లిన తర్వాత ఈ క్రూయిజ్ కంట్రోల్‌ను ఆన్ చేస్తే యాక్సిలరేటర్ పెడల్‌ను ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండానే ఇది ఆటోమేటిక్‌గా సెట్ చేసిన వేగంతో ముందుకు సాగిపోతుంది. దీనిని క్యాన్సిల్ చేయడానికి లేదా రీసెట్ చేసుకోవటానికి బ్రేక్ లేదా యాక్సిలరేటర్ పెడల్‌ను తిరిగి ప్రెస్ చేస్తే సరిపోతుంది.
స్టీరింగ్‌పై ఉండే కంట్రోల్స్ - స్టీరింగ్‌పై ఉండే కంట్రోల్స్ ద్వారా బ్లూ సెన్స్ టెక్నాలజీని ఉపయోగించుకొని మహీంద్రా ఎక్స్‌యూవీ500లో ఉండే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ద్వారా మీ బ్లూటూత్ ఆధారిత మొబైల్ డివైజ్‌లను కంట్రోల్ చేయవచ్చు. ఇది మీ మొబైల్‌లోని ఫోన్ బుక్‌ను యాక్సెస్ చేయడానికి, మొబైల్‌ను ముట్టుకోకుండానే ఫోన్ కాల్స్ చేయడాని, కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి సహకరిస్తుంది.
మరింత సమాచారం కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications









